Breaking News

రూ.500నోట్లపై శ్రీరాముడి చిత్రం.. వైరల్‌

Published on Wed, 01/17/2024 - 11:05

అయోధ్యలో  రామ మందిరం నిర్మాణం మొదలు సోషల్‌  మీడియాలో ప్రతీ వార్త సంచలనంగా మారుతోంది. ఈ క్రమంలో కొన్ని తప్పుడు వార్తలు కూడా హల్‌ చల్‌ చేస్తున్నాయి. తాజాగా   రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)  శ్రీరాముడి చిత్రాలతో కూడిన రూ.500 నోటును విడుదల చేయనుందనే వార్త  వైరల్‌గా మారింది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం, శ్రీరాముడి చిత్రాలతో పాటు రూ.500 నోటు ఫొటో సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.

ప్రస్తుతం రూ.500 నోటుపై జాతిపిత మహాత్మాగాంధీ చిత్రం ఉండే ప్లేస్‌లో  శ్రీరాముడు ఫోటో ఉన్న నోట్లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి.  దీంతో  పలువురు రామభక్తులు  జై శ్రీరామ్‌ అంటూ   తెగ ఆనంద పడిపోతున్నారు.  జనవరి 22, 2024న శ్రీరాముడి చిత్రాలతో కూడిన రూ.500 నోట్ల కొత్త సిరీస్‌ను విడుదల చేయబోతోందని, నోటుకు వెనుకవైపు ఎర్రకోట స్థానంలో అయోధ్య ఆలయ ఫోటోను ఆర్‌బీఐ పొందు పరుస్తోందంటూ  జోరుగా ప్రచారం సాగుతోంది. 

అయితే ఇది ఫేక్‌ న్యూస్‌ అంటూ బ్యాంకింగ్ రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. కొత్త నోటుకు సంబంధించి ఆర్‌బీఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదని, ఇలాంటి వాటిని నమ్మవద్దని  సూచిస్తున్నారు. 

కాగా  జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తారు. ప్రముఖ క్రికెటర్లు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు హాజరుకాన్నారు. ప్రధాని మోదీ సమక్షంలో 'అభిజిత్ ముహూర్తం'లో విగ్రహ ప్రతిష్ఠాపనకు మరికొంతమంది కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా  ఇప్పటికే ఆహ్వానాలు కూడా అందుకున్న సంగతి తెలిసిందే.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)