Breaking News

16 ఏళ్ల అమ్మాయికి స్నేహలేఖ

Published on Sun, 10/11/2026 - 04:05

ప్రధాన థీమ్‌ ‘‘బాల్యవివాహాలను అరికడదాం.. బాలికల హక్కుల కోసం పెట్టుబడి పెడదాం’’. ఈ నినాదం ఇప్పటికీ కొనసాగుతున్న బాల్యవివాహాలను అరికట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.

‘ఎవరు ఈ అమ్మాయి?’ అని ఆశ్చర్యపోతూ ఉత్తరం అందుకున్నావా? రాసిన నేను, అందుకున్న నువ్వు ఇద్దరం ఒక్కళ్లమే. కాకపోతే ఇప్పుడు నాకు 25. కాని ఉత్తరం అందుకున్నది 16 ఏళ్ల నువ్వు.  నాడు నాకు అర్థం కాని ప్రపంచాన్ని నేడు అర్థం చేసుకొని రాసిన లేఖ ఇది. చదువుకో. నీ ఈడు వాళ్లతో చదివించు.

ప్రియమైన 16 ఏళ్ల ‘నాకు’...,
నువ్వు అద్దంలో చూసుకుంటూ ముఖం మీదున్న మొటిమల గురించి, నీ రంగు గురించి, నీ బాడీ షేప్‌ గురించి తెగ బాధపడిపోతున్నావని నాకు తెలుసు. నీ క్లాస్‌మేట్స్‌ బాడీ షేమింగ్‌ చేశారని రాత్రిళ్లు దిండులో ముఖం పెట్టుకుని ఎవరికీ చెప్పుకోలేక ఏడుస్తున్నావని కూడా నాకు గుర్తుంది. 25 ఏళ్ల వయసు నుంచి అదంతా చూస్తూ ఉంటే అప్పుడు ఎలా అంత అమెచ్యూర్‌గా బిహేవ్‌ చేశానా అనిపించింది. ఇప్పుడు నేను నీకు చెప్పబోయే విషయాలు అప్పుడే నాకు ఎవరైనా చెప్పి ఉంటే బాగుండేదనిపించింది. ఏం పర్లేదు. ఇప్పుడు విను. నిన్ను నువ్వు గెలువు. ఇలా చెయ్‌......

సమాజం కొలతల్లో ఇరుక్కోకు
సినిమాల్లో, యాడ్స్‌లో చూపించే హీరోయిన్లలా పర్‌ఫెక్ట్‌గా లేనని నువ్వు కుంగిపోవాల్సిన అవసరం లేదు.  సమాజం అమ్మాయిల అందానికి కొన్ని ఫేక్‌ కొలతలు పెట్టింది. నీ చర్మం, నడుము సైజు నీ వ్యక్తిత్వాన్ని, టాలెంట్‌ను డిసైడ్‌ చేయలేవు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఒక అద్భుతం. అద్దంలో చూసు కున్నప్పుడు నీ లోపాలను కాదు, నీలోని విలువలను చూడు. నీ నవ్వు చాలా పవర్‌ఫుల్‌. దాన్ని ఎవరి జడ్జ్‌మెంట్స్‌ కోసం దాచుకోకు.

రీల్స్‌ విష వలయంలో పడకు
ఇన్ స్టాగ్రామ్‌లో, సోషల్‌ మీడియాలో మిగతా అమ్మాయిల లగ్జరీ లైఫ్‌ స్టైల్, గ్లామరస్‌ ఫోటోలు చూసి నువ్వు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లోకి వెళ్తున్నావని నాకు తెలుసు. కానీ గుర్తు పెట్టుకో... స్క్రీన్ పై కనిపించేదంతా నిజం కాదు. అదంతా ఫిల్టర్లు, ఎడిటింగ్‌ మాయాజాలం. అక్కడ వచ్చే లైకులు, హార్ట్‌ ఎమోజీలు నీ జీవితానికి సర్టిఫికెట్లు కావు. నీకు ఎంతమంది వర్చువల్‌ ఫాలోవర్స్‌ ఉన్నారనేది కాదు, నీ కష్టాల్లో నీ పక్కన ఎంతమంది నిజమైన మనుషులు ఉన్నారనేదే ముఖ్యం. వర్చువల్‌ ప్రపంచంలో నీ ఒరిజినాలిటీని అమ్ముకోకు.

