Breaking News

బుజ్జి.. ఓ దివ్యాంగురాలి స్నేహగీతం

Published on Mon, 08/03/2026 - 12:18

జీవితం ఓ అద్భుత ప్రయాణం.. ఈ పయనంలో మనకు తోడుగా, నీడగా నిలిచే అనుబంధాల్లోకెల్లా స్నేహం అత్యంత మధురమైనది, విలువైనది. రక్తసంబంధం లేకున్నా, ఆత్మ బంధాన్ని పెంచే మనసులతో పెనవేసుకునే ఈ బంధం, సంతోషాన్ని ద్విగుణీకృతం చేస్తుంది.. కాలంతో పాటు అది మరింత గాఢమవుతుంది. ఈ చిత్రం చూడండి.. ఇక్కడ కనిపిస్తున్న వృద్ధురాలు ఎవరూ లేని ఒక మానసిక వికలాంగురాలు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఈడేపల్లిలో ఉన్న జట్టి నరసింహం ప్రభుత్వ వృద్ధాశ్రమంలో తల దాచుకుంటోంది. 

ఈమె పేరు నండూరి బాలమణి. మూడేళ్ల క్రితం పెడన రోడ్డులో కుక్కపిల్లతో అనాథగా సంచరిస్తున్న ఈమెను ఓ వ్యక్తి పోలీస్‌లకు అప్పగించాడు. పోలీసులు ఆమెను ఈ వృద్ధాశ్రమంలో చేర్పించారు. ఆమెతో పాటే ఆ కుక్క కూడా ఆ వృద్ధాశ్రమానికి వలస వచ్చి ఆమెతో పాటే బతుకుతోంది. కుక్కను ‘బుజ్జి’ అంటూ ప్రేమతో పిలుస్తూ అన్నపానాలు ఇస్తుండటంతో పాటు స్నానం సైతం చేయిస్తోంది. వృద్ధాశ్రమంలో ఒకే మంచంపై స్నేహ పూర్వకంగా ఉంటున్న బాలామణి– కుక్కను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. స్నేహానికి ఏ భేదం ఉండదనే నానుడికి వీరి స్నేహం నిదర్శనంగా నిలుస్తోంది. 
– మచిలీపట్నం టౌన్‌   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)