Breaking News

చిన్నారుల నోట్లో పుండ్లు?

Published on Sun, 01/19/2025 - 09:48

కొంతమంది పిల్లల్లో నోట్లో, నాలుక మీద, గొంతు లోపల తరచూ పుండ్లలా వస్తుంటాయి. చిన్నారుల్లో ఈ సమస్య కనిపించినప్పుడు నొప్పితో బాధపడటం, నోరూ, గొంతు ఇన్ఫెక్షన్‌ వచ్చినప్పటిలా ఎర్రబారడమూ జరుగుతుంది. ఏమీ తినలేక సన్నబడతారు. ఇలా వచ్చే పుండ్లను వైద్యపరిభాషలో ఆఫ్తస్‌ అల్సర్స్‌ అంటారు. 

కారణాలు: ఈ సమస్యకు చాలా కారణాలు ఉన్నాయి. ఉదా... 

  • నోట్లో గాయాలు కావడం (బ్రషింగ్‌ వల్ల, బాగా ఘాటైన పేస్టులు, కొన్ని అబ్రేసివ్‌ ఆహారపదార్థాల వల్ల గాయాలవుతుంటాయి) 

  • విటమిన్‌లు, పోషకాల లోపం... (ముఖ్యంగా విటమిన్‌ బి12, ఐరన్, ఫోలిక్‌ యాసిడ్, జింక్‌ ల వంటి పోషకాలు లోపించడం) 

  • అనేక కారణాలతో నీరసించిపోవడం (ఫెటీగ్‌) వైరల్‌ ఇన్ఫెక్షన్‌లు (ముఖ్యంగా హెర్పిస్‌ వంటివి) 

  • పేగుకు సంబంధించిన సమస్యలు, రక్తంలో మార్పులు, గ్లూటిన్‌ అనే పదార్థం సరిపడకపోవడం, తరచూ జ్వరాలు... వంటి అనేక శారీరక సమస్యలతోపాటు మానసికంగా ఉద్వేగ పరమైన ఒత్తిడి (ఎమోషనల్‌ స్ట్రెస్‌) వల్ల కూడా పిల్లల్లో ఈ తరహా పుండ్లు (మౌత్‌ అల్సర్స్‌) కనిపించవచ్చు.

చికిత్స / మేనేజ్‌మెంట్‌: నోట్లో పుండ్లు పడ్డ  పిల్లలకు బాధ తెలియకుండా ఉండేందుకు పైపూతగా వాడే మందులు, యాంటిసెప్టిక్‌ మౌత్‌ వాష్‌లు; పోషకాహార లోపం వల్ల సమస్య వస్తే వాళ్లలో విటమిన్‌ సప్లిమెంట్స్‌ వాడాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో చాలా అరుదుగా స్టెరాయిడ్‌ క్రీమ్స్‌ వాడటం వల్ల ప్రయోజనం  ఉంటుంది. ఇలా మౌత్‌ అల్సర్స్‌ కనిపించినప్పుడు పీడియాట్రీషియన్‌ లేదా డెంటల్‌ నిపుణులను సంప్రదించాలి. 

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు