Breaking News

Miss India USA 2023: కాబోయే డాక్టరమ్మకు అందాల కిరీటం

Published on Tue, 12/12/2023 - 00:14

‘అందమే ఆనందం’ అనుకోవడంతో పాటు ‘ఆనందమే అందం’ అనుకునే రిజుల్‌ మైని మిచిగాన్‌ (యూఎస్‌)లో మెడికల్‌ స్టూడెంట్‌. ఈ ఇండో– అమెరికన్‌ స్టూడెంట్‌ ‘మిస్‌ ఇండియా యూఎస్‌ఏ 2023’ కిరీటాన్ని గెలుచుకుంది...

‘మిస్‌ ఇండియా యూఎస్‌ఏ’ టైటిల్‌ గెలుచుకోవడానికి 25 రాష్ట్రాల నుంచి 57 మంది పోటీ పడ్డారు.
‘వినయంతో, ఒకింత గర్వంతో నేను మిస్‌ ఇండియా యూఎస్‌ఏ 2023 అని చెబుతున్నాను. నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేకపోతే ఈ విజయం సాధ్యం అయ్యేది కాదు. నా ప్రయాణంలో అడుగడుగునా స్నేహితులు అండగా నిలిచారు. విలువైన సూచనలు ఇచ్చారు’ అంటుంది రిజుల్‌ మైని.

ఇరవై నాలుగు సంవత్సరాల ఇండియన్‌–అమెరికన్‌ రిజుల్‌ మైని తనను తాను మెడికల్‌ స్టూడెంట్, మోడల్‌గా పరిచయం చేసుకుంటుంది. సర్జన్‌ కావాలనేది తన లక్ష్యం. స్కూలు రోజుల నుంచి చదువుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చేదో, కళలు, సాంస్కృతిక సంబంధిత కార్యక్రమాలకు అంతే ప్రాధాన్యత ఇచ్చేది రిజుల్‌.
మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్శిటీలో ‘హ్యుమన్‌ సైకాలజీ’లో బ్యాచిలర్‌ డిగ్రీ చేసిన రిజుల్‌కు ఖాళీ సమయం అంటూ ఉండదు. ఎప్పుడూ సందడి సందడిగా ఉంటుంది. ఆమె హాబీల జాబితాలో పెయింటింగ్, కుకింగ్, గోల్ఫింగ్‌... ఇలా ఎన్నో ఉన్నాయి.

స్వచ్ఛంద కార్యక్రమాలలోనూ ముందుంటుంది. వైద్యానికి సంబంధించిన సరికొత్త విషయాలు, పుస్తకాలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్‌ మీడియాలో ఇతరులతో పంచుకోవడం అంటే ఇష్టం.
‘కళ అనేది మనసులోని మాలిన్యాన్ని శుభ్రం చేస్తుంది’ అనే మాట రిజుల్‌ మైనికి ఇష్టం. అందుకేనేమో ఆమెకు కళలు అంటే అంత ఇష్టం. కళలు ఉన్నచోట వెలుగు ఉంటుంది. ఆ వెలుగే అందం. ఆనందం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)