Breaking News

వాయు కాలుష్యం నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే..!

Published on Mon, 12/02/2024 - 14:09

ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోతుంది. వాయు కాలుష్యం అంతకంతకు తీవ్రమై దేశరాజధాని ఢిల్లీ వంటి కొన్ని ప్రాంతాలను అల్లాడిపోయేలా చేస్తుంది. చలికాలంలో ఈ సమస్య మరింత తీవ్రతరంగా ఉంది. ముఖ్యంగా ఈ పొగమంచు కారణంగా పిల్లలు, పెద్దలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతోంది. 

దీని కారణంగా ప్రజలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, శ్వాసకోశ వ్యాధుల బారినపడుతున్నారు. అలాంటి సమస్యల నుంచి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే వ్యాధినిరోధక శక్తిని పెంచే బూస్టింగ్‌ షాట్‌ని తీసుకుంటే మంచిదని చెబుతున్నారు నిపుణులు. అదేంటో, ఎలా తయారు చేయాలో సవివరంగా తెలుసుకుందామా..!.

సీనియర్‌ సిటీజన్లు, చిన్నారులు వాయు కాలుష్యంతో ప్రభావితం కాకుండా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే బెస్ట్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఇమ్యూనిటీ బూస్టింగ్ షాట్‌ తీసుకోవాలని చెబుతున్నారు. దీనికోసం అల్లం, నారింజ, ఉసిరిలతో చేసిన పానీయాన్ని తీసుకోమని సూచిస్తున్నారు. వీటిలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని తెలిపారు. 

తయారీ విధానం..

  • పెద్ద అల్లం ముక్కను చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి.

  • నారింజ, గింజతో సహా ఉసిరికాయలను తీసుకోండి

  • ఈ మూడింటిని మొత్తగా గ్రైండ్‌ చేసి వడకట్టండి

  • దీన్ని ఐస్‌ ట్రైలో వేసి స్టోర్‌ చేసుకోండి

కావాల్సినప్పుడూ ఈ ఐస్‌క్యూబ్‌ని గ్లాస్‌లో వేసుకుని కొద్దిగా వేడినీరు జోడించండి. దీన్ని రోజు తీసుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తి వృద్ధి అవ్వడమే గాక ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు నిపుణులు.

 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వ్యైద్యులను సంప్రదించడం మంచిది.

(చదవండి: నోరూరించే కేఎఫ్‌సీ చికెన్‌ తయారీ వెనుకున్న ఇంట్రస్టింగ్‌ స్టోరీ..!)

 

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)