Breaking News

వినూత్నంగా పెళ్లి రోజు వేడుక

Published on Sun, 06/07/2026 - 11:09

జగిత్యాలరూరల్‌:  పెళ్లి చేయాలంటే.. ఆకాశమంతా పందిరి.. భూదేవి అంతా పీట.. పురోహితులు.. బంధువులు.. బలగం తరలిరావాలంటారు. కానీ ఈ పెళ్లి వేడుకకు తోటి ఉపాధిహామీ కూలీలే పెళ్లి పెద్దలుగా మారారు. తట్ట.. పార పట్టిన వారే పురోహితులుగా అవతారం ఎత్తి పెళ్లి తంతు నిర్వహించారు. 

జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ వినూత్న పెళ్లి వేడుక సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. జగిత్యాల రూరల్‌ మండలం పొరండ్ల, బాలపల్లి గ్రామాలకు చెందిన 225 మంది శుక్రవారం ఉపాధిహామీ పనులకు హాజరయ్యారు. పనులు ముగిసిన తర్వాత పని స్థలంలో రెండు గ్రామాల కూలీలు ఒక్కచోట చేరారు. ఈ సమయంలోనే పొరండ్ల గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి–సత్తమ్మ దంపతుల 41వ పెళ్లి రోజు అని చర్చకు వచ్చింది. 

వెంటనే తోటి కూలీలు ఘనంగా వేడుకలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మామిడితోటనే పెళ్లి వేదికగా మార్చుకున్నారు. మామిడి ఆకులతో బాసింగాలు తయారు చేసి వారిద్దరికి కట్టి పెళ్లి జరిపించారు. నిజమైన వివాహ వేడుకలను మైమరిపించేలా తలంబ్రాలు, అరుంధతి నక్షత్ర దర్శనం, అప్పగింతలు నిర్వహించారు. అక్కడే ఉన్న వారందరికీ కూరగాయలు, మటన్, బగార అన్నం, మక్కగుడాలతో విందు ఏర్పాటు చేశారు. పెళ్లికి హాజరైన కూలీలందరూ కట్నకానుకలు సమర్పించారు. ఈ పెళ్లి తతంగం అంతా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.   

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)