Breaking News

ఒకేసారి బిడ్డలకు జన్మనిచ్చిన తల్లీకూతుళ్లు

Published on Mon, 03/16/2026 - 17:17

తల్లి కావడం అనేది ఎంత అపురూపమైన క్షణమో చెప్పాల్సిన పనిలేదు. ఆమె తల్లి అవ్వడంతోనే కుటుంబ సభ్యులకు అమ్మమ్మ, నానమ్మలుగా ప్రమోషన్లు వచ్చేస్తుంటాయి. అలాంటిది ఒకే ఇంట్లో తల్లి కూతుళ్లు ఇద్దరూ ఒకేసారి తల్లికావడం అంటే మాములు వింత కాదు కదా ఇది. అస్సలు ఇదెలా సాధ్యం అని అనుకోకండి. 

ఈ అద్భుతమైన ఘటన ఇటలీలోని నేపుల్స్‌లోని కారద్రాల్లి ఆస్పత్రిలో జరిగింది. అక్కడ ఆ తల్లి మారా బారోన్‌, కూతురు పాలోలకు ఈ అరుదైన సందర్భం ఎందురైంది. నిజానికి మారా బారోన్‌కి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడే కూతురు పాలా జన్మించింది. అయితే ఆ సమయంలో ఆమె గర్భస్రావం చేయించుకోవడానికి బదులుగా గర్భాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది. విచిత్రం ఏంటంటే మారా మళ్లీ తల్లి అయ్యిన అదే రోజున ప్రస్తుతం 21 ఏళ్ల వయసున్న తన కూతురు కూడా తల్లి అయ్యింది. 

వారిద్దరు ఒకరోజున బిడ్డలకు జన్మనిచ్చారు. మారా 3.8 కిలోల బరువున్న 'Futura' అనే పాపకు జన్మనివ్వగా, కూతురు పోలాకి 3.4 కిలోల బరువున్న 'Giovanni' అనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక తల్లి మారా జీవశాస్త్రవేత్త, ఆమెకు ఇది రెండో ప్రసవం. ఆస్పత్రి గైనకాలజీ విభాగం డైరెక్టర్‌ సైతం ఈ సంఘటనను ఒక అద్భుతం కంటే తక్కువ కాదని అభివర్ణించారు. 

తల్లీ కూతుళ్లిద్దరికీ సాధారణ ప్రసవాలే జరగాయని అన్నారు. ప్రస్తుతం ఇద్దరు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని చెప్పారు వైద్యులు. సాధారణంగా ఒక కొత్త బిడ్డ రాకతోనే కుటుంబం ఆనందంతో మునిగిపోతుంది. అలాంటిది ఇద్దరు నవజాత శిశువుల రాకతో ఆ కుటుంబానికి ఇది పండుగ వాతావరణంలా మారిపోయింది.

(చదవండి: గ్యాస్‌ కొరతకు..వంటగది వ్యర్థాలతో చెక్‌!)

 

Videos

ప్రజా దర్బార్ లో పేదలను అవమానించిన బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ

103 డాలర్లకు చమురు ధర

దొంగచాటుగా హర్ముజ్ జలసంధిని దాటుతున్న నౌకలు

కూటమి తీరుపై రాష్ట్రవ్యాప్తంగా వైస్సార్సీపీ భారీ నిరసన

సీపీ సతీమణి ఏకే 47 గన్ తో 10 రౌండ్ల కాల్పులు

శత్రుల రాడార్లను ముప్పు తిప్పలు పెట్టె ఇరాన్ మిస్సైల్

Sec-Bad: 800 కిలోల కుళ్లిన చికెన్

ఎమ్మెల్యేల కథ దేవుడెరుగు.. BR నాయుడు రాసలీలలపై జగన్ సెటైర్లు

ఇది కదా తండ్రి ప్రేమంటే కొడుకు పరీక్ష కోసం ఏం చేశాడంటే

లాగి చెంపకేసి ఒక్కటి పీకాల్సింది పోయి... ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసుపై జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

తమ్ముడి పిల్లల బర్త్‌డే వేడుకల్లో మహేశ్‌ బాబు (ఫోటోలు)

+5

ఆస్కార్‌ వేడుకలో మెరిసిన వారణాసి బ్యూటీ ప్రియాంక చోప్రా.. (ఫోటోలు)

+5

రష్మిక-విజయ్ దేవరకొండ హల్దీ వేడుక.. (ఫొటోలు)

+5

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఘనంగా నమన్‌ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)

+5

OSCARS 2026 : ఆస్కార్‌ విజేతల జాబితా (ఫోటోలు)

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)