Breaking News

ర్యాంకు సరే..లైఫ్‌ ఏది?

Published on Wed, 09/23/2026 - 12:14

ఎనిమిదో తరగతి... ఆ వయసు పిల్లల ముఖాల్లో అమాయకత్వం ఉండాలి...జేబుల్లో గోళీకాయలు ఉండాలి...సాయంత్రమైతే ప్లేగ్రౌండ్‌ నుంచి వచ్చే చెమట వాసన ఉండాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లోని ఇళ్లల్లో ఏముంటోందో తెలుసా? ‘ఐఐటీ ఫౌండేషన్‌ మెటీరియల్‌’... ‘శనివారం వీక్లీ టెస్ట్‌ సిలబస్‌’... ముంబై ఐఐటీలో సాహిల్‌ ఆత్మహత్య కేవలం ఒక వార్త కాదు. అతిగా వ్యాపించిన ‘ఐఐటి మతం’ తాలూకు హెచ్చరిక.ర్యాంకు సరే... ప్రాణం నిలుపుకోవడం ముఖ్యమని పిల్లలకు నేర్పాల్సింది ఎవరు?

తల్లిదండ్రులా... కోచింగ్‌ సెంటర్లా?
పిల్లలు చని΄ోవడం అంటే ఒక జాతి భవిష్యత్తు కూలిపోవడమే. చిగురించి చెట్టు కావాల్సిన ప్రాణం కళ్ల ముందే మోడువారి΄ోతుంటే చూస్తూ నిలబడటం కంటే దారుణం మరొకటి ఉండదు. ఐఐటి క్యాంపస్‌లోనో, రాజస్థాన్‌ కోటాలోనో, ట్రిపుల్‌ ఐటిలోనో, తెలుగు రాష్ట్రాల్లోనో, హాస్టల్స్‌లోనో పిల్లలు ప్రాణాలు వదులుకునే  స్థితికి వస్తున్నారంటే కారణం ఎవరు? చదువును జ్ఞానం నుంచి అవమానంగా మార్చింది ఎవరు? క్లాస్‌ ఫస్ట్‌ రాకపోతే, స్కూల్‌ ఫస్ట్‌ రాకపోతే, స్టేట్‌ ర్యాంకు రాకపోతే అవమానం అని ఆ లేత మెదళ్ల లో విషం ఎక్కించింది ఎవరు? పిల్లలు బాగుండాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరూ? కాని పిల్లలు ‘తమకు నచ్చినట్టుగా’ ఉండాలనుకోవడంలోనే తప్పు మొదలవుతోంది. పేరున్న ఇంజనీరింగ్‌ కాలేజీలకో, ఐఐటీకో పంపడం వరకే మన హడావిడి. 

కానీ అక్కడికి వెళ్లాక వాడు ఎలా బతకాలి? ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి? ఒంటరితనాన్ని ఎలా జయించాలి? ఎవరూ నేర్పడం లేదు. ఒక్క బ్యాక్‌లాగ్‌ వస్తే ‘అమ్మో ... నాన్నకు తెలిస్తే’ అని గుండె ఆగినంత ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రులు ఇప్పుడైనా గుండెల మీద చేయి వేసుకుని ప్రశ్నించుకోవాలి– నా బిడ్డ నిజంగా సంతోషంగా ఉన్నాడా? వాడు మోయగలిగినంత బరువే మోస్తున్నాడా, లేక మనం మోయమని పెట్టిన బరువు కింద నలిగిపోతున్నాడా?

విద్యార్థులు ఫ్లెక్సీల మీద ఫొటోలు కారు...
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కోచింగ్‌ సెంటర్లు పిల్లలను కేవలం ఫ్లెక్సీల మీద ర్యాంకులుగా మాత్రమే చూస్తున్నాయి. తమ సంస్థకు డిమాండ్‌ పెరగడానికి పిల్లల మీద ప్రెజర్‌ పెంచేస్తున్నాయి. కోచింగ్‌ సెంటర్లకు ఒక విషయం అర్థం కావాలి. వాళ్లు ఇంజనీర్లను తయారు చేస్తున్నారు, రోబోలను కాదు. వీరు ఏం చేయాలి?

