Breaking News

గుడ్‌ న్యూస్‌: హెచ్‌ఐవీ రోగుల మధ్య కిడ్నీ మార్పిడి సురక్షితమే!

Published on Thu, 10/17/2024 - 13:38

తీ​వ్రమైన కిడ్నీసమస్యలతో బాధపడుతున్న హెచ్‌ఐవీ (HIV) రోగులకు  భారీ ఊరట లభించనుంది. హెచ్‌ఐవీ ఉన్న వ్యక్తుల మధ్య కిడ్నీ మార్పిడి సురక్షితమని కొత్త అధ్యయనంద్వారా వెల్లడైంది. హెచ్‌ఐవీఉన్న వ్యక్తులు, ఎయిడ్స్  వైరస్‌తో జీవిస్తున్న వ్యక్తుల నుంచి కిడ్నీలను సురక్షితంగా స్వీకరించవచ్చని  ఈ స్టడీ తేల్చింది. జీవించి ఉన్నపుడు ఇచ్చినా, లేదా మరణం తరువాత  కిడ్నీలను దానం చేసినా రెండింటినీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయవచ్చని తెలిపింది.

న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో బుధవారం ప్రచురించబడిన ఈ కొత్త అధ్యయనాన్ని అమెరికాలో నిర్వహించారు.  198 కిడ్నీ మార్పిడికేసులను పరిశీలించి, దానం చేసిన అవయవం ఎయిడ్స్ వైరస్ ఉన్న వ్యక్తి నుండి వచ్చినా లేదా లేని వ్యక్తి నుండి వచ్చినా ఇదే ఫలితాలను పరిశోధకులు గుర్తించారు. గత నెలలో, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ పరిశోధనా అధ్యయనాల ప్రకారం ఈ రకమైన మూత్రపిండాలు , కాలేయ మార్పిడిని అనుమతించే నియమ మార్పును ప్రతిపాదించింది. దీనికి ఆమోదం లభిస్తే ఇది రాబోయే సంవత్సరంలో అమల్లోకి వస్తుందని రావచ్చు.

హెచ్‌ఐవీ పాజిటివ్‌, కిడ్నీ ఫెయిల్‌ అయిన రోగులపై  ఈ అధ్యయనం జరిగింది. HIV-పాజిటివ్‌తో మరణించిన దాత లేదా HIV-నెగటివ్ మరణించిన దాత నుండి అవయవాన్ని స్వీకరించి,నాలుగేళ్లపాటు ఈ పరిశోధన నిర్వహించారు. అలాగే హెచ్‌ఐవీ పాజిటివ్ దాతల నుంచి కిడ్నీలు పొందిన సగం మందిని హెచ్‌ఐవీ లేని దాతల నుంచి వచ్చిన వారితో పోల్చారు. వీరిలో 13మంది రోగులకు,ఇతర సమూహంలోని నలుగురికి వైరస్ స్థాయిలు పెరిగాయి. దీనికి హెచ్‌ఐవీ మందులను సరిగ్గా  తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగి ఉండవచ‍్చని NYU లాంగోన్ హెల్త్‌కు చెందిన అధ్యయన సహ-రచయిత డాక్టర్ డోరీ సెగెవ్ చెప్పారు. తమ పరిశోధన అద్భుతమైన ఫలితాలనిచ్చిందన్నారు.

 

 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)