Breaking News

నిన్న పిజ్జా మేకర్‌.. నేడు ఫ్యాషన్‌ మోడల్‌..!

Published on Sun, 05/04/2025 - 11:38

నిన్న మొన్నటి వరకు అతడు పిజ్జా దుకాణంలో పిజ్జా తయారు చేస్తుండేవాడు. అనుకోకుండా ఒక రోజు న్యూయార్క్‌లోని ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసే వ్యక్తి కంటపడ్డాడు. అంతే, అతడి అదృష్టం మారిపోయింది. ఉన్నపళాన ఫ్యాషన్‌ మోడల్‌గా మారిపోయాడు. ఫ్యాషన్‌ మోడల్‌గా మారిన ఈ ఇరవైనాలుగేళ్ల పిజ్జా మేకర్‌ పేరు క్రిస్టియానో వెన్‌మన్‌. అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో నిత్యం రద్దీగా ఉండే ‘స్కార్స్‌’ అనే పిజ్జా దుకాణంలో పిజ్జా తయారు చేస్తూ ఉండేవాడు. 

న్యూయార్క్‌లోని ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ విల్లీ షవారియా అసిస్టెంట్లలో ఒకరు ‘స్కార్స్‌’ పిజ్జా సెంటర్‌కు వచ్చినప్పుడు క్రిస్టియానో అతడి కంటపడ్డాడు. ఆకట్టుకునే రూపంతో ఉన్న క్రిస్టియానో ఫ్యాషన్‌ మోడలింగ్‌కు బాగా పనికొస్తాడని అంచనా వేశాడు. ఇదే విషయాన్ని తన బాస్‌ విల్లీకి చెప్పాడు. విల్లీ వెంటనే అతణ్ణి పిలిపించి, మోడలింగ్‌లో అవకాశం ఇచ్చాడు. 

విల్లీ చలవతో క్రిస్టియానో ఇటీవల ప్యారిస్‌లో జరిగిన ఫ్యాషన్‌ వీక్‌లో ర్యాంప్‌వాక్‌ చేసి, ఫ్యాషన్‌ అభిమానులను ఆకట్టుకున్నాడు. ఆ దెబ్బతో క్రిస్టియానోకు అవకాశాల వెల్లువ మొదలైంది. అంతేకాదు, ‘హీరో’, డేజ్‌డ్‌’ వంటి అంతర్జాతీయ ఫ్యాషన్‌ పత్రికలు క్రిస్టియానో ఫొటోలతో ప్రముఖంగా వ్యాసాలను ప్రచురించడం మరో విశేషం.

(చదవండి: Vomiting During Pregnancy: ప్రెగ్నెన్సీలో వాంతులవుతుంటే నార్మల్‌ డెలివరీ అవ్వదా..?)
 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)