Breaking News

ఆ స్కూల్లో ఫీజు తీసుకోరు

Published on Sat, 11/23/2024 - 11:20

మామూలుగా అయితే స్కూల్లో టీచర్లు పిల్లలకు పాఠాలు చెప్తారు.  హోంవర్క్‌ రాసుకురమ్మని చెప్తారు. పరీక్షలు పెట్టి మార్కులు వేస్తారు. పైగా ఇవన్నీ చేసినందుకు ప్రైవేటు స్కూళ్లలో ఫీజు తీసుకుంటారు. అయితే థాయ్‌లాండ్‌లో ఉన్న ‘మెషై పట్టానా స్కూల్‌’(mechai pattana school) లో మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఈ బడినే ప్రపంచవ్యాప్తంగా "Bamboo Sc-hool'  అని కూడా అంటారు. ఇక్కడ పిల్లలకు పాఠాలతోపాటు సేవ చేయడం నేర్పిస్తాను. సమాజంలో ఎలా బతకాలో నేర్పిస్తారు. తోటివారిని ఎలా గౌరవించాలో, వృద్ధులతో ఎలా నడుచుకోవాలో, పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో.. ఇవన్నీ నేర్పిస్తారు. ఇవన్నీ నేర్పినందుకు వారు ఫీజేమీ తీసుకోరు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిసి 400 చెట్లు నాటితే చాలు. 

థాయ్‌లాండ్‌కు చెందిన మెషై విరవైద్య అనే ప్రముఖ సామాజిక కార్యకర్త, న్యాయవాది 2008లో ఈ పాఠశాలను ్రపారంభించారు. స్కూళ్లలో పెరుగుతున్న పేద, ధనిక తారతమ్యం, పాఠశాలలు కేవలం పుస్తకాలు బట్టీ వేసే ప్రదేశాలుగా మారిపోవడం వంటివి గమనించి తాను ఈ స్కూల్‌ని స్థాపించినట్లు ఆయన వివరిస్తారు. బడిలో అందరూ ఒకచోట చేరి సంస్కారాన్ని, సామాజిక సేవనీ, పౌరబాధ్యతలనూ నేర్చుకోవాలని అంటారు. 

దానికి తగ్గట్టే ఈ పాఠశాల విధివిధానాలను ఆయన రూపొందించారు.  ఇక్కడ మామూలు తరగతులతోపాటు కూరగాయలు పండించడం, పశువుల్ని పెంచడం, కళాకృతులు తయారు చేయడం, వంటలు చేయడం వంటివి నేర్పిస్తారు. దీంతోపాటు విద్యార్థులను బృందాలుగా ఏర్పరిచి, వారికొక నాయకుణ్ని నియమిస్తారు. వారిని సమన్వయం చేసుకుంటూ, వారిలో స్ఫూర్తి నింపుతూ సాగేలా అతనికి తర్ఫీదు ఇస్తారు. ఇక్కడ బాధ్యతలన్నీ విద్యార్థులే తీసుకుంటారు. కొత్తవారిని స్కూల్లో చేర్చుకోవడం, కొత్త టీచర్లను విధుల్లోకి తీసుకోవడం వంటి పనుల కోసం ‘స్టూడెంట్‌ బోర్డ్‌’ పని చేస్తుంది. 

స్కూల్‌కి కావాల్సిన వస్తువులు కొనడం, ఇచ్చిన నిధుల్ని సక్రమంగా ఖర్చుచేయడం కూడా వారి బాధ్యతే. ఇక్కడ వందలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారు ఫీజు చెల్లించనవసరం లేదు. అయితే పాఠశాలల్లో జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి. ప్రతి విద్యార్థి ఏడాదిలో 400 గంటలు సమాజ సేవ చేయాలి. అది ఇక్కడ కచ్చితమైన నిబంధన. స్త్రీలను ఎలా అర్థం చేసుకోవాలి, వారి మానసిక పరిస్థితి, శారీరక ఇబ్బందులేమిటనే అంశాలపై ఇక్కడి విద్యార్థులకు ప్రత్యేక తరగతులుంటాయి. దీనివల్ల వారిలో తోటివారి పట్ల అవగాహన, ఆత్మీయత పెరుగుతాయని మెషై విరవైద్య వివరిస్తున్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)