Breaking News

నేషనల్‌ సేఫ్‌ మదర్‌హుడ్‌ డే 2024 : ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌

Published on Thu, 04/11/2024 - 13:28

ప్రతీ ఏడాది ఏప్రిల్‌ 11న జాతీయ మాతృత్వ దినోత్సవాన్ని(NSMD) జరుపుకుంటారు. ఇది మాతృత్వాన్ని గౌరవించే రోజు. కాబోయే తల్లులకు,  పుట్టబోయే బిడ్డలకు సరైన ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి సేవల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి దేశంలో జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని జరుపు కుంటారు.  

మహిళ ఒక బిడ్డకు జన్మనివ్వడంలో సమాజ బాధ్యతపై అవగాహన  కల్పించేందుకు ఏర్పరచుకున్న ఒక రోజు. అన్నీ సవ్యంగా జరిగితే నిజంగా అదొక అద్భుతం. మరపురాని మధుర జ్ఞాపకంగా మిగిలిపోయే  రోజు. కానీ మన దేశంలో ప్రసవ సమయంలో ప్రాణాలు కోల్పోతున్న  స్త్రీలు ఇంకా చాలామందే ఉన్నారు.

గర్భధారణ సమయంలో, ఆ తర్వాత కూడా పోషకాహార లోపంతో మహిళలు బాధపడుతున్నారు. ఫలితంగా ముందస్తు ప్రసవాలు, శిశువుల్లో శారీరక లోపాలు లాంటి సమస్యలు తలెత్తు తున్నాయి. ఈనేపథ్యంలో మహిళలకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల, ఆరోగ్యవంతమైన శిశవులు జననంపై అవగాహన కల్పించేందుకే ఈ జాతీయ మాతృత్వ దినోత్సవం. తద్వారా మాతాశిశు మరణాల రేటును తగ్గించడంలో పురోగతి సాధించగలం. 

2024 థీమ్‌: ఈ సంవత్సరం ప్రినేటల్ కేర్ (గర్భంధ రించిన తర్వాత గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు) స్కిల్డ్ బర్త్ అటెండెంట్‌లు, ప్రసవానంతర సహాయాన్ని మెరుగు పరచడంపై దృష్టి పెడుతుంది.  పోషకాహారం, రెగ్యులర్ చెకప్‌లు , గర్భిణీ స్త్రీలకు అవసరమైన సమాచారాన్ని పొందాల్సిన ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేస్తుంది.

ప్రతి స్త్రీకి మాతృత్వాన్ని సురక్షితమైన, సంతోషకరమైన అనుభవంగా మార్చడానికి కృషి చేద్దాం. కాబోయే తల్లి ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తామని , ప్రతి తల్లికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రతిజ్ఞ చేద్దాం. తల్లీబిడ్డలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందేలా పాటుపడదాం.  సురక్షిత మాతృత్వ దినోత్సవ శుభాకాంక్షలు!
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)