Breaking News

మందు బాబులు జాగ్రత్త..! పరిశోధనలో షాకింగ్‌ విషయాలు

Published on Sun, 01/05/2025 - 13:35

మద్యం ఆరోగ్యానికి హానికరం అంటూ పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు నిపుణులు. దీని కారణంగా పలు అనారోగ్యాల బారినపడతామని చెబుతుంటారు. ముఖ్యంగా కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందంటూ హెచ్చరిస్తుంటారు. కానీ ఇది ఆల్కహాల్‌ సేవించడం వల్లే వస్తుందనేందుకు కచ్చితమైన ఆధారాలు లేవు. అయితే పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో ఆల్కహాల్‌కి కేన్సర్‌కి లింక్‌అప్‌ ఉందంటూ షాకింగ్‌ విషయాలు వెల్లడించారు. మొత్తం నాలుగు అధ్యయనాలను ఉదహరిస్తూ సవివరంగా తెలిపారు యూఎస్‌ సర్జన్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తి. అంతేగాదు మద్యపానం సేవిస్తే.. కేన్సర్‌ తప్పదనే ఓ హెచ్చరిక లాంటి లేబుల్‌ ఉండాలని వాదిస్తున్నారు. 

ఎలా కారణమంటే..
ఆల్కహాల్‌ కేన్సర్‌కు ఎలా కారణమవుతుందో నాలుగు కారణాలను వివరించారు. 

  • మొదటిది శరీరంలో ఆల్కహాల్‌ విచ్ఛిన్నమైప్పుడు డీఎన్‌ఏతో విభేదించి కణాలను దెబ్బతీస్తుంది. కణితులు వచ్చేందుకు కారణమవుతుంది. అందుకు బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి. అలాగే దీన్ని చాలామంది వైద్యులు అంగీకరించారు. 

  • రెండోది ఆల్కహాల్ ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. ఇది రొమ్ము కేన్సర్‌కు మార్గం సుగమం చేస్తుందని కొత్త పరిశోధనలో తేలింది. అయితే ఇది ఎలా అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. 

  • మూడోది ఇటలీ, యుఎస్, ఫ్రాన్స్, స్వీడన్, ఇరాన్ పరిశోధకుల బృందం దాదాపు  4 లక్షలకు పైగా కేన్సర్‌ కేసులను పరిశీలించగా..సుమారు 572 అధ్యయనాల్లో చాలా షాకింగ్‌ విషయాలు వెల్లడయ్యాయి. తాగేవారు, తాగనివారిగా విభజించి మరీ అంచనా వేశారు. ఆ పరిశోధనలో నోటి, గొంతు, అన్నవాహిక, కొలొరెక్టమ్, కాలేయం, స్వరపేటిక, రొమ్ము తదితర కేన్సర్‌లకు మద్యపానంతో సంబంధం ఉందని తేలింది. 

  • నాలుగు..అధిక మద్యపానం సేవించిన వారికి మెడ, తలకు సంబంధించిన కేన్సర్‌ వస్తుందని సుమారు 26 పరిశోధనలో వెల్లడయ్యింది. 

చివరిగా మరో ముఖ్యమైన అంశమేమిటంటే.. 26 సంవత్సరాల కాలంలో 195 దేశాలలో సంభవించిన మద్యపాన సంబంధిత మరణాలపై 2018 ప్రపంచ నివేదికలో మద్యపానం సేవించడం సురక్షితం కాదని తేలింది. ఇది ఏడు రకాల కేన్సర్‌ల బారినపడేందుకు కారణమవుతుందని వివరించారు సర్జన్‌ వివేక్‌ మూర్తి. 

ఈ అధ్యయనం నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌ ప్రచురితమయ్యింది. అయితే ఈ అధ్యయనం మద్యం అతిగా సేవించే వారికి, మితంగా తీసుకునే వారి మధ్య తేడాలను వివరించలేదు. ఈ పరిశోధనపై కొందరు శాస్త్రవేత్తలు విభేదిస్తున్నారు. 

ఎందుకంటే..మధ్యధరా ప్రాంతంలో ఉండేవారు రోజూ వైన్‌ తాగుతారని, అదివారికి బలమైన ప్రయోజనాలను అందిస్తుందనేది వాదన. అలాగే మితంగా మద్యం సేవించేవారే గుండెపోటు, స్ట్రోక్‌, అకాల మరణానికి గురయ్యే ప్రమాదం ఉందని, రొమ్ము కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని గుర్తించారు పరిశోధకులు.

 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)