Breaking News

ది ఓబీసీ జాతి జాగరణ పుస్తకం విడుదల

Published on Wed, 04/16/2025 - 12:27

"ది ఓబీసీ జాతి జాగరణ" పుస్తకం విడుదల — సామాజిక న్యాయంపై దృష్టి సారించిన మహాగాథా నుండి మరో ప్రబల రచనఅధికారి పి.నరహరి (ఐఏఎస్) మరియు న్యాయవాది ప్రతాప్‌రాజ్ సింగ్ రచయితలు

 భారత దేశ సామాజిక రాజకీయ చరిత్రలో మైలురాయిగా నిలిచేలా, “ది ఓబీసీ జాతి జాగరణ” పుస్తకం  అధికారికంగా విడుదలైంది. ప్రముఖ ఐఏఎస్ అధికారి పి.నరహరి, హైకోర్ట్ న్యాయవాది ప్రతాప్‌రాజ్ సింగ్ సంయుక్తంగా రచించిన ఈ గ్రంథాన్ని మహాగాథా ప్రచురించింది. ఇది సంస్కృతిక పునరుజ్జీవనం, వేద మంత్రాలు , ఆధునిక ఆలోచనల సమన్వయానికి నిలయంగా ఎదుగుతోందని ప్రచురణకర్తలు ప్రకటించారు. 

ఆరేళ్ళ లోతైన పరిశోధన, ఆరు రాష్ట్రాల యాత్ర రచయితలు ఆరు భారతీయ రాష్ట్రాల్లో ఆరేళ్లపాటు జరిపిన ప్రయాణం ద్వారా, అధ్యాపకులు, రాజకీయ నాయకులు, విద్యార్థి నేతలు, సామాజిక చింతకులు వంటి అనేక రంగాల వ్యక్తులతో చర్చలు  అనంతరం ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఇది ఓబీసీ వర్గాలలో పెరుగుతున్న అసమాధానాన్ని, వాటి ఆధారంగా ఏర్పడుతున్న సామాజిక రాజకీయ ఉద్యమాన్ని విశ్లేషిస్తుంది. 

 తొమ్మిది విభాగాలుగా  వచ్చిన  పుస్తకంలోని కీలక అంశాలు 

  • బ్రిటిష్ పాలనలో కులవృత్తులపై జరిగిన సామాజిక-ఆర్థిక దోపిడీ.
  • కాకా కలేల్కర్ కమిషన్ నుండి మండల్ కమిషన్ వరకు, న్యాయమూర్తి రోహిణి కమిషన్ వరకు జరిగిన చారిత్రక పరిణామాలు.
  •  రిజర్వేషన్, క్రీమీ లేయర్, రాజ్యాంగ న్యాయ విభాగాలపై ఉన్నత న్యాయస్థానాల తీర్పుల విశ్లేషణ.
  •  ప్రభుత్వ గణాంకాలు, అకడమిక్ అధ్యయనాలు, ఫీల్డ్ రీసెర్చ్ ద్వారా సమకాలీన ఓబీసీ స్థితిగతుల సమగ్ర విశ్లేషణ.
  • ఓబీసీ మేనిఫెస్టో — నూతన రాజకీయం కోసం మార్గసూచిక
  • ఓబీసీ మేనిఫెస్టో. ఇది దేశవ్యాప్తంగా ఓబీసీ నాయకులతో జరిపిన సమావేశాల ఫలితంగా రూపొందిన ప్రజా డిమాండ్ల సమాహారం. అన్ని
  • రాజకీయ పార్టీలకు సమర్పించిన ఈ మేనిఫెస్టో, ఓబీసీల సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతుంది.

"ఇది కేవలం పుస్తకమే కాదు, ఒక సంకల్పం — వినే స్పందించే, ఆచరించే భారతదేశాన్ని కలగనిచ్చే పిలుపు." అని రచయితలు పేర్కొన్నారు. మంత్రధ్వని ద్వారా శరీరానికి హీలింగ్ చేస్తున్నట్టే, శబ్దం ద్వారా సమాజానికి జాగృతి కలిగించడమే లక్ష్యమన్నారు.

మహాగాథా వ్యవస్థాపకుడు దేవ రుషి ఈ సందర్భంగా ఇలా అన్నారు: ఈ పుస్తకం గణాంకాల గురించి మాత్రమే కాదు — ఇది ఓ శబ్ద యాగం, ఓ న్యాయం కోసం సంచలనం. ఇది మహాగాథా లక్ష్యాన్ని ప్రతిబింబించే రచన.”


పుస్తకం వివరాలు:

● శీర్షిక: The OBCs Uprising
● రచయితలు: పి.నరహరి (ఐఏఎస్), ప్రతాప్‌రాజ్ సింగ్ (న్యాయవాది)
● ప్రచురణ సంస్థ: మహాగాథా
● భాష: ఇంగ్లీష్
● వర్గం: రాజకీయ శాస్త్రం, చరిత్ర, సామాజిక న్యాయం
● అందుబాటులో ఉంటుంది: ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్లు ,బుక్‌స్టోర్స్‌లో త్వరలో

#

Tags : 1

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)