Breaking News

ఐస్‌క్రీంలో ఆ ‘ముక్క’ చూసి డాక్టర్‌కు కక్కొచ్చినంత పనైంది!

Published on Thu, 06/13/2024 - 13:27

Human Finger Inside Cone Ice Cream  ఫింగర​ చిప్స్‌ గురించి విన్నాం కానీ, ఐస్‌ కీంలో ఫింగర్‌ గురించి విన్నారా?ఆన్‌లైన్‌ ఆర్డర్‌ చేసుకొని  చల్ల..చల్లగా.. ఐస్‌క్రీం తింటూ ఉండగా, గట్టిగా ఏదో తగిలినట్టైంది. దీంతో పరిశీలనగా చూడగా   తెగిన  మనిషి వేలు ముక్క కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాకైన  సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. చదువుతోంటేనే.. యాక్‌  అనిపిస్తోంది కదా.. ముంబైలో జరిగిన ఈ  షాకింగ్‌ ఘటన  వైరల్‌గా మారింది. 

ముంబైలోని మలాడ్ ప్రాంత నివాసి డా. ఓర్లెమ్ బ్రెండన్ సెర్రావ్ (27) బుధవారం ఆన్‌లైన్ డెలివరీ యాప్ ద్వారా బటర్‌స్కాచ్ కోన్ ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్  చేశాడు.  ఆర్డర్‌ అందుకొని ఉత్సాహంగా తింటున్న సమయంలో నాలుకకు ఏదో గట్టిగా తగలడంతో ఏంటా? అని పరికించి చూశారు. అంతే  ఒ‍క్కసారిగా వాంతి వచ్చినంత పనైంది. 2 సెంటీమీటర్ల పొడవు ఉన్న మనిషి వేలి ముక్కను  చూసి దిగ్భాంతికి లోనయ్యారు. దీనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఐస్‌క్రీం కంపెనీపై కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం ఐస్‌క్రీమ్‌లో లభించిన మానవ అవయవాన్ని పోలీసులు ఎఫ్‌ఎస్‌ఎల్ (ఫోరెన్సిక్)కు పంపినట్లు మలాడ్ పోలీసు అధికారులు తెలిపారు. 

 తన అనుభవాన్ని బ్రెండన్‌ ఇలా షేర్‌ చేశారు. ‘ఉదయం నాసోదరి ఆన్‌లైన్ డెలివరీ యాప్ ద్వారా కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేస్తోంది.. దీంతో నేను మూడు బటర్‌స్కాచ్ కోన్ ఐస్‌క్రీమ్‌లను జాబితాలో చేర్చమని చెప్పాను.  డెలివరీ రాగానే ఐస్‌క్రీం కోను ఆస్వాదిస్తుండగా ఈ భయంకరమైన అనుభవం ఎదురైంది’ అంటూ తెలిపారు.  

 

అయితే నిజంగానే ఇది మనషి ఫింగర్‌ ముక్కా, లేక మరేదైనా అనేది విచారణలో తేలనుంది. మరోవైపు ఈ వ్యవహారంపై  ఐస్ క్రీం తయారీదారు ఇంకా స్పందించలేదు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)