Breaking News

NCERT చెరిపేస్తే చెరిగిపోతుందా చరిత్ర?

Published on Fri, 05/02/2025 - 10:28

నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసర్చ్‌ అండ్‌ ట్రయినింగ్‌ (ఎన్సీఈఆర్టీ) 2025–26 విద్యాసంవత్సరం నుంచి అమలులోకి రావడం కోసం ప్రచురింన ఏడో తరగతి పాఠ్య పుస్తకం మొదటి భాగం వెలువడిన సందర్భంగా అందులో గతం నుం కొనసాగిన, రద్దయిపోయిన, మారిన అంశాల గురించి వార్తా కథనాలు ఈ సోమవారం సంచలనం సృష్టించాయి.

పాఠ్య పుస్తకాలు మార్చడాన్ని ఎవరూ తప్పు పట్టనక్కరలేదు. తప్పనిసరిగా పాఠ్య పుస్తకాలు ఎప్పటికప్పుడు మారవలసిన అవసరం ఉంటుంది. ఆ రంగంలో కొత్త పరిశోధనలు జరిగి కొత్త ఆవిష్కరణలు బైటపడినప్పుడు ఆ కొత్త విషయాలు విద్యార్థులకు అందుబాటులోకి తేవడానికి పాఠ్య పుస్తకాలలో మార్పులూ చేర్పులూ చేయవలసి ఉంటుంది. కానీ ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలలో గత కొద్ది సంవత్సరాలుగా చేస్తున్న మార్పులూ, చేర్పులూ, తొలగింపులూ ఆ యా శాస్త్ర రంగాలలో జరిగిన నూతన అన్వేషణలకు సంబంధింనవి కావు. అవి ఆ సంస్థనూ, విద్యా శాఖనూ, భారత ప్రభుత్వాన్నీ ఇవాళ నడుపుతున్నవారి భావజాలానికి తక్షణ ప్రయోజనాలకు అనుగుణమైనవి. ఏదో ఒక భావజాలం మాత్రమే చెప్పడం విద్యార్థుల చిన్నారి మనసులను కుంంపజేసి, కళ్లకు గంతలు కట్టడమే. అలాగే ఐదు సంవత్సరాల పాలనాధికారం కోసం గద్దెనెక్కిన వారు తమ తక్షణ ప్రయోజనాలను న్నారి పిల్లల మనసులపై సుదూర ప్రభావం పడేలా నింపడం అనుచితం. 

ఇప్పుడు ఏడో తరగతి కోసం కొత్తగా విడుదల చేసిన ‘ఎక్స్‌ప్లోరింగ్‌ సొసైటీ – ఇండియా అండ్‌ బియాండ్‌ (భాగం 1)’ అనే పుస్తకం ఇప్పటివరకూ ఉండిన చరిత్ర, భౌగోళిక శాస్త్రం, పౌరనీతి (సామాజిక, ఆర్థిక జీవనం) అనే మూడు విడివిడి పుస్తకాలను తొలగించి ఆ స్థానంలో ఒకే సమగ్ర పుస్తకంగా తయారయింది. రెండో భాగం కూడా త్వరలో వెలువడుతుందని అంటున్నారు గానీ, ఈ పుస్తకం వరకే చూస్తే చాలా మార్పులు కనబడుతున్నాయి. ‘ప్రపంచం’, ‘గత వైభవ దృశ్యం’, ‘మన సాంస్కృతిక వారసత్వం-జ్ఞాన సంప్రదాయాలు’, ‘పాలన- ప్రజాస్వామ్యం’, ‘మన చుట్టూ ఉన్న ఆర్థిక జీవనం’ అనే ఐదు ఇతివృత్తాలతో ఈ పుస్తకం ఉంది. అంతకు ముందరి ఏడో తరగతి చరిత్ర పుస్తకం ఏడో శతాబ్ది నుంచి భారత చరిత్రను పరిచయం చేయగా దానికి భిన్నంగా ప్రస్తుత పుస్తకం ఆరో శతాబ్దితో ముగుస్తుంది. అందువల్ల పాత పుస్తకంలో ఉండిన మధ్య యుగాల చరిత్ర, ఢిల్లీ సల్తనత్, ముఘల్‌ పాలన వంటి పాఠాలు లేకుండా పోయాయి. చరిత్రలో ఒక భాగాన్ని న్నారి పిల్లల పాఠ్యాంశాల్లోం తొలగించినంత మాత్రాన ఆ చరిత్రను రద్దు చేయగలమని అనుకోవడం హాస్యాస్పదం. 

