Breaking News

వర్షాకాలం: దోమల్ని తరిమి కొట్టే చిట్కాలు, ఈ మొక్కల్ని పెంచండి!

Published on Mon, 07/15/2024 - 16:44

వర్షాకాలం వచ్చిందంటే... మేమున్నామంటూ దోమలు  విజృంభిస్తాయి.  దీంతో సీజనల్‌గా వచ్చే అనేక వ్యాధుల్లో చాలావరకు వివిధ రకాల దోమల వల్లే వస్తాయి. అందుకే దోమలను  నివారించే  కొన్ని సహజమైన నివారణ పద్ధతుల గురించి  తెలుసుకుందాం.

వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఉండడం వల్ల దోమలు వృద్ధి చెందడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.  ఇంట్లో తడి, తేమ లేకుండా వాతావరణ వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. చిన్నపిల్లలు, వృద్ధులుంటే మరింత జాగ్రత్త అవసరం. 

దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుంది.  ఇంటిని, ఇంటి చుట్టుపక్కలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.  నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. టైర్లు, చిన్ని చిన్న ప్లాస్టిక్‌ డబ్బాలు, కుండలు లాంటివాటిల్లో కూడా నీరు ఉండిపోకూడా జాగ్రత్త పడాలి. వర్షాకాలంలో ముఖ్యంగా  సాయంత్రం సమయంలో ఇంటి తలుపులు, కిటికీలను మూసి ఉంచాలి.    దోమతెరలను  వాడాలి.

దోమలు తీపి వస్తువులు, శరీర దుర్వాసనకు ఆకర్షితులవుతాయని మనందరికీ తెలుసు, అయితే కొన్ని సుగంధ పరిమళాలు  వాటికి నచ్చవు. అలాంటి కొన్ని రకాలు వాసనలొచ్చే మొక్కల్ని  పెంచుకుంటే  చుట్టూ ఉన్న దోమలు, ఇతర కీటకాల బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. సాధారణంగా దోమల నివారణకు  రసాయన రహిత పద్ధతుల ద్వారా దోమలను నివారించే ప్రయత్నాలు చేయాలి.

పెరటి మొక్కలు
లెమన్ గ్రాస్: ఇంట్లో లెమన్ గ్రాస్ చెట్టు పెంచుకుంటే దోమలు రావు. లెమన్ గ్రాస్ కుండీల్లో పెంచుకోవచ్చు. దీన్ని ఇంటి బాల్కనీ లేదా మెయిర్ డోర్ దగ్గర ఏర్పాటు చేయాలి. లెమన్ గ్రాస్ వాసనకు దోమలు పారి పోతాయి.

నిమ్మ ఔషధతైలం ఈ మొక్కను హార్స్‌మింట్ అని కూడా అంటారు.  దీని సుగంధం దోమలను దూరం చేస్తుంది. ఇంకా తులసి మొక్కలు, బంతి పువ్వు మొక్కలు కూడా దోమల నివారణకు పనిచేస్తాయి. 

వేపాకుల్లో ఔషధ గుణాలు దోమల నివారణకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు నిప్పుల్లో వేపాకులు వేసి కాల్చాలి. దాని నుంచి వచ్చే పొగ ఇంట్లో వ్యాపించేలా చూసుకోవాలి. ఈ పొగ ప్రభావంతో దోమల బెడద క్రమంగా తగ్గుతుంది. వేపనూనె చర్మానికి రాసుకుంటే  ఫలితం ఉంటుంది. కర్పూరం సువాసన కారణంగా దోమలను అరికట్టడానికి ఉపయోగించవచ్చు.

వెల్లుల్లి ఉత్తమ సహజ దోమల వికర్షకాలలో ఒకటిగా చేస్తుంది. వెల్లుల్లి  ఘాటైన రుచి , వాసన దోమలను దూరంగా ఉంచుతుంది. వెల్లుల్లిని నీటిలో వేసి  మరిగించి, ఆ నీటికి  చుట్టూ పిచికారీ చేయండి.  

కొబ్బరినూనె, లవంగాలు: దోమలు కుట్టకుండా ఉండాలంటే కొబ్బరినూనె మిశ్రమాన్ని చర్మానికి రాసుకుంటే ఫలితం బాగుంటుంది. కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం, లవంగాలు వేసి గోరువెచ్చగా వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని బాటిల్లో నిల్వ చేసి రోజూ సాయంత్రం చర్మానికి రాసుకుంటే దోమలు కుట్టవు.

టీ ట్రీ ఆయిల్  ఈ వాసన దోమలకు అస్సలు పడదు. హోం డిప్యూజర్, కొవ్వొత్తులు, క్రీమ్, లోషన్ వంటి వాటిల్లో టీ ట్రీ ఆయిల్ కలుపుకోవచ్చు. అలాగే దోమ కుట్టిన చోట ఈ నూనె రాస్తే దురద తగ్గుతుంది.

మస్కిటోకాయిల్స్, రిపెలెంట్స్, ఇలా నేచురల్ ప్రొడక్ట్స్  వాడాలి. ఒడోమస్ వంటి ఉత్తమ నాణ్యతగల, హాని చేయని క్రీములు వాడవచ్చు. చిన్న పిల్లలు రాత్రి పూట కాళ్లను పూర్తిగా కవర్‌ చేసే దుస్తులు వేయాలి.
 

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)