Breaking News

అందం, ఆరోగ్యం అందించేది ఇదే..!

Published on Thu, 07/04/2024 - 14:32

బేబీ క్యారెట్లు గురించి తెలియని వారుండరు. ఇది తినేందుకు కూడా రుచిగా ఉంటాయి. ముఖ్యంగా సాధారణ క్యారెట్స్‌ కంటే ఈ బేబీ క్యారెట్లు తింటే ఎన్నో లాభాలు పొందొగలమని అమెరికా పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. అందం, ఆరోగ్యానికి కేరాఫ్‌ అడ్రస్‌ బేబీ క్యారెట్లని తేల్చి చెబుతున్నారు. అంత మేలు చేసే ఈ బేబీ క్యారెట్లను చిరుతిండిగా తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, అధ్యయనంలో వెల్లడైన ఆసక్తికర విషయాలు తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!

శాకాహార ప్రియులకు బెస్ట్‌ స్నాక్‌ ఐటెంగా తీసుకునే కాయగూర బేబీ క్యారెట్లు. వీటిని స్నాక్‌ రూపంలో మరేదైన విధంగా తీసుకోవడం చాలా మంచిది. క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వారానికి మూడుసార్లు తీసుకుంటే చర్మ కెరోటినాయిడ్లు గణనీయంగా పెరుగుతాయని పరిశోధనలో తేలింది. ఈ కెరోటినాయిడ్లు శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. 

ఇవి చర్మంలోని ఫ్రీ రాడికల్స్‌ని తగ్గించగలవు. ఆక్సికరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. దీర్ఘకాలికి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మెరుగైన చర్మం, రోగనిరోధక వ్యవస్థ పనితీరుని మెరుగ్గా ఉంచుతాయి. అధిక స్థాయి కెరోటినాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్‌ రక్షణతో సంబంధం కలిగి ఉన్నాయని, ఇవి గుండె జబ్బులు, కేన్సర్‌ల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి పరిశోధకులు చెబుతున్నారు. 

చర్మ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందంటే..
చికాగోలో జరిగిన అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ చెందిన శాస్త్రవేత్తలు సుమారు 60 మంది యువకులపై అధ్యయనం నిర్వహించగా..స్కిన్ కెరోటినాయిడ్ స్కోర్‌లు గణనీయంగా 10.8% పెరిగినట్లు గుర్తించారు. సుమారు వందగ్రాములు బేబిక్యారెట్లు తీసుకుంటేనే మంచి ఫలితాలను చూపించిందని అన్నారు. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి కూడా వివరించారు. అవేంటంటే..

  • దృష్టి లోపాన్ని మెరుగుపరుస్తుంది: చూపుని రక్షించడంలో సహాయపడుతుంది. వయస్సు సంబంధిత సమస్యల నుంచి కూడా రక్షిస్తుంది. 

  • ఇది పిత్తస్రావాన్ని పెంచుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

  • దంతాల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. వృద్ధ జపనీస్‌ జనాభాలో దంతాల నష్టం రేటుని అధ్యయనం చేయగా బీటా కెరోటిన్‌ ఎక్కువగా తీసుకున్న వారిలో దంత సమస్యలు తగ్గినట్లు గుర్తించారు. అయితే బేబి క్యారెట్లు సాధారణ క్యారెట్లు కంటే తక్కువ రోజులే నిల్వ ఉంటాయి. రిఫ్రిజిరేటర్‌లో అయితే సుమారు నాలుగు వారాల పాటు నిల్వ చేయవచ్చు. 

(చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్‌ బాటిల్‌!..ఒక లీటర్‌కే..!)
 

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)