డిజిటల్‌ వరల్డ్‌ డేంజర్‌
టెక్నాలజీ మన చేతుల్లో ఉండటం మంచిదే. కానీ అది నిన్ను ట్రాప్‌ చేయకూడదు. ఇంటర్నెట్‌లో ఇన్‌బాక్స్‌ల్లో ఎవరో తెలియని వ్యక్తులు పొగిడారని, ప్రేమను కురిపించారని నమ్మేయకు. నీ పర్సనల్‌ లైఫ్, ఫోటోలు, ప్రైవేట్‌ ఆలోచనలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసేటప్పుడు కత్తిమీద సాములా ఉండు. నీ ప్రైవసీని కాపాడుకోవడం నీ బాధ్యత. డిజిటల్‌ వరల్డ్‌లో నిన్ను బ్లాక్‌మెయిల్‌ చేసినా, ఇబ్బంది పెట్టే ఏ చిన్న విషయం ఎదురైనా  వెంటనే పేరెంట్స్‌కో లేదా నమ్మకమైన లీగల్‌ సపోర్ట్‌కో చెప్పు. దాచడం వల్ల సమస్యలు పెరుగుతాయే తప్ప తగ్గవు.

‘నో’ చెప్పడం ఒక సూపర్‌ పవర్‌
ఎవరినో ఇంప్రెస్‌ చేయడానికి ‘ఎస్‌’ అనకు. ఫ్రెండ్స్‌ గ్రూప్‌లో ‘కూల్‌’ అనిపించుకోవడానికి నీ మనస్సాక్షి ఒప్పుకోకపోయినా ‘సరే’ అనడం ఆపేయ్‌. తప్పుడు అలవాట్లు ఎదురైనా,  ప్రేమ పేరుతో నిన్ను లొంగదీసుకోవాలను కునే నకిలీ రిలేషన్ షిప్స్‌ తారసపడినా నీకంటూ ఒక బలమైన వాయిస్‌ ఉందని మరువకు. నీకు కంఫర్టబుల్‌గా లేని ప్రతి విషయానికి, ప్రతి స్పర్శకు గట్టిగా, మొహం మీదే, ధైర్యంగా ‘నో’ చెప్పడం ఇప్పుడే ప్రాక్టీస్‌ చెయ్‌. ఆ ఒక్క ‘నో’ నిన్ను భవిష్యత్తులో పెద్ద ప్రమాదాలు, మానసిక క్షోభ నుంచి కాపాడుతుంది.

కొంపలేం మునగవు
ఈ వయసులో కెరీర్‌ గురించి, ర్యాంకుల గురించి నువ్వు పడుతున్న ఒత్తిడి నాకు అర్థమవుతోంది. రేపు పొద్దున ఎగ్జామ్స్‌లో అనుకున్న మార్కులు రాకపోతే జీవితం శూన్యం అయిపోతుందని భయపడుతున్నావు. కానీ నమ్ము, లైఫ్‌ అక్కడితో ఆగదు. కేవలం మార్కులే కాదు... నీ స్కిల్స్, నీ కమ్యూనికేషన్, నీ క్రియేటివిటీ, నీ అంకితభావం నిన్ను నిలబెడతాయి. సమాజం చెప్పే సాంప్రదాయ కోర్సుల్లోనే కాకుండా, నీకు నచ్చిన రంగంలో నైపుణ్యం పెంచుకో. ఆర్థిక స్వతంత్రం సాధించడమే నీ మొదటి లక్ష్యం కావాలి. నువ్వు అనుకున్న దానికంటే చాలా పెద్ద సక్సెస్‌లు నీ కోసం ముందర ఎదురు చూస్తున్నాయి. తప్పులు చెయ్, కాని వాటి నుండి నేర్చుకో.

