Breaking News

క్రెడిట్‌ కార్డ్‌ వసూళ్లకూ ఓ పద్ధతుంది

Published on Wed, 08/28/2024 - 09:04

ప్రస్తుత కాలంలో వివిధ అవసరాల రీత్యా ఒకే వ్యక్తి సగటున నాలుగైదు క్రెడిట్‌ కార్డులు ఉండడం సర్వసాధారణం అయిపోయింది. ఒకటే జీతం మీద పరిమితి కలిగిన ఒక కార్డు వరకు అయితే ఇబ్బంది లేకుండా చెల్లించగలరు. కానీ అదే వ్యక్తికి నాలుగయిదు కార్డులు ఉంటే తన జీతానికి – స్థోమతకి మించి ఎన్నో రెట్లు పరిమితి కలిగిన కార్డులు ఉన్నట్టే! అయితే ఉద్యోగాలు పోవడం, వ్యాపారాలు దెబ్బ తినడం వలన క్రెడిట్‌ కార్డు వాడిన బకాయిలు తిరిగి చెల్లించలేని పరిస్థితులలోకి వెళ్లిపోతుంటారు చాలామంది. దాంతో ఆ బకాయిల వసూలు కోసం బ్యాంకులు చాలా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతుంటాయి.

మరీ ముఖ్యంగా ప్రైవేట్‌ రికవరీ ఏజెంట్లను నియమించి వారి ద్వారా వినియోగదారులను తీవ్రంగా వేధించడం, పీడించడం, ఇంటి చుట్టుపక్కల వాళ్ల దగ్గరికి వెళ్లి పరువు తీయడం వంటివి. ఈ మధ్య అయితే మొబైల్‌ ఫోన్‌ లో ఓ యాప్‌ ద్వారా వినియోగదారుల ఫోన్లను హ్యాక్‌ చేసి మరీ తెలిసిన వారందరికీ వీడియోలు ఫోటోలు మెసేజ్‌లు పంపడం వంటి చట్టవ్యతిరేక పనులకి పాల్పడుతున్నారు. అయితే బ్యాంకు వారికి అలా వేధించే హక్కు లేదు. ఎటువంటి లోను బకాయి అయినప్పటికీ నోటీసుల ద్వారా, కోర్టు కేసు ద్వారా మాత్రమే రికవరీ చేయాల్సి ఉంటుంది. అంతేకానీ పైన చెప్పిన విధమైన చట్ట వ్యతిరేక చర్యలు తీసుకోవడానికి వీలు లేదు. అలా చేసిన బ్యాంకు వారిపై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడమే కాకుండా సివిల్‌ కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. 

సివిల్‌ కోర్టులో ఇంజక్షన్‌ సూట్‌ వేయడం ద్వారా ఆ బ్యాంకు వారు వినియోగదారుని వేధించడానికి వీల్లేదు అని కోర్టు నుండి రక్షణ పోందవచ్చు . వివిధ బ్యాంకులు వినియోగదారులను వేధిస్తుంటే డైనమిక్‌ ఇంజక్షన్‌ ద్వారా కూడా సివిల్‌ కోర్టు నుండి రక్షణ పోందవచ్చు. క్రెడిట్‌ కార్డు వసూళ్లకు కానీ, మరి ఏ విధమైన లోన్‌ రికవరీ కోసం కానీ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకూడదు అని ఆర్‌.బి.ఐ నిబంధనలు సైతం సూచిస్తున్నాయి. ఎవరైనా బ్యాంకు వారు మిమ్మల్ని వేధింపులకు గురిచేస్తుంటే, వెంటనే పోలీసు వారిని ఆశ్రయించటం మంచిది. కొత్త చట్టం ద్వారా ఆన్‌లైన్‌లో కూడా ఎఫ్‌.ఐ.ఆర్‌. చేయవచ్చు. అయితే అలా చేసిన మూడు రోజులలోగా పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి ఆ ఫిర్యాదును ధ్రువీకరించవలసి ఉంటుంది. 


– శ్రీకాంత్‌ చింతల, హైకోర్ట్‌ అడ్వొకేట్‌  

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)