Breaking News

Kabir Das గడ్డిపోచ కూడా...!

Published on Tue, 02/11/2025 - 11:18

కబీర్‌ దాస్‌ ఆధ్యాత్మిక కవి. సాధువు. మధ్యయుగ భక్తి ఉద్యమ కారుల్లో ఆయన ఒకరు. ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆయన... రామానంద బోధనలకు ప్రభావితమై ఆయన్ని గురువుగా స్వీకరించారు. కబీర్‌ అన్ని మతాల అర్థరహిత, అనైతిక పద్ధతులను ప్రధానంగా ప్రశ్నించారు. ఆయన మరణించినప్పుడు హిందువులు– ముస్లింలు ఇరువురూ ఆయనను తమవారంటే తమవారని చెప్పుకున్నారు.

కబీర్‌ సత్యాన్ని తెలుసుకోవడానికి, ‘అహాన్ని‘ వదిలివేయమని సూచించారు. ఆయన రాసిన దోహాలు నాటి సమాజాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. అటువంటి కబీర్‌ జీవితంలో జరిగిన సంఘటనగా చెప్పే ఉదంతం ఇది: ఒకానొకరోజు కబీర్‌ తన కొడుకుని ఆవులకు మేత కోసం గడ్డి కోసుకు రమ్మన్నారు. సరేనని వెళ్లిన కుమారుడు చాలాసేపటి వరకు తిరిగి రాలేదు. దీంతో కబీర్‌ కొడుకును వెతుక్కుంటూ వెళ్లారు. 

పచ్చిక బయళ్ల మధ్యలో నిల్చుని ఉన్న కొడుకు కనిపించాడు. చల్లటి గాలి వీస్తోంది. గడ్డి అటూ ఇటూ ఊగుతోంది. కబీర్‌ తన కొడుకు కూడా అది చూసి మైమరచిపోయి హుషారుగా ఊగుతూ ఉండడాన్ని చూశారు. దగ్గరకువెళ్లి ఎందుకు ఊగుతున్నావని అడిగారు. అప్పుడతను ‘నాన్నా! నేనిక్కడికి వచ్చేసరికి ఈ గడ్డంతా ఏకాంతంలో గాలికనుగుణంగా కదలాడుతోంది. ఆ దృశ్యం చూడటానికి ఎంతో బాగుంది. నాకు కూడా గడ్డితోపాటు అలా కదలాలనిపిస్తోంది. ఆహా! ఏమానందం? ఏమానందం?’ అన్నాడు. 

ఇదీ చదవండి : బిలియనీర్‌తో పెళ్లి అని చెప్పి, రూ.14 కోట్లకు ముంచేసింది : చివరికి!

అతని మాటలకు దిగ్భ్రాంతి చెందిన కబీర్, ‘నేను నిన్ను గడ్డి కోసుకురమ్మన్నాను కదా? మరచిపోయేవా?’ అన్నారు.  అందుకు ‘ఏమిటీ? పచ్చికను కోయాలా? నేనెప్పటికీ అలా చేయలేను. నాకీ పచ్చిక ఎనలేని ఆనందాన్నిచ్చింది. నేను పచ్చికతో సన్నిహిత సంబంధాన్నిపెంచుకున్నాను. ప్రస్తుతానికి నేను వేరే ప్రపంచంలో ఉన్నాను’ అన్నాడతను. ‘ఈ భగవంతుని సృష్టిలో ప్రతిదీ విలువైనదే... ఆనందమిచ్చేదే’ కదా అంటూ కబీర్‌ కుమారునితో కలిసి వెనుదిరిగారు.  (Safer Internet Day 2025 భద్రత... బాధ్యత... గౌరవం!)

– యామిజాల జగదీశ్‌ 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)