Breaking News

నేడు మృగశిర కార్తె

Published on Sun, 06/08/2025 - 08:31

నెన్నెల(మంచిర్యాల): మృగశిర అనగానే గుర్తుకు వచ్చేది చేపలు. ఈ కార్తె ఆరంభరోజు చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. మృగశిర కార్తెతో వర్షాకాలం ప్రారంభమైందని అంటారు. కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు. ప్రధానంగా ఉబ్బసం, ఆయాసం ఉన్నవారికి ఈ చేపలు ఎంతో మంచివి. వేసవిలో ఉష్ణోగ్రతలతో శరీరంలో వేడి ఎక్కువ ఉంటుందని అది చేపలు తినడం వల్ల దూరమవుతుందనేది పెద్దల మాట. దీంతోపాటు పెరిగిన సమతుల్యం, హృదయ సంబంధిత వ్యాధుల నివారణకు చేపలు తినడం మంచిదని చెబుతారు. రోహిణి కార్తెలో వేడెక్కిన శరీరం చల్లబడేందుకు పోషక విలువలు పొందేందుకు చేపలు తినాలనేది ఆనవాయితీగా వస్తోంది. ఈక్రమంలో మృగశిర రోజున చేపలకు మంచి గిరాకీ ఉంటుంది.

ఫిష్‌ మార్కెట్లు సిద్ధం
మృగశిర కార్తె రోజు చేపలు తినాలనే ఆనవాయితీ ఉండటంతో ఉమ్మడి జిల్లాలోని చేపల మార్కెట్లు సిద్ధం చేశారు. గ్రామాల్లో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, వాగుల్లో చేపలను పట్టి మార్కెట్లకు తరలించేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. గ్రామీణప్రాంతాల్లో వాడవాడ తిరుగుతూ వ్యాపారులు చేపలు విక్రయిస్తారు.

చేపలకు డిమాండ్‌
మృగశిర రోజు రెట్టింపు ధరలైనా వినియోగదారులు కొనుగోలు చేసేందుకు వెనుకాడరు. సాధారణ రోజుల కంటే చేపలకు ధరలు విపరీతంగా పెరుగుతాయి. అయినా మత్స్యప్రియులు కొనేందుకు వెనుకాడరు. బొమ్మ చేప ధర సాధారణ రోజుల్లో కిలో రూ.300 ఉండగా మిరుగు రోజు కిలో రూ.600 రెట్టింపు ధర పలుకుతోంది. రవు, బొచ్చె, బంగారు తీగ, మెరుగ, ఆలుగుచేప, జెల్లెలు, పాపర్లు, గ్యాస్‌ కట్‌ రకాల చేపలు ఉండగా వీటి ధర సాధారణ రోజుల్లో కిలో రూ.120 ఉండగా మృగశిర రోజు రూ.200 నుంచి రూ.240 వరకు విక్రయిస్తారు.

ఆరోగ్యదాయకం ఇంగువ బెల్లం
శారీరక ఆరోగ్యం కోసం ఈ కార్తెలో శాఖాహారులు ఇంగువ, బెల్లం తింటారు. ఈ రెంటిని కలిపి చిన్నచిన్న ముద్దలు చేసి పరిగడుపున తింటారు. ఇంగువకు చలువ చేసే శక్తి, బెల్లానికి జీర్ణం చేసే శక్తి ఉంటుంది. విపరీతమైన ఎండలతో తల్లడిల్లిన జనానికి ఒక్కసారి ఋతువు మారడంతో శరీరంలో తలెత్తే రుగ్మతలు దీన్ని తినడంతో నశిస్తాయని పెద్దలు చెబుతుంటారు.

ఉచిత చేపమందు పంపిణీ
దండేపల్లి: మండల కేంద్రంలో మృగశిర కార్తెప్రవేశాన్ని పురస్కరించుకుని ఉబ్బసం వ్యాధి నివారణకు గ్రామానికి చెందిన రంగసాయి ప్రేమ్‌రాజ్‌–భూలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఉచిత చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మందు పంపిణీ కోసం నిర్వహణ కమిటీ శనివారం జీపీ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు. చేపమందు కోసం వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని చర్చించారు. వివరాలకు 9866885308, 9440707416, 9640376530, 9908401985 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

#

Tags : 1

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు