Breaking News

2023: సంతోషంగా స్వాగతం పలుకుదాం!

Published on Sun, 01/01/2023 - 02:20

ఎప్పటికప్పుడు ఏదో కొత్తదనంతో నవనవోన్మేషంగా ఉండడం సృష్టి లక్షణం. అనుదినం తన బిడ్డలకు కొత్తదనాలనూ, కొత్త భోగవస్తువులనూ, కొత్త అనుభవాలనూ కానుక చేయడం భగవంతుడికి వాడుక, వేడుక. కాబట్టే తెల్లారేసరికి మన చుట్టూ ఎన్నో కొత్త చిగుళ్లూ, కొత్త మొగ్గలూ, కొత్త ఆరంభాలూ కళకళ లాడుతూ, కిలకిల నవ్వుతూ కనిపిస్తాయి. ఎన్నో కొత్త అందాలూ, పోకడలూ, విచిత్రాలూ, కొత్త వేష భాషలూ, వస్తువాహనాలూ, ప్రయోగాలూ, ధోరణులూ ఎదురౌతాయి.

ప్రకృతి ధర్మంగా వచ్చి పలకరించే కొత్తదనాల సందడిని సుహృద్భావంతో  స్వాగతించే ధీరుడు వాటిని ఆనందంగా ఆస్వాదించగలుగుతాడు. పరిచితమైనదనే పక్షపాతంతో పాతనే పట్టుకు పాకులాడుతూ, అపరిచితమైన నవ్యతకు అకారణంగా జంకుతూ ఉండే భీరువు, నిరంతమైన నిరాశతో నిరుత్సాహానికి నెలవుగా ఉంటాడు. 

నిన్నటి కొత్తే నేటి పాత. నేటి కొత్త రేపటికి పాత. అయినప్పుడు అన్నీ మన మంచికే. లోక క్షేమం కోసం కొత్త నీరుప్రవహిస్తూ వస్తుంటే భయమెందుకు, కొత్త సమస్యలు మోసు కొస్తుందేమోననా? సమస్య వెంటే పరిష్కారం వస్తుంది అని చరిత్ర మనకు పదే పదే చెప్పిన పాఠం. గతంలో ఇలా అనవసరంగా ముందు భయపెట్టిన సమస్యలెన్నిటినో మనం అలవోకగాదాటివచ్చిన వాళ్ళమే గదా! సృష్టి కర్త ఉన్నాడనీ, ఆయన కరుణామయుడనీ, కాలగమనానికి ఆయనే కారణం గనక కాలగతి కలిగించే ఒడుదొడుకులన్నీ ఆయన అను గ్రహంతో అధిగమించగలమనీ విశ్వసించే వారు, నవ్యతను ఆశాభావంతో ఆహ్వానించకుండా ఉండలేరు.

ఎన్నో కొత్తదనాలు మన ముందు ఆవిష్కరించేందుకు, మరో నూతన సంవత్సరం మన ముంగిట నిలిచిన శుభవేళలో, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్‌ దుఃఖభాక్‌ భవేత్‌ (అందరూ సుఖంగా ఉండాలి, అందరూ అనారోగ్యానికి దూరంగా ఉండాలి, అందరికీ శుభాలు జరగాలి, ఎవ్వరూ దుఃఖానికి ఆశ్రయం కాకూడదు) అన్న ఆర్షేయమైన ఆశీస్సు మనసారా మరోసారి  మననం చేసుకొందాం. కొత్త ఏడాదిలో అందరూ ధర్మాన్ని రక్షిస్తూ, దానివల్ల సురక్షితులై సుఖశాంతులతో ఉండాలనీ, దుఃఖహేతువులైన దుర్మార్గాలకు దూరంగా ఉండాలనీ ఆకాంక్షిస్తూ, రెండు వేల ఇరవై మూడుకు సంతోషంగా స్వాగతం పలుకుదాం!

– ఎం. మారుతి శాస్త్రి

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)