ప్రతి 100 మందికి ఒక సైకాలజిస్ట్‌ను నియమించాలి. మ్యాథ్స్, ఫిజిక్స్‌ లెక్చరర్‌తో పాటు, ట్రైన్డ్‌ సైకలాజికల్‌ కౌన్సెలర్‌ తప్పనిసరి ఉండాలి. వారానికి ఒకసారి మార్కులతో సంబంధం లేని కౌన్సెలింగ్‌ క్లాస్‌ పెట్టాలి. ‘బ్యాక్‌ లాగ్‌ వస్తే ఏం చేయాలి? నిద్ర పట్టకపోతే ఏం చేయాలి?’ ఇలాంటివి చెప్పే క్లాస్‌.

ప్రతి శనివారం టెస్ట్‌ పెట్టి ఆదివారం పేరెంట్స్‌కి మెసేజ్‌ పెట్టి భయపెట్టడం ఆపాలి. నెలకు ఒకసారి స్పోర్ట్స్‌ డే, మ్యూజిక్‌ డే పెట్టి ఉత్సాహ పరచాలి. చెమటపట్టే వరకు ఆడనివ్వాలి. చెమటతోపాటు ఒత్తిడి కూడా బయటకు పోతుంది.

ఇల్లు వదిలి హాస్టల్‌కి వెళ్లాక...
ఇంట్లో ఉన్నప్పుడు ఏడిస్తే అమ్మ చూస్తుంది. హాస్టల్‌లో ఏడిస్తే గోడలు మాత్రమే చూస్తాయి. బిడ్డ ఇల్లు వదిలాక తల్లిదండ్రులు చేయాల్సింది ఫీజు కట్టడం కాదు, ఫీలింగ్స్‌ను పట్టించుకోవడం.

రోజూ వీడియో కాల్‌ చేసి ముఖం చూడండి. కళ్ళు ఉబ్బి ఉన్నాయా? నిద్రపోలేదా? గది చిందరవందరగా ఉందా? మాట తడబడుతోందా? ఇవే డిప్రెషన్‌కు తొలి సంకేతాలు. ‘ఎంత చదివావ్‌?’ అని కాదు, ‘భోజనం చేశావా? నీ రూమ్మేట్‌తో బాగున్నావా?’ అని అడగండి.

బిడ్డతో ఒక ఒప్పందం చేసుకోండి. ‘కన్నా.. నీకు చాలా ఒత్తిడిగా ఉంది, మాకు చెప్పలేకపోతున్నావు అనిపించినప్పుడు మాకు ఏ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇంటికి రావాలి... లేదా మమ్మల్నయినా నీ దగ్గరకు రమ్మని పిలవాలి. రెండు సమయాల్లోనూ మేము నిన్నే సపోర్ట్‌ చేస్తాం’ అని. ‘నువ్వు పాసైనా చెప్పు ఫెయిల్‌ అయినా చెప్పు... కొంపలేం మునగవు... ఫ్యాకల్టీతో ఏవైనా సమస్యలుంటే చెప్పు... ఏం చేయాలో ఆలోచిద్దాం... అసలు నీకు సమస్య ఉందనిపించగానే మాతో చెప్పేయ్‌’ అని భరోసా ఇవ్వాలి.

ఐఐటీలో సీటు రాక΄ోతే మరో కాలేజీ ఉంటుంది, మరో కోర్సు ఉంటుంది, మరో జీవితం ఉంటుంది. చదువులో వెనకబడితే కాస్త ముందు వెనుకలుగా పూర్తి చేయవచ్చు. కానీ బిడ్డే లేకపోతే ఏమీ ఉండదు. పిల్లల్ని డాక్టర్లు, ఇంజినీర్లుగా చూడాలనుకోవడం తప్పు కాదు. కానీ అంతకంటే ముందు వారిని మనుషులుగా, సంతోషంగా బతికే మనుషులుగా, తల్లిదండ్రుల తోడున్న మనుషులుగా బతకనివ్వండి.

