Breaking News

కాళ్లు, చేతులు కోమలంగా ఉండాలంటే.. అద్భుతమైన చిట్కాలు

Published on Thu, 02/27/2025 - 10:16

మనం అందంగా ఆకర్షణీయంగా కనిపించాలంటే కేవలం ముఖం సౌందర్యం మాత్రమే  కాదు. కాళ్లు చేతులు కోమలంగా ఉండేలా చూసుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో ఒత్తిడి లేని  జీవితాన్ని సాగించడం కూడా అంతే ముఖ్యం. అలాగే  సరిపడా నిద్రా, రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీళ్లు తాగడం చాలా ముఖ్యం. దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా  తీసుకోవాలి. అవేంటో  చూద్దామా..! 

ముఖం చూస్తే ఎంత ముచ్చటగా ఉన్నా, కాళ్లూ చేతులను పట్టించుకోకపోతే ఆ అందానికి అర్థం ఉండదు. పాదాలూ, చేతులూ కూడా బాగుంటేనే అందానికి సార్థకత. 

కాళ్లు, చేతులపై మృతకణాలు పేరుకున్నప్పుడు చర్మం  పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంది. మీ పరిస్థితి కూడా ఇదే అయితే.. ఎప్పటికప్పుడు ఈ మృతకణాలు తొలగించేందుకు ప్రయత్నించడం మంచిది. దానికి సంబంధించిన కొన్ని పూతలు తయారుచేసి ప్రయత్నిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. చర్మం కూడా ఆరోగ్యంగా మారుతుంది.

రాత్రి పడుకునే ముందు కాస్తంత స్వచ్ఛమైన కొబ్బరినూనెను  పాదాలకు రాసుకుని మర్దన చేయాలి. ఆ తర్వాత సాక్సులు వేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా రోజూ చేయడం వల్ల  పొడిబారిన చర్మం కాస్తా చాలా తక్కువ వ్యవధిలోనే మృదువుగా మారుతుంది. 

చదవండి: ఒకే ఒక్క శ్వాసతో రికార్డ్‌: భారతీయ మత్స్య కన్య సక్సెస్‌ స్టోరీ!
మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్‌ మహిళ వీడియో వైరల్‌


గోరువెచ్చని నీటిలో కొద్దిగా వంటసోడా, ఏదైనా కొన్ని చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌ను వేయాలి. లేదంటే ఆల్మండ్‌ ఆయిల్‌ లేదా ఆలివ్‌ ఆయిల్‌ అయినా ఫరవాలేదు. కుదిరితే అందులో కొన్ని గులాబీ రేకలూ వేసుకోవచ్చు. ఇందులో చేతులు లేదా కాళ్లను ఓ పదినిమిషాలు ఉంచి తీసేయాలి. ఇలా చేయడం వల్ల కాళ్లు, చేతుల చర్మం మృదువుగా మారుతుంది.

గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఎప్సమ్‌ సాల్ట్‌ వేసుకుని అందులో కాళ్లు లేదా చేతుల్ని ఉంచాలి. పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేసుకుని పొడిబట్టతో మృదువుగా అద్దుతూ తుడిచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ భాగాలకు రక్తప్రసరణ సజావుగా జరిగి, రఫ్‌నెస్‌ తగ్గి మృదువుగా మారతాయి. 

ఒక నిమ్మచెక్కకు పంచదార అద్దుకోవాలి. దీనితో కాళ్లు, చేతులకు మర్దన చేస్తున్నట్లు మృదువుగా రుద్దుకోవాలి. అలాగే రాత్రి నిద్రించే ముందు ఆలివ్‌ లేదా ఆల్మండ్‌ ఆయిల్‌తో మర్దన చేసుకున్నా సరి΄ోతుంది. ఇది చర్మాన్ని ఎంతో కోమలంగా ఉంచుతుంది.కోమలమైన కాళ్లూ చేతులకు..  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)