Breaking News

మిస్‌ వరల్డ్‌ 2024 విజేత క్రిస్టినా పిస్కోవా ఎవరు?

Published on Sun, 03/10/2024 - 15:33

మిస్‌ వరల్డ్‌ 2024 అందాల పోటీల ఫైనల్స్‌ శనివారం ముంబైలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీల్లో చెక్‌రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవో విజేతగా నిలిచి కిరిటాన్ని దక్కించుకుంది. దాదాపు 115 దేశాల నుంచి పోటీదారులు పాల్గొన్నారు. వీరంతా తమ అందం, ప్రతిభతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకునేలా ప్రదర్శన ఇచ్చారు. ఇంతమంది అందగత్తెలను వెనక్కి నెట్టి ఫైనల్‌లో క్రిస్టినా పిస్కోవా కిరిటాన్ని కైవసం చేసుకుంది. పోలాండ్‌కు చెందిన మాజీ ప్రపంచ సుందరి కరోలినా బిలావ్స్క్‌  క్రిస్టినా పిస్కోవాకు తన కిరీటాన్ని అందించింది. ఇంతకీ ఎవరీమె అంటే..

క్రిస్టినా పిస్కోవాకి ఇంగ్లీష్‌, పోలిష్‌, స్లోవాక్‌, జర్మన్‌ తదితర భాషలపై మంచి పట్టు ఉంది. ఆమె ఎత్తు 180 సెం.మీ. చెక్‌ రిపబ్లిక్‌ నుంచి 2006 మిస్‌ వరల్డ్‌ పోటీలో గెలుపొందిన టటానా కుచరోవా తర్వాత క్రిస్టినా మళ్లీ ఈ కిరీటాన్ని దక్కించుకోవడం విశేషం. క్రిస్టినా యువత, పిల్లలు, పెద్దలు, వికలాంగులకు విద్య అందేలా ఒక ఫౌండేషన్‌ని నడుపుతోంది. అలాగే సంక్షేమ పనుల కోసం క్రిస్టినా పిస్జ్‌కోవా ఫౌంలడేషన్‌ను స్థాపించింది.

ఇవిగాక టాంజానియాలో ఒక ఆంగ్ల మాధ్యమ పాఠశాలను ఏర్పాటు యువత విద్యను కొనసాగించేలా చేసింది. నిరుపేద పిల్లలకు విద్య అందేలా చేయడం వంటి పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. పెద్ద మొత్తంలో దాతృత్వక కార్యక్రమాలు చేసింది. ఆమెకు కళలంటే మక్కువ. ఆ ఆసక్తితోనే ఆర్ట్‌ అకాడమీలో చేరి సంగీతం, వేణువు, వయోలిన్‌ వంటివి వాయించడం నేర్చుకుంది.

(చదవండి: మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పింక్‌ సీక్విన్‌ గౌనుతో మెరిసిన పూజా హెగ్డే!)

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)