Breaking News

మటన్‌ ఖీమా సమోసా తయారీ ఇలా! పుదీనా చట్నీతో తిన్నారంటే..

Published on Sun, 04/16/2023 - 14:37

Mutton Keema Samosa: మటన్‌ ఖీమా సమోసా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండిలా!
కావలసినవి:
►మటన్‌ కీమా – అర కేజీ
►పచ్చి బఠాణీ– 100 గ్రాములు
►ఉల్లిపాయ – 1 (తరగాలి)
►ఉప్పు – టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి

►అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – టేబుల్‌ స్పూన్‌
►పచ్చి మిర్చి – 2 (సన్నగా తరగాలి)
►మిరప్పొడి– టీ స్పూన్‌
►ధనియాల పొడి– టీ స్పూన్‌

►జీలకర్ర పొడి – టేబుల్‌ స్పూన్‌
►బంగాళ దుంపలు – 2
►కొత్తిమీర తరుగు – కప్పు
►నూనె – పావు కేజీ
►గోధుమ పిండి – పావు కేజీ.

తయారీ:
►గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు, వేడి నీటిని పోసి చపాతీలకు కలుపుకున్నట్లు ముద్దలా కలుపుకుని తడి వస్త్రాన్ని కప్పి పక్కన పెట్టాలి.
►బంగాళదుంపలను కడిగి చెక్కు తీసి చిన్న ముక్కలుగా తరగాలి.
►పచ్చి బఠాణీలను కడిగి చిటికెడు చక్కెర వేసి ఒక మోస్తరుగా ఉడికించి పక్కన పెట్టాలి.

►ఖీమాను శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మరోసారి కడగాలి.
►మందపాటి పెనంలో టీ స్పూన్‌ నూనె వేసి ఖీమా వేసి రంగు మారేవరకు సన్నమంట మీద వేయించాలి.
►ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, బఠాణీ, అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, మిరప్పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.
►పదిహేను నిమిషాల సేపు సన్న మంట మీద ఉడికించాలి.

►ఖీమా, బంగాళదుంప ముక్కలు ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగు వేసి కలిపి ఒకసారి రుచి చూసి అవసరం అనిపిస్తే మరికొంత ఉప్పు, మిరప్పొడి కలుపుకోవాలి.
►చివరగా కొద్దిసేపు మూత తీసి మంట పెంచి కలుపుతూ ఉడికించాలి.
►తేమ ఆవిరై పోయి ఖీమా కర్రీ సమోసా స్టఫ్‌ చేయడానికి తగినట్లు రావాలి.
►గోధుమ పిండిని చపాతీల్లా వత్తుకుని ఒక్కో చపాతీని సగానికి కట్‌ చేసుకోవాలి.

►ఒక ముక్కని ఐస్‌క్రీమ్‌ కోన్‌లాగ చేసుకోవాలి.
►టీ స్పూన్‌ ఖీమా కర్రీ పెట్టి అంచులను అతికిస్తే సమోసా ఆకారం వస్తుంది.
►ఒక చపాతీతో రెండు సమోసాలన్నమాట.

►అన్నింటినీ ఇలాగే చేసుకుని ఆ తర్వాత బాణలిలో నూనె వేడి చేసి సమోసాలను దోరగా కాల్చుకోవాలి.  
►ఈ సమోసాల్లోకి పుదీనా చట్నీ మంచి కాంబినేషన్‌. 
ట్రై చేయం‍డి: ఆవకాయ.. పచ్చడి తయారీ ఇలా! నూనెను మరిగించకుండా పచ్చిగా వేసినా

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)