మెంటల్‌ హెల్త్‌ అండ్‌ సెల్ఫ్‌ లవ్‌
అప్పుడప్పుడు నీకు ఒంటరిగా అనిపించవచ్చు, డిప్రెషన్‌ రావచ్చు. అది మానసిక అలసట, చాలా నార్మల్‌. మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడటానికి, అవసరమైతే థెరపీ లేదా కౌన్సిలింగ్‌ తీసుకోవడానికి అస్సలు సిగ్గుపడకు. తోటి అమ్మాయిలతో నిన్ను నువ్వు పోల్చుకుని నీ కాలాన్ని, నీ శక్తిని వృథా చేసుకోకు. నీ శరీరాన్ని నువ్వు గౌరవించు, నీ మనసును బేషరతుగా ప్రేమించు. ఇవాళ 25 ఏళ్ల వయసులో నేను ఇంత స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో, సమాజంలో తలెత్తుకుని నా సొంత కాళ్లపై నిలబడి బతుకుతున్నానంటే... నాటి 16ఏళ్ల వయసులో నువ్వు పడ్డ కష్టాలు, అడ్డంకులు దాటి ముందుకు సాగడమే కారణం. నా కోసం, నా భవిష్యత్తు కోసం ఆ రోజు నువ్వు నిలబడినందుకు థ్యాంక్యూ మై డియర్‌ లిటిల్‌ సెల్ఫ్‌! నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను.
ఇట్లు, నీ 25 ఏళ్ల నేను


 

#

Tags : 1

Videos

టీడీపీ నుండి YSRCP లోకి చేరిన వెంటనే వరాలు కురిపించిన రాచమల్లు

హీరోగా విజయ్ వారసుడు

నవరాత్రుల వేళ ఇదేం అపచారం..! పూజలు లేకుండానే అమ్మవారి నిమజ్జనం

5 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది.. మేడ్చల్ బాలిక కేసులో షాకింగ్ నిజాలు..

నాడు తిట్లు.. నేడు ప్రశంసలు 'ది హిందూ'లో మోదీపై చంద్రబాబు ప్రేమలేఖ

మూఢ నమ్మకంతో డీజిల్ పోసి తల్లినే చంపిన కొడుకు

పుష్ప శ్రీవాణి సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

దుర్గ గుడిలో సౌకర్యాలపై కేశినేని చిన్ని ని కడిగిపారేసిన భక్తులు

బాహుబలి కిలికి భాష గుర్తుందా..! వారణాసిలో అంతకు మించి..!

అరెస్ట్ చేయలేదు.. నన్ను కిడ్నాప్ చేశారు.. ధృవ్ రాఠీ సంచలన వీడియో

Photos

+5

ఇంద్రకీలాద్రిపై తొలిరోజు (ఫొటోలు)

+5

మల్లెపూలతో మెస్మరైజ్ చేస్తోన్న మంగళవారం బ్యూటీ.. (ఫోటోలు)

+5

రంభ ఊర్వశి మేనక బ్యూటీ రాశి సింగ్ లేటెస్ట్ పిక్స్.. (ఫోటోలు)

+5

రైళ్లు కిటకిట (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా రవితేజ కొత్త సినిమా తులాభారం ప్రారంభం.. (ఫోటోలు)

+5

హైదరాబాద్ : డ్యాన్స్‌తో అదరగొట్టిన విద్యార్థులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ షాన్-ఎ-దక్కన్ కార్ ర్యాలీ ప్రారంభించిన నటుడు సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

హీరో విజయ్ దేవరకొండ (ఫోటోలు)

+5

అందాల అర్చన.. ఆకట్టుకుందిలా.. (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 11 -అక్టోబర్ 17)