Breaking News

National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్‌ టీ, అందరూ తాగొచ్చా?

Published on Tue, 04/30/2024 - 12:53

ప్రపంచవ్యాప్తంగా టీ ప్రేమికులకు కొరత లేదు. ఇందులో గ్రీన్‌టీ, బ్లాక్‌ టీ ఇలా  రకరకాల టీలు   చాయ్‌ ప్రియులను ఉల్లాస పరుస్తుంటాయి.  మరి బుబుల్‌ టీ అని ఒక ‘టీ’ ఉంది. దీని గురించిఎపుడైనా విన్నారా? ఈ రోజు(ఏప్రిల్ 30) నేషనల్‌ బబుల్‌టీ డే అట.  అసలు దీన్ని ఎలా తయారు చేస్తారు. దీని వలన లాభాలేంటో ఒకసారి  చూద్దామా..?

బబుల్ టీ.. ఈ పేరే కొత్తగా  ఉంది కదా. బబుల్ టీని బోబా లేదా పెర్ల్ మిల్క్ టీ అని కూడా పిలుస్తారు. ఇది ఆసియాలో ముఖ్యంగా  తైవాన్‌లో బాగా పాపులర్‌. అధిక ప్రోటీన్‌తో నిండి ఉంటుంది  కనుక  చైనా ధనవంతుల్లో దీనికి  డిమాండ్‌ ఎక్కువ.

బబుల్ టీని పాలు, పండ్లు, పండ్ల రసాలతో టీ కలిపి, చివర్లో టేపియోకా ముత్యాలను కలిపి సేవిస్తారు. దీన్ని శీతాకాలంలో వేడిగా,  వర్షాకాలంలో చల్లగా సేవిస్తారు.

అయితే, బబుల్ టీలో చక్కెర, కొవ్వులు ,సాధారణ కార్బోహైడ్రేట్‌లు అధికంగా ఉండటం వల్ల క్రమం తప్పకుండా మరియు అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. మధుమేహం ,గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకని మితంగా తీసుకోవడమే ఉత్తమం.

బబుల్ టీలో ఉపయోగించే టపియోకా ముత్యాలు కాసావా రూట్ నుండి తయారవుతాయిపైగా వీటిలో  కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అవి అంతర్గతంగా అనారోగ్యకరమైనవి కానప్పటికీ,  అదనపు కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఈటీలో చేరతాయి.

కేలరీల గని ఈ బబుల్‌ టీ. కార్బోహైడ్రేట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. అందుకే దీన్ని రోజువారీ పానీయంగా కాకుండా అప్పుడప్పుడు తీసుకునే స్పెషల్‌ ట్రీట్‌గా మాత్రమే భావించాలి. సాధ్యమైనప్పుడు తక్కువ చక్కెర లేదా చక్కెరలేని స్వీట్నెర్‌లను,  అలాగే క్యాలరీ ,కార్బోహైడ్రేట్లను తగ్గించేందుకు  టపియోకా ముత్యాలకు బదులుగా ఫ్రూట్ జెల్లీలు లేదా అలోవెరా వంటి  టాపింగ్స్‌ను వాడుకోవచ్చు. 
 

#

Tags : 1

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)