Breaking News

సైన్సు సినిమా.. అక్టోబర్‌ స్కై

Published on Sat, 10/05/2024 - 12:50

‘అక్టోబర్‌ స్కై’ 1999లో విడుదలైన హాలీవుడ్‌ సినిమా. అమెరికాలోని వెస్ట్‌ వర్జీనియాలో కోల్‌ వుడ్‌  అనే ఓ చిన్న గ్రామంలో జరిగిన నిజజీవిత కథ ఆధారంగా తీశారు. ఆ గ్రామానికి చెందిన నలుగురు కుర్రాళ్ల కథ ఇది. కథ జరిగిన కాలం 1957. పెద్దగా సౌకర్యాలు లేని ఓ కుగ్రామానికి చెందిన ఆ కుర్రాళ్లకి కొన్ని కారణాల వల్ల రాకెట్‌ తయారు చెయ్యాలని ఆలోచన వస్తుంది. 

ఎన్నో కష్టనష్టాలకి ఓర్చి ఎంతో వ్యతిరేకతని ఎదుర్కొని చివరికి చిన్న రాకెట్‌ తయారు చేస్తారు. ఆ రాకెట్‌ని ఓ జాతీయస్థాయి సైన్స్ ప్రాజెక్ట్‌ పోటీలో ప్రదర్శించి మొదటి స్థానంలో విజయం సాధిస్తారు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఈ కథలో ముఖ్య పాత్ర పేరు ‘హోమర్‌ హికమ్‌’. ఆ హోమర్‌ హికమ్‌ ఆ తర్వాతి కాలంలో తన రాకెట్‌ తయారీ అనుభవాన్ని ‘రాకెట్‌ బోయ్స్‌’ పేరుతో పుస్తకం రాశాడు. యూనివర్సల్‌ స్టూడియోస్‌ వారు పుస్తకం హక్కులు కొని ‘అక్టోబర్‌ స్కై’ పేరుతో సినిమాగా విడుదల చేసి హిట్‌ సాధించారు. 

పుస్తకం పేరు ‘రాకెట్‌ బోయ్స్‌’ను యథాతథంగా సినిమాకు కూడా పెడితే ‘ముప్పై ఏళ్లు నిండిన స్త్రీలు ససేమిరా చూడరు’ అని యూనివర్సల్‌ స్టూడియోస్‌ వారు  అభిప్రాయపడడం చేత Rocket Boys అని మార్చవలసి వచ్చింది. ఇక్కడ తమాషా ఏంటంటే 'Rocket  అన్న పదజాలంలోని అక్షరాలని తారుమారు చేస్తే అది  'October Sky' అవుతుంది. ఈ కథ పిల్లలకి ఎంత స్ఫూర్తి దాయకంగా ఉంటుందంటే ఈ పుస్తకాన్ని అమెరికాలో ఎన్నో బళ్లు పిల్లలు తప్పనిసరిగా సిలబస్‌లో పెట్టాయి. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)