Breaking News

గ్లోబల్‌ ఫేవరెట్‌.. మొరాకో

Published on Sat, 08/31/2024 - 08:12

న్యూయార్క్‌ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన మొరాకన్‌ రెస్టారెంట్‌ నగరంలోని జూబ్లీహిల్స్‌ వేదికగా ప్రారంభమైంది. అరుదైన వంటకాలతో వినూత్నమైన, పసందైన రుచులను అందించడం మొరాకన్‌ ప్రత్యేకత. భారతీయులకు ఈ మొరాకన్‌ రుచులను అందించడం కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాదులో రెస్టారెంట్‌ ప్రారంభించడం విశేషం. అయితే ఈ మొరాకన్‌ వ్యవస్థాపకులు, ప్రముఖ చెఫ్‌ అనీసా వహీద్‌ హైదరాబాదీ కావడం మరో విశేషం.  

లగ్జరీ వంటకాలుగా ఆదరణ పొందిన మొరాకో డిషెస్‌ సుగంధ ద్రవ్యాలతో పాటు భారతీయ వంటకాల్లో వినియోగించే కొన్ని ఫ్లెవర్స్‌ తో తయారు చేస్తారు. ఉత్తర ఆఫ్రికన్, మెడిటరేనియన్, అరబ్, పెర్షియన్‌ పాకశాస్త్ర మూలాల ప్రపంచ–ప్రసిద్ధ సమ్మేళనంతో సువాసనగల మొరాకో రుచులు భారత్‌ లోని మధ్యధరా/మధ్యప్రాచ్య ప్రాంతాల్లో విస్తరణకు పూనుకున్నారు. తారా కిచెన్‌ లోకి ప్రవేశించగానే ఎడారి–పర్వత–సముద్ర సెట్టింగులు దేశ వైభవాన్ని ప్రదర్శిస్తాయి. 

సహారా–ప్రేరేపిత డైనింగ్‌ రూమ్‌లో అతిథులకు వెండి టీ కుండల నుంచి అందించే మొరాకో పుదీనా టీతో స్వాగతం పలుకుతుంది. మొరాకో ప్రసిద్ధ బ్రైజ్డ్‌ డిష్, వినూత్నమైన మటన్‌–చికెన్, సీఫుడ్, ముఖ్యంగా టాగిన్‌ అని పిలువబడే కూరగాయలు.. వీటిని సంప్రదాయ శంఖు ఆకారపు కుండలో టేబుల్‌ పైన వడ్డించే విధానం అద్భుతం. ముఖ్యంగా సువాసనతో కూడిన మసాలా మిశ్రమాలు, గులాబీ సువాసనగల బక్లావా వంటి డెజర్ట్స్‌ నోరూరిస్తాయి. 

వెజిటబుల్, ఫ్రూట్‌ సలాడ్లు, డిప్లు వంటకాల అద్భుతమైన రుచులను అందిస్తుంది. ఆరోగ్య సంరక్షణ కోసం సమతుల్య పోషకాలతో వంటకాలను అందించడం ఈ రెస్టారెంట్‌ ప్రత్యేకత. అతి తక్కువ నూనెలు, పాల ఉత్పత్తులతో.. బాదం, దానిమ్మ మొలాసిస్‌తో ఫిగ్‌ సలాడ్, కాలి్చన వంకాయ, జాలోక్‌ కూరగాయల కౌస్కాస్,  ఆలివ్‌ ఫిష్‌ ట్యాగిన్‌ ఇలా వినూత్న వంటకాలు వాహ్‌ అనిపిస్తాయి. ఈ వంటలలో గ్లూటెన్‌ ఇతర అలెర్జీ కారకాలు ఉండవని చెఫ్‌ లు తెలిపారు.  

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)