Breaking News

ఆర్గానిక్‌ ఐస్క్రీమ్‌ ట్రెండ్స్‌..! జస్ట్‌ ఒక రూపాయికే..

Published on Fri, 04/25/2025 - 09:34

ఐస్క్రీమ్‌.. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అమితంగా ఇష్టపడే ఆహారం. ముఖ్యంగా వేసవి వచ్చిందంటే అర్ధరాత్రి వరకూ ఐ్రస్కీమ్‌ పార్లర్‌ చుట్టూ చెక్కర్లు కొడతారు హైదరాబాద్‌ నగర వాసులు. దీనికితోడు భాగ్యనగరం వేదికగా విభిన్న స్టోర్స్‌లో వినూత్న ఫ్లేవర్లలో ఐస్క్రీమ్స్‌ అందుబాటులో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగర వేదికగా వినూత్నంగా ఒక రూపాయికే ఒక గ్రాము ఐ్రస్కీమ్‌ అంటూ ఐస్‌బర్గ్‌ ఆర్గానిక్‌ ఐస్క్రీమ్స్‌ సందడి చేస్తోంది. ఇవి పూర్తిగా ఆర్గానిక్‌ ఉత్పత్తులు కావడం మరో విశేషం. 

గోంధ్‌ గమ్, గ్వార్‌ గమ్‌ వెరైటీలు.. 
దేశంలోనే మొట్టమొదటి ఏకైక ఆర్గానిక్‌ క్రీమరీ అయిన ఐస్‌బర్గ్‌ ఆర్గానిక్‌ ఐస్క్రీమ్స్‌ హైదరాబాద్‌లో తన సేవలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా బేగంపేటలో నూతన ఔట్‌లెట్‌ను ప్రారంభించింది. పూర్తిగా ఆర్గానిక్‌ విధానంలో ఐస్క్రీమ్‌ను అందించే ఈ బ్రాండ్‌ ఏ2 దేశీ ఆవుపాలు, ఆర్గానిక్‌ యెల్లో బటర్‌తో పాటు సహజ సిద్ధమైన తీపి పదార్థాలైన ధాగా మిశ్రీ, కోకోనట్‌ షుగర్, బెల్లం వంటి వాటితో రుచికరమైన మనసుదోచే ట్రీట్‌ అందిస్తోంది. 

వినూత్నంగా గోంధ్‌ గమ్, గ్వార్‌ గమ్‌తో పేటెంట్‌ పొందిన ప్రిజర్వేటివ్‌–రహిత ఫార్ములాతో ఐస్‌ బర్గ్‌ సరికొత్త పదార్థాలను నగర వాసులకు పరిచయం చేసింది. ప్రీమియం నట్స్, డీహైడ్రేటెడ్‌ ఫ్రూట్స్, ఆర్గానిక్‌ సిరప్‌లతో 40కి పైగా ఆర్గానిక్‌ టాపింగ్స్‌తో కస్టమర్లకు మధురానుభూతిని అందిస్తోంది.  ఔట్‌ లెట్‌లో డెత్‌ బై చాక్లెట్‌ సండేస్, ఆర్టిసానల్‌ ఐస్క్రీం కేక్స్‌ వంటి సిగ్నేచర్‌ ఆఫర్లు మాదాపూర్, బేగంపేట, కేపీహెచ్‌బీలో హైదరాబాదీలను ఆకట్టుకుంటున్నాయి. 

వంద మందికి పైగా సేంద్రీయ రైతులతో ఐస్‌బర్గ్‌ భాగస్వామి అయ్యింది. బేగంపేటలో గురువారం నిర్వహించిన ప్రారంభోత్సవంలో సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ మరో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  

(చదవండి: అంతా.. ఫ్యాన్సీ ఫ్యాన్సే..! ఏంటీ ఫ్యాన్సీ నెంబర్ల క్రేజ్‌..)

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)