Breaking News

గుడ్లు ఎక్కువగా తింటున్నారా? పరిశోధనలో షాకింగ్‌ విషయాలు!

Published on Tue, 03/26/2024 - 17:44

గుడ్లు ఎక్కువుగా తింటే అస్సలు భయపడాల్సిన పనిలేదు. పైగా మీ ఆరోగ్యం పదిలం అని ధీమాగా చెబుతున్నారు వైద్యులు. అస్సలు ఆ సమస్యలు బారినపడరని అన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే కొన్ని రకాల సమస్యలు సైతం రావని శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ఆ అధ్యయనంలో బయటపడ్డ ఆసక్తికర విషయాలేంటంటే..

గుడ్డు ఎముకలు బలంగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తుందట. రోజుకి ఒక గుడ్డు తినడం అనేది ఎంతో మంచిదని, దీని వల్ల ఫోలేట్‌, బీ విటమిన్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయని అన్నారు. అలాగే ఎముకల వ్యాధి రాకుండా నివారిస్తుందని చెప్పారు. ముఖ్యంగా గుండెతో ఎముకల ఆరోగ్యం ముడిపడి ఉందనే ఆసక్తికర విషయం తమ పరిశోధనలో బయట పడిందని హువాజోంగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్త తెలిపారు. అందుకోసం నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ దాదాపు 1900 మందిపై అధ్యయనం నిర్వహించింది.

పరిశోధకులు గుడ్డు వినియోగం తోపాటు, వారి ఎముకల బలాన్ని కూడా అంచనా వేశారు. ఈ పరిశోధనలో పాల్గొనేవారికి గుడ్డులోని 3.53 ఔన్సుల పోషకాలు వారి తొడలు, వెన్నుముకలోని ఎముకలను దృఢంగా ఉంచాయిని తెలిపారు. వారిలో అధిక బీఎండీ స్థాయిలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా వృద్ధుల్లో అయితే బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గిందని చెప్పారు.

వయసు పెరిగే కొద్ది ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయి. ఆ సమస్య రాకూడదంటే గుడ్డుకి మించిన తగిన పోషకాహారం లేదని ఈ పరిశోధనలో తేలిందని చెప్పారు. అలాగే ఇదే సమయంలో తగినంత పోషకాహారం లేకపోవడం, తక్కువ శారీరక శ్రమ, ధూమపానం, అధిక మొత్తంలో మద్యం సేవించడం, కొన్ని రకాల మందులు దీర్థకాలికంగా వాడడం వంటి ఇతక కారణాల వల్ల కూడా ఈ బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉందన్నారు. 

ఎముకలను ఎలా ఆరోగ్యంగా ఉంచుతాయంటే..

  • గుడ్లు ప్రోటీన్‌తో నిండి ఉంటాయి. ఇవి ఆల్కలీన్ ఫాస్ఫేటేస్ అని పిలువబడే శారీరక ఎంజైమ్‌ల సమూహాన్ని సక్రియం చేసి, ఎముకలను బలోపేతం చేస్తుంది.
  • ఆల్కలీన్ ఫాస్ఫేటేస్ అనేది ప్రధానంగా కాలేయం, ఎముకలు, మూత్రపిండాలు మొదలైన వాటిలో ఉండే ఎంజైమ్‌ల సమూహం. ఇది ఎముక జీవక్రియ బయోమార్కర్ 
  • గుడ్లు తీసుకోవడం వల్ల ఏఎల్‌పీ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. దీంతో తొడ, కటి వెన్నెముక వంటి భాగాల్లోని ఎముకలను బలంగా ఉంచుతుంది. 
  • అంటే ఇక్కడ గుడ్లలో డి విటమిన్‌ పుష్కలంగా ఉంటుందని తేలింది. అందువల్ల దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం అంది ఎముకలు దృఢంగా ఉండేందుకు ఉపకరిస్తుందని  చెబుతున్నారు శాస్త్రవేత్తలు. 

(చదవండి: చెఫ్‌గా పదిమందికి కడుపు నిండా భోజనం పెట్టేది..కానీ ఆమె అన్నమే..!)

#

Tags : 1

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)