కోవిడ్‌ తర్వాత న్నారి విద్యార్థుల మీద పాఠ్యాంశాల భారం ఎక్కువగా ఉండగూడదనే సదుద్దేశంతో పాఠ్యాంశాల హేతుబద్ధీకరణ పేరుతో కొన్ని పాఠ్యాంశాలను కుదించడం ప్రారంభించారు. ముఘల్‌ చరిత్రలో కొంత భాగాన్ని, డార్విన్‌ జీవ పరిణామవాద సిద్ధాంతాన్ని, పీరియాడిక్‌ టేబుల్‌ను పాఠ్యాంశాలలో కుదించారు. ప్రస్తుత పుస్తకం మరొక అడుగు ముందుకు వేసి కొన్ని పాఠ్యాంశాలను పూర్తిగానే తొలగింంది. అయితే ‘భారం తగ్గించడం కోసం పాఠ్యాంశాల తగ్గింపు, తొలగింపు’ అనే సూత్రం కూడా త్తశుద్ధితో పాటించలేదు. కొన్ని కొత్త పాఠాలు వచ్చి చేరాయి. ‘భూమి పుణ్యభూమి ఎలా అవుతుంది’ అని ఒక అధ్యాయం చేర్చి, ప్రత్యేక స్థలాలను మతాలు ఎలా పవిత్రంగా భావిస్తాయో ఒక పాఠం చేర్చారు. ద్వాదశ జ్యోతిర్లింగాల గురిం, చార్‌ ధామ్‌ యాత్ర గురిం, శక్తి పీఠాల గురిం ఏడో తరగతి పిల్లలకు పాఠాలు పెట్టారు. అలాగే ‘అరవై ఆరు కోట్ల మంది పాల్గొన్న కుంభమేళా’ గురించి పాఠం చేర్చారు. కౌటిల్యుడి అర్థశాస్త్రం, పాణిని వ్యాకరణం, ఆర్యభట్టు ఖగోళ శాస్త్రం, గుప్త సామ్రాజ్యంలో శాస్త్ర పరిశోధనలు వంటి ప్రాచీన భారత మేధా కృషి గురించి పాఠాలు చేర్చారు. వర్ణ–కుల వ్యవస్థ ప్రాచీన భారత సమాజంలో స్థిరత్వం సాధించడంలో నిర్వహింన పాత్ర గురిం ఒక పాఠం పెట్టి, బ్రిటిష్‌ వారు వచ్చిన తర్వాత కుల వ్యవస్థ కరడుగట్టి అసమానతలకు దారి తీసిందని రాశారు. ఆరో శతాబ్దం నుంచి ఇరవై ఒకటో శతాబ్దానికి గంతు వేసి ప్రస్తుత ప్రభుత్వపు ‘మేక్‌ ఇన్‌ ఇండియా’, ‘బేటీ బచావో బేటీ పఢావో’, ‘అటల్‌ సొరంగం’ నిర్మాణం వంటి విషయాలు రాశారు. ఇలా మనం ఏకీభవింనా ఏకీభవించకపోయినా చరిత్ర లో జరిగిపోయిన వాస్తవ ఘటనలను, పరిణామాలను చెప్పకుండా ఉండాలనుకుంటే ఆ మేరకు చిన్నారి పిల్లల మనసులలో, పరిజ్ఞానంలో అనవసరమైన, ప్రమాదకరమైన ఖాళీలు, శూన్యాలు ఏర్పడతాయి. ఉద్దేశపూర్వకంగా ఖాళీలు వదలడం జ్ఞాన సముపార్జన శక్తిని ధ్వంసం చేసే, ఆలోచనా శక్తిని కురచబరిచే పద్ధతి. ఎటువంటి విషయమైనా చెప్పి, దాని పట్ల విమర్శనాత్మకంగా ఉండాలనే సందేశం ఇవ్వవలసిన చోట, కొన్ని విషయాలను తుడిచేయగలమని అనుకోవడం అనుతం. 

ఈ పద్ధతి ఎన్సీఈఆర్టీ వంటి ప్రామాణిక సంస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. అది పాఠశాల విద్యా ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి 1961లో కేంద్ర ప్రభుత్వం రపొందించిన అత్యున్నత ప్రవణాల స్వతంత్ర సంస్థ. అది చేసే అనేక పనులలో భాగంగా పాఠ్యాంశాలను  రూపొందించి, వాటి ఆధారంగా ఆ యారంగాల నిపుణుల చేత పాఠ్యపుస్తకాలు రాయిం, మూడు నాలుగు అంచెల పర్యవేక్షణ, పరిశీలన, సవరణల తర్వాత అచ్చువేసి దేశవ్యాప్తంగా పంపిణీ చేసే పథకం 1970ల నుం సాగుతున్నది. ముఖ్యంగా ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి సామాజిక శాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలు, భాషా సాహిత్యాల పుస్తకాలు ఆ యా తరగతుల వారు మాత్రమే కాక యూపీఎస్సీ పరీక్షార్థులు, సాధారణ పాఠకులు కూడా చదువుకునేంత ఆసక్తికరంగా తయారయ్యాయి. నిష్ణాతులు రాసిన, దశాబ్దాల పాటు అపారమైన గౌరవాన్ని చూరగొన్న ఆ పుస్తకాలను అడ్డదిడ్డంగా మార్చి, సంఘ్‌ శాఖలలో ఇన్నాళ్లుగా చెబుతున్న వక్రీకరింన, సంకుతమైన, కళ్లకు గంతలు కట్టే చరిత్రను ఇప్పుడు పాఠ్యపుస్తకాలకు ఎక్కిస్తున్నారు. ఎటువంటి పరిశోధన లేకుండా, వాస్తవాల పట్ల గౌరవం లేకుండా ఐటీ సెల్స్‌లో వండి వార్చిన అసత్యాల, అర్ధసత్యాల, వాట్సప్‌ యూనివర్సిటీ చరిత్రకు పాఠ్యపుస్తకాల గౌరవం కల్పిస్తున్నారు. భవిష్యత్‌ తరాన్ని ధ్వంసం చేస్తున్నారు.   

-ఎన్‌ వేణుగోపాల్‌ 
సీనియర్‌ జర్నలిస్ట్‌
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)