‘మనసు’న్న తల్లిదండ్రులు...
ముంబై ఐఐటీలో సాహిల్‌ మరణం ఏ ఇంటి బిడ్డదోలే అని అనుకోవడానికి వీల్లేదు.  ప్రతి ఇంట్లో సాహిల్‌లాంటి అబ్బాయో అమ్మాయో పెరుగుతున్నారు. సైలెంట్‌గా ఒత్తిడిని అనుభవిస్తున్నారు. వాళ్లను కాపాడుకోవాలి. ఇందులో వేరే ప్రసక్తే లేదు. అందుకు ఏం చేయాలి?
∙ఇంట్లో పోలికలను నిషేధించండి. ‘పక్కింటి అబ్బాయి 98% తెచ్చుకున్నాడు’ అనే మాట వాళ్లను పాతాళానికి పడేస్తుంది. ఆ మాట తీసేసి ‘నిన్నటికంటే ఈ రోజు బాగా చేశావు’ అనండి.

‘అన్‌ కండిషనల్‌ లవ్‌’ చూపండి. ‘నువ్వు ఫస్ట్‌ వచ్చినా లాస్ట్‌ వచ్చినా మా బిడ్డవే’ అని చెప్పండి. ర్యాంకు వస్తేనే ప్రేమిస్తామన్న భావన తీసేయండి. ఫలానా సీటు రాక΄ోతే ఇంటి తలుపులు మూసుకు΄ోతాయన భయం తీసేయండి.

వినడం నేర్చుకోండి. సాయంత్రం ఇంటికి రాగానే ‘ఎన్ని మార్కులు వచ్చాయి?’ కాదు. ‘ఈ రోజు ఎలా గడిచింది?’ అని అడగండి. వాడు చెప్పేది మధ్యలో ఆపకుండా వినండి. 15 నిమిషాల ‘నో స్టడీ టాక్‌’ రోజూ పెట్టండి. మీరు మనసున్న తల్లిదండ్రులని పిల్లలకు అభిప్రాయం కలిగేలా చేయండి. 

ఇదీ చదవండి:

Videos

ఇవి ఏమైనా బ్యాంక్ అకౌంట్ లా.. అంబటి మాస్ ర్యాగింగ్...

క్రాంతి కుమార్ పై కుల వివక్ష! నా కొడుకు కేసులో సిట్ వేయరా!

బలమైన అభ్యర్థులను ఎంపిక చేయండి అని YS జగన్ చెప్పారు

అయ్య‌ప్ప మాల సాక్షిగా చెబుతున్నా... వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూట‌మి కొట్టుకుపోవ‌డం ప‌క్కా

CJP మరో డిమాండ్ CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందే

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి రంగం సిద్ధం.

స్టాక్ మార్కెట్ భారీ పతనం! ₹6 లక్షల కోట్లు ఆవిరి!

టీచర్లు అంటూ యువగళం టీమ్ బూతులు.. అనిత వ్యాఖ్యలకు ఇచ్చిపడేసిన పుష్ప శ్రీ వాణి

బండ బూతులు తిడుతూ..ఎలా కొట్టించిందంటే?

కొట్టుకుపోయిన కోస్తా.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు..

Photos

+5

హీరోయిన్ రాధ ఇంట గణనాథునికి ప్రత్యేక పూజలు.. ఫోటోలు

+5

బీచ్‌లో దేవకన్యలా హీరోయిన్ శ్రీలీల పోజులు.. ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో హీరోయిన్ శృతిహాసన్ గ్లామర్.. ఫోటోలు

+5

విశాఖలో భారీ వర్షం... నేలకొరిగిన చెట్లు (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరో ప్రిన్స్ పెళ్లి రిసెప్షన్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న .. నక్షత్ర (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నెక్లెస్ రోడ్డులో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు (ఫొటోలు)

+5

ఏష నాగుల కట్ట మీద.. వ‌ర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసిన కీర్తి సురేష్‌..(ఫొటోలు)

+5

ఏపీ : తీవ్ర వాయుగుండం...ఉత్తరాంధ్ర అతలాకుతలం (ఫొటోలు)

+5

వేడుకకు వేళాయే...రేపు ఉదయం 7 గంటలకు శోభాయాత్ర (ఫొటోలు)