నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి
Breaking News
V I Lenin Birth Anniversary లెనిన్ ప్రాసంగికత
Published on Tue, 04/22/2025 - 10:09
మార్క్స్ – ఏంగెల్స్ల రచనలను అధ్యయనం చేసి, వెనుకబడ్డ రష్యాలో సోషలిస్ట్ విప్లవాన్ని విజయవంతం చేసి ‘శాస్త్రీయ సోషలిస్టు సమాజా’న్ని ఈ భూమిపై మొదట నిర్మించినవాడు లెనిన్ మహాశయుడు. 1870 ఏప్రిల్ 22న రష్యాలోని ‘సింబర్క్స్’ పట్టణంలో జన్మించిన ఆయన అసలు పేరు వ్లదిమీర్ ఇల్యీచ్ ఉల్యానోవ్ . లెనిన్ అనేది ఆయన కలం పేరు. తన రచ నల ద్వారా అతివాద, మితవాద అరాచక వాదాన్ని ఎదుర్కొంటూ సోషలిస్టు విప్లవానికి కార్యక్రమ పంథా రూపొందించారు. లెనిన్ తన జీవితకాలంలో 10 సంవత్సరాలకు పైగా ప్రవాస జీవితం గడి పారు. ప్రవాసంలో ఉండగా ఆయన 30కి పైగా రచనలు చేశారు.
1916లో రాసిన ‘సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానపు అత్యు న్నత దశ‘ అందులో ఒకటి. 1917లో రష్యాలో సోషలిస్టు విప్లవం విజయవంతమైంది. రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యా ప్రముఖ పాత్ర వహించింది. ప్రపంచంలో సోషలిస్టు శిబిరం ఏర్పడింది. లెనిన్ నాయకత్వాన ఉన్న రష్యా కమ్యూనిస్టు పార్టీ వెనుకబడ్డ దేశాల్లో సామాజిక విముక్తి కొరకు, దోపిడీ రహిత సమాజం ఏర్పాటు కొరకు, వివిధ దేశాల్లో కమ్యూనిస్టు పార్టీల ఏర్పాటు కొరకు సహకరించింది.
సామ్రాజ్య వాదం కింద ప్రపంచ విప్లవం రెండు ప్రవాహాలుగా ఉంటుందన్నారు లెనిన్. సామ్రాజ్యవాద దేశాలలో సోషలిస్టు విప్లవంగానూ; ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికన్ దేశా లలో లేక అణచబడిన దేశాలలో ‘జనతా ప్రజాతంత్ర విప్లవాలుగా’నూ ఉంటుందని సూత్రీక రించారు. భారతదేశంలోని కమ్యూనిస్టులు మారిన జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల్లో లెనిన్ చేసిన ఈ సూత్రీకరణను దృష్టిలో ఉంచుకోవలసిన అవసరం, అధ్యయనం చేసి ఐక్యం కావ లసిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశం నేడు నయా వలస, నయా పెట్టుబడిదారీ దశలో ఉన్నది. అలాగే నయా ఫాసిజం హిందూ మతోన్మాద రూపంలో అమెరికన్ సామ్రాజ్యవాదా నికి జూనియర్ భాగస్వామిగా ఉంది. ఈ పరిస్థితుల్లో అన్ని కమ్యూనిస్టు పార్టీలు, దళిత, బహుజన పార్టీలు, ప్రజాతంత్ర సంస్థలు ఐక్యమై కాషాయ ఫాసిస్టు వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు కావాలి. ఇది లెనిన్ సూత్రీకరణకు అనుగుణంగా ఉంటుంది.
– మన్నవ హరిప్రసాద్
సీపీఐ (ఎమ్ఎల్) రెడ్ స్టార్ పొలిట్ బ్యూరో సభ్యుడు
(నేడు లెనిన్ 155వ జయంతి)
Tags : 1