Breaking News

పిల్లల చేత ఇలా చేయిస్తే.. మెడనొప్పిని నివారించొచ్చు..

Published on Sun, 07/16/2023 - 11:58

పిల్లల్లో మెడనొప్పి అంతగా కనిపించకపోయినా అరుదేమీ కాదు. వాళ్ల రోజువారీ అలవాట్లవల్ల కొద్దిమందిలో అప్పుడప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. ఉదాహరణకు వీపు వెనక పుస్తకాల బ్యాగ్‌ తాలూకు బరువు మోస్తూ... మెడను ముందుకు చాపి నడుస్తూ ఉండటం, స్కూళ్లలో బెంచీల మీద కూర్చుని... చాలాసేపు మెడ నిటారుగా ఉంచడం, కంప్యూటర్‌ మీద ఆటలాడుతూ చాలాసేపు మెడను కదిలించకుండా ఉంచడం వంటి అనేక అంశాలతో మెడనొప్పి రావచ్చు. ఇలాంటి పిల్లల చేత తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించేలా చేయడం వల్ల మెడనొప్పిని నివారించవచ్చు. 

స్కూల్లో తమ బెంచీ నుంచి డెస్క్‌కూ / ఇంట్లో తమ రీడింగ్‌ టేబుల్‌ నుంచి తమ కుర్చీకీ తగినంత దూరంలో ఉందా, పిల్లల ఎత్తుకు తగినట్లుగా ఉందా అన్నది చూసుకోవాలి. లేదంటే తల్లిదండ్రులు ఆ రీడింగ్‌ టేబుల్‌ ఎత్తును అడ్జెస్ట్‌ చేయాలి. వాటికి తగినట్లుగా తమ కూర్చునే భంగిమ (పోష్చర్‌) సరిగా ఉందా అన్నది కూడా తల్లిదండ్రులు పరిశీలించాలి. ∙స్కూల్లో లేదా ఇంట్లో... చదివే సమయాల్లో వెన్నును కంఫర్టబుల్‌గా ఉంచుకోవాలి. వెన్ను ఏదో ఒక వైపునకు ఒంగిపోయేలా కూర్చోకూడదు. అదే పనిగా చదవకుండా మధ్య మధ్య గ్యాప్‌ ఇస్తుండాలి. ∙పిల్లలు వీడియో గేమ్స్‌ ఆడుతూ... మెడను చాలాసేపు నిటారుగా ఉంచడం సరికాదు. 

మధ్యమధ్యన మెడకు విశ్రాంతినిస్తూ ఉండాలి. ∙పిల్లలు వీడియోగేమ్స్‌ మాత్రమే కాదు... గ్రౌండ్‌లోనూ ఆటలాడేలా పేరెంట్స్‌  ప్రోత్సహించాలి. ∙ఊబకాయం ఉన్న పిల్లల్లో మెడనొప్పి వచ్చే అవకాశాలెక్కువ. అందుకే వారు తినే తినుబండారాలు ఆరోగ్యకరంగా ఉండాలి. వీలైనంతవరకు జంక్‌ఫుడ్‌ /బేకరీ ఐటమ్స్‌కు దూరంగా ఉంచాలి. ఈ జాగ్రత్తలు మెడనొప్పిని నివారిస్తాయి. అప్పటికే మెడనొప్పి ఉంటే తగ్గిస్తాయి. ఇవి పాటించాక కూడా తగ్గకపోతే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించాలి. 

Videos

పడిపోతున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?

నామినేషన్ వేయకుండా ఆపుతున్న పోలీసులు

చంద్రబాబు గుర్తుపెట్టుకో.. చీర లాగి.. ఇంత దారుణంగా కొడతారా..? జనసేన నేత వార్నింగ్

ప్రసాద్ బాబుకు ఒక న్యాయం.. ఇందిరకు మరో న్యాయమా?

విడుదల రజిని ఘటనపై ధ్రువ్ రాఠీ స్పందన

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

Photos

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు