Breaking News

అత్యంత పురాతనమైనవి.. ఈ గుహ పెయింటింగ్స్‌ చూశారా?

Published on Tue, 07/11/2023 - 14:25

మానవులు గుహలనే ఆవాసాలుగా చేసుకుని జీవించే కాలంలో గుహల గోడలపై రకరకాల చిత్రాలు చిత్రించిన ఆనవాళ్లు ప్రపంచంలో అక్కడక్కడా ఉన్నాయి. ఇవి రాతియుగం నాటి హోమోసేపియన్‌ మానవులు చిత్రించినవి. అయితే, వారి కంటే పూర్వీకులైన నియాండర్తల్‌ మానవులు చిత్రించిన గుహాచిత్రాలు ఇటీవల ఫ్రాన్స్‌లో బయటపడ్డాయి. ఫ్రాన్స్‌లోని సెంటర్‌ వాల్‌ డి లోరీ ప్రాంతంలోనున్న లా రోష్‌ కోటార్డ్‌ గుహ గోడలపై చెక్కిన ఈ చిత్రాలు కనిపించాయి.

యూనివర్సిటీ ఆఫ్‌ టూర్స్‌కు చెందిన పరిశోధన బృందంలోని శాస్త్రవేత్తలు ఈ చిత్రాలను గుర్తించారు. పొడవాటి గీతలు, చుక్కలతో ఉబ్బెత్తుగా చెక్కిన ఈ చిత్రాలు దాదాపు 75 వేల ఏళ్ల కిందటివని పరిశోధకులు అంచనా వేశారు. ఈ గుహను వాడటం మానేసి 57 వేల ఏళ్లు కావచ్చని వారు చెబుతున్నారు.

ఇవి నియాండర్తల్‌ మానవులు చెక్కినవేనని, ఇదివరకు దొరికిన నియాండర్తల్‌ మానవుల చిత్రాల కంటే ఇవి పురాతనమైనవని చెబుతున్నారు. జింక ఎముకలపై నియాండర్తల్‌ మానవులు చెక్కిన చిత్రాలు ఇదివరకు జిబ్రాల్టర్‌లో బయటపడ్డాయి. అవి దాదాపు 51 వేల ఏళ్ల నాటివని శాస్త్రవేతలు చెబుతున్నారు.

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)