Breaking News

నాకు నచ్చిన పాత్ర ఇందిర

Published on Mon, 03/03/2025 - 01:07

పి.శ్రీదేవి రాసిన నవల ‘కాలాతీత వ్యక్తులు’లోని ఇందిర చాలా వినూత్నమైన పాత్ర అని నేను అనుకుంటాను. నవల చదివిన వారు ఇందిరను అంత సులువుగా మర్చిపోలేరు. ఇంకా చె΄్పాలంటే ఎప్పటికీ మర్చిపోలేరు. రచయిత్రి ఆ పాత్రను అలా తీర్చిదిద్దింది. ‘ప్రకాశం, ఇది కాదు బతికే విధానం, ఇంతకంటే బాగా బతకాలి‘ అని ఇందిర చెప్పే డైలాగ్‌ విన్నాక ఇందిరను తల్చుకుంటే భయం వేస్తుంది. ఇందిరను తల్చుకుంటే ధైర్యం వస్తుంది. ఇరవయ్యేళ్ళ వయసుకు తగని బరువు మోసే ఆ పిల్ల ఒక్కచోట కూడా కన్నీళ్ళు పెట్టుకోదు. పైగా ‘నేను బలపడి, మరొకరికి బలమివ్వాలనుకునే తత్వం నాది‘ అని అనగలిగే సాహసి.

‘అందరం ఒక్కలాంటివాళ్లమే! అడుగు లేని పడవలం! ఏదో అలా ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాం! అలాగని గడియ గడియకీ కాళ్ళు చాపి ఏడవటం నా వల్ల కాదు’ అంటుందామె.  కృష్ణమూర్తి ఇందిరను పెళ్ళి చేసుకుంటున్నపుడు కూడా ‘పెళ్ళి నా జీవితంలో ఒక భాగం మాత్రమే! నీతో ఎంతదూరం రమ్మన్నా వస్తాను కానీ ఏ ఘట్టంలోనూ నా వ్యక్తిత్వాన్ని చంపుకోలేను. నా అవసరాలను గౌరవించడం నేర్చుకుని నన్ను నా ఇష్టం వచ్చినట్లు ఊపిరి పీల్చుకోనివ్వు’ అని ఆ రోజుల్లోనే తన పర్సనల్‌ స్పేస్‌ తనకుండాలని చెప్తుంది.

‘నీ ఆయుర్దాయం ఎంతో అన్నిరోజులూ నిండుగా బతుకు! నిర్భయంగా బతుకు! రోజుకు పదిసార్లు చావకు. ఈ ప్రపంచంలోని వికృతాన్నీ, వికారాన్నీ అసహ్యించుకో! ఆశలూ, స్వ΄్నాలు, అనురాగాలు అన్నీ పెంచుకో! కానీ వాటికి శస్త్రచికిత్స అవసరమైనపుడు నిర్దాక్షిణ్యంగా కత్తిరించి అవతల పారెయ్‌’ అనే ఇందిర నేటికీ మనకు అవసరమైన పాఠం చెప్తున్నట్టే అనిపిస్తుంది.  ఇందిర స్త్రీలాగా ప్రవర్తించదు. సగటు మనిషిలాగా ప్రవర్తిస్తుంది.  ఆ ప్రవర్తనలో ప్రేమ, కోపం, ఆవేశం, లౌక్యం, దుఃఖం, నిరాశ, నిర్లిప్తత, స్వార్థం అన్నీ ఉంటాయి. అన్నీ జీవితం ప్రసాదించినవే! ‘పాతివ్రత్యం, అర్పించుకోడాలు... వంటి నాన్సెన్స్‌ని ఫెడీమని కాలితో తన్నే ఇందిర’ అని డాక్టర్‌ చంద్రశేఖర్‌ రావు గారు ప్రస్తావించే ఇందిర డ్రామా చెయ్యదు, సహజంగా ప్రవర్తిస్తుంది. అందులో స్త్రీలకుండే బలం కనిపిస్తుంది. అందుకే ఇందిర నాకిష్టం.

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)