Breaking News

పిల్లల కోసం రుచికరమైన సమోసా.. చేప తో

Published on Sun, 10/29/2023 - 09:49

కావలసినవి:  చేప సొన – పావు కిలో (జాగ్రత్తగా ఉండికించి, చల్లారాక పొడిపొడిగా చేసుకోవాలి)
కారం – 2 టీ స్పూన్లు
గరం మసాలా – 1 టీ స్పూన్‌
కార్న్‌ – అర కప్పు (ఉడికించినవి)
పసుపు – అర టీ స్పూన్‌
సోంపు పౌడర్‌ –1 టీ స్పూన్‌
ఉప్పు – తగినంత
మిరియాల పొడి – అర టీ çస్పూన్‌
ఉల్లిపాయలు – 3 (సన్నగా తరిగినవి)
నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా
అల్లం – వెల్లుల్లి పేస్ట్‌ – 2 టీ స్పూన్లు
పచ్చిమిర్చి – 3 (సన్నగా తరిగినవి)
గుడ్డు – 1
గోధుమపిండి – కప్పు
మైదాపిండి – 2 కప్పులు
ధనియాల పొడి – 2 టీ స్పూన్లు
నీళ్లు – సరిపడా
కొత్తిమీర తురుము – కొద్దిగా


తయారీ: ముందుగా నూనె వేడి చేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని.. వేగిన తర్వాత  అల్లం – వెల్లుల్లి పేస్ట్‌ వేసుకోవాలి. తర్వాత సోంపు పౌడర్, మిరియాల పొడి, ధనియాలపొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, కొత్తిమీర తురుము వేసి మొత్తం కలుపుకుని.. ఆ మిశ్రమాన్ని ఉడికించి.. చివరిలో చేప సొన జోడించి.. గరిటెతో బాగా తిప్పి.. స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్‌ తీసుకొని అందులో.. గోధుమపిండి, మైదాపిండి, గుడ్డు, చిటికెడు ఉప్పు వేసి, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని.. మెత్తగా కలిపి 
15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఆ పిండి మిశ్రమంతో చిన్నచిన్న చపాతీలు ఒత్తుకోవాలి. వాటి మధ్యలో ముందుగానే ఉడికించుకుని పెట్టుకున్న కార్న్‌ కొద్దిగా, చేప సొన మిశ్రమం కొద్దిగా నింపుకుని.. సమోసా షేప్‌లో చుట్టుకోవాలి. ఇప్పుడు వాటిని నూనెలో డీప్‌ఫ్రై చేసుకుంటే రుచి అదిరిపోతుంది. 

(చదవండి: ఈ మెషిన్‌ తో ఒకే సారి ఆరు కప్పుల ఐస్‌క్రీమ్‌ తయారీ..)

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)