Breaking News

‘2023 ఓజీ40’ : గ్రహశకలాన్ని గుర్తించిన బాలుడు

Published on Fri, 01/31/2025 - 18:07

నాసా వారి ఇంటర్నేషనల్‌ ఆస్ట్రాయిడ్‌ డిస్కవరీ  ప్రాజెక్ట్‌(ఐఏడీపీ)లో ఇద్దరు క్లాస్‌మెట్‌లతో కలిసి  పాల్గొన్న 14 సంవత్సరాల దక్ష్‌ మాలిక్‌ అంగారక గ్రహం, బృహస్పతిల మెయిన్‌ ఆస్ట్రాయిడ్‌ బెల్ట్‌ మధ్య గ్రహశకలాన్ని కనుగొన్నాడు. దీని కోసం ఆస్ట్రోనామికా అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకున్నాడు.

హార్డిన్‌ సిమన్స్‌ యూనివర్శిటికి చెందిన డాక్టర్‌  పాట్రిక్‌ మిల్లర్‌ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్‌ చేపట్టారు. తాత్కాలికంగా ఈ గ్రహశకలానికి ‘2023 ఓజీ40’ అని నామకరణం చేశారు. త్వరలో మాలిక్‌ పెట్టబోయే పేరే ఈ గ్రహశకలానికి శాశ్వతంగా ఉండిపోతుంది. గ్రహశకలానికి  ప్రాథమిక పరీక్షలు నిర్వహించి ధ్రువీకరించడానికి నాసాకు నెలల సమయం పడుతుంది. ఆ తరువాత దానికి పేరు పెడతారు.

ఇదీ చదవండి: Paris Fashion Week 2025 : అపుడు మంటల్లో.. ఇపుడు దేవతలా ర్యాంప్‌ వాక్‌!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన మాలిక్‌ ‘శివనాడర్‌ స్కూల్‌’లో 9వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి మాలిక్‌కు అంతరిక్షం అంటే ఇష్టం. గ్రహాలు, సౌరకుటుంబం గురించి నేషనల్‌ జియోగ్రాఫిక్‌లో వచ్చిన డాక్యుమెంటరీలన్నీ చూసేవాడు.  ఐఏడీపీలో ప్రతి సంవత్సరం ఆరువేలమందికి పైగాపాల్గొంటారు. వారిలో కొందరు కొత్త గ్రహశకలాలని కనుక్కోవడంలో విజయం సాధించారు. ‘ఐఏడీపీ’ వెబ్‌సైట్‌ ప్రకారం గ్రహశకలాన్ని కనుగొన్న ఆరవ భారతీయ విద్యార్థి దక్ష్‌ మాలిక్‌. ‘ఈ అన్వేషణ నాకు సరదాగా అనిపించింది. గ్రహశకలం కోసం వెదుకుతున్నప్పుడు నాసాలో పనిచేస్తున్నట్లు అనిపించింది. నా కల నిజమైంది’ అంటున్నాడు ఆనందంగా దక్ష్‌  మాలిక్‌.

చదవండి : కీర్తి సురేష్‌ మెహిందీ లెహెంగా విశేషాలు, ఫోటోలు వైరల్‌


 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)