Breaking News

నవ్వుతూ.. నవ్విస్తూ..

Published on Wed, 09/11/2024 - 10:03

నలుగురితో నారాయణ అని కాకుండా నలుగురిలో నేను వేరయా అన్నట్లు ఆర్‌జేలలో ఆర్‌జే స్వాతి వేరయా అని నిరూపిస్తున్నారు. డిఫరెంట్‌ కంటెంట్‌తో అటు ఆర్‌జేగా ఇటు సోషల్‌మీడియా సెలబ్రిటీగా మరోవైపు ఇంట్లో ఇల్లాలిగా, పిల్లల ఆలనాపాలనతో పాటు పలు షోలను చేస్తూ తన సత్తాచాటుతోంది. ఆర్‌జేగా చేశామా అనేది కాకుండా కొంగొత్త థీమ్స్‌తో ఇంటర్వ్యూలు చేస్తూనే ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ రీల్స్‌ చేస్తూ.. తన గెటప్స్‌తో అదరగొడుతున్నారు.  

నవ్వించడం చాలా కష్టం.. అందులో ఎదుటువారిమీద జోక్‌వేసి నవ్వించడం ఒకతీరైతే.. తనమీద తానే జోక్స్‌ వేసుకొని డిఫరెంట్‌ గెటప్స్‌తో నవ్వించడం మరోతీరు. ఈ కోవకే చెందుతారు ఆర్‌జే స్వాతి. పేరడీ, రీమిక్స్‌తో లక్షల్లో వ్యూస్‌ సంపాదిస్తూ.. సోషల్‌ మీడియాలో సంచలనాలను సృష్టిస్తున్న ఆర్‌జే స్వాతి తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు.. 

టిపికల్‌ మిడిల్‌క్లాస్‌ ప్యామిలీ.. 
టిపికల్‌ మిడిల్‌క్లాస్, స్ట్రిక్ట్‌ ప్యామిలీ.. మాది. పుట్టింది వరంగల్‌.. అక్కడే స్కూలింగ్‌ చేశాను. హైదరాబాద్‌ రామాంతపూర్‌లో డిగ్రీ చేసి బీపీఓలో ఉద్యోగం చేసేదానిని. మొదట్లో హైదరాబాద్‌ కల్చర్‌ను అలవాటు చేసుకోవడానికి చాలా టైం పట్టింది. కానీ త్వరగా మేలుకొని అలవాటయ్యాను. నాకు మాట్లాడటం అలవాటు.. ఎదుటివారితో కలిసిపోవడం, నవి్వంచడం చాలా ఇష్టం. బీపీఓలో గడగడా మాట్లాడుతూ కస్టమర్‌ కేర్‌లో గడసరిగా పేరుతెచ్చుకున్నాను. అలా 2013లో ఆర్‌జేగా మీరు కూడా అవ్వొచ్చు అనే అడ్వర్‌టైజ్‌మెంట్‌ రావడంతో ఇంట్లో చెప్పకుండా ఆర్‌జే ఆడిషన్స్‌కి వెళ్లి ఆడిషన్‌ ఇచ్చాను. నా ఆడిషన్‌ రేడియో మిర్చి వారికి నచ్చి నన్ను ఆర్‌జేగా తీసుకున్నారు.

ఇమిటేషన్, కొత్త థీమ్స్‌ ఇంటర్వ్యూలు.. 
అందరిలా ఆర్‌జే చేయడం కన్నా కొద్దిగా సరికొత్తగా చేయడం ఇష్టం. అలా గురు సినిమా హీరో వెంకటేష్‌తో హీరోయిన్‌ మాదిరి ఇమిటేషన్‌ ఇంటర్యూ చేయడం ఆయనకు నచి్చంది. సందర్భానుసారం మట్లాడుతూ, మిమిక్రీ చేస్తూ, సినిమా ఇంటర్యూలలో ఆ సినిమా తాలూకూ థీంని తీసుకొని ఇంటర్యూ చేసేదానిని. అలా ఆర్‌జేగా నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది.

ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలకు స్పందన.. 
సోషల్‌ మీడియా వచ్చాక ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నవ్వించే వీడియోలు చేశాను. కానీ సరికొత్తగా చేయాలనే తపనతో రీమిక్స్‌ గెటెప్‌ల వైపు మొగ్గాను. ట్రెండింగ్‌లోని వీడియోలకు అచ్చం అలాగే గెటప్స్‌ వేసి రీమిక్స్‌ వీడియోలు చేయడం ప్రారంభించాను. నెటిజన్ల నుండి అనూహ్య స్పందన లభించింది. ట్రెండింగ్‌ వీడియోస్‌లోని వారిని అనుకరించడానికి వారి గెటప్స్‌కి పేరడీగా ఇంట్లో వంట వస్తువులు, కూరగాయలు, నూడిల్స్, మా కుంటుబసభ్యుల దుస్తులు వాడతాను. అలా చేయడం నెటిజన్లను మరింత ఆకర్షించింది. దీంతో రీమిక్స్‌కి లక్షల్లో వ్యూస్‌ వచ్చాయి. ఇన్‌స్టాలో లక్షాపదివేల మంది ఫాలోవర్స్‌ వచ్చారు. కొంగొత్త కంటెంట్‌తో నవి్వంచడం నా కర్తవ్యం. ఓ రోజు మా స్టూడియోకి మాజీ మంత్రి కేటీఆర్‌ వచి్చనపుడు ర్యాప్‌ సాంగ్‌ పాడాను. ఆయనకు చాలా నచ్చి మీరు ర్యాపరా కూడానా అని మొచ్చుకున్నారు.

లేడీ కమెడియన్‌ అవ్వాలి.. 
నేటితరంలో లేడీ కమెడియన్లు చాలా అరుదుగా ఉన్నారు. కోవై సరళలాగా తనమీద తనే జోకులు వేసుకుంటూ చేసే కామెడీని చేయాలన్నది నా కోరిక. లేడీ కమెడియన్‌గా అడుగులు వేస్తున్నాను. పలు టీవీ షోల వారితో సంప్రదింపులు  జరుగుతున్నాయి. త్వరలో ఆర్‌జేగా, సోషల్‌ మీడియాతో పాటు బుల్లితెర, వెండితెరలలో నవ్వులు పూయించాలన్నదే నా ఆకాంక్ష.. నవ్వూతూ బ్రతకాలిరా.. నవ్వుతూ చావాలిరా.. నా చివరి శ్వాస వరకూ ప్రేక్షకులను నవి్వంచడానికి ప్రయతి్నస్తూనే ఉంటాను.. ఇట్లు.. మీ ఆర్‌జే స్వాతి.  

Videos

విశాఖలో పుష్ప శ్రీ వాణి అరెస్ట్

పోలీసులు ఆపుదాం అని చూసారు ఇచ్చిపడేసిన పుష్ప శ్రీ వాణి

వాళ్లకు నీళ్లు.. మాకు కన్నీళ్లా..? బాబుకు శిల్ప చక్రపాణి వార్నింగ్

బాబు సభ కోసం బెదిరింపులు.. బయటపడ్డ ఆడియో లీక్

'రోడ్డు బాగు చేసే వరకు లేవను'.. నడిరోడ్డుపై భీష్మ ప్రతిజ్ఞ!

అమెరికా హెచ్-1బీ వీసా వ్యవస్థలో, భారత్ కేంద్రంగా బయటపడ్డ మహా కుంభకోణం

కన్నీళ్లు పెట్టుకున్న వైభవ్ బ్యాడ్ టైం అంటే ఇదేరా బుద్దోడా

ఆనం వెనక్కి పో.. నిమ్మల ముందుకు రా వీడియో వైరల్..

YSR పై పాట ఇరగదీసిండు.. ఇది పక్కా ఊరోడి కథ

రష్మిక హెల్త్ ఎలా ఉంది? వదిన నన్ను ముద్దుగా ఏమని పిలుస్తాదంటే?

Photos

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

‘కూర్మావతార్‌’ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)