Breaking News

ఇషా అంబానీ డైమండ్‌ నెక్లెస్‌ రూ. 1,267 కోట్లా? నెయిల్‌ ఆర్ట్‌ స్పెషల్‌ ఏంటి?

Published on Fri, 05/09/2025 - 17:18

 

రిలయన్స్‌ సామ్రాజ్యానికి వారసురాలు, ఫ్యాషన్‌ ఐకాన్‌  బిడ్డ, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్‌ ఇషా అంబానీ న్యూయార్క్ లో జరిగిన ప్రతిష్టాత్మక మెట్ గాలా 2025లో  తళుక్కున మెరిసింది. ష్యాషన్‌, స్టైల్‌లో తన ప్రత్యేకతను చాటుకునే  ఇషా  మెగా ఈవెంట్‌లో తన ఫ్యాన్స్‌ను ఎక్కడా నిరాశపర్చలేదు. ఆమె ధరించిన దుస్తులు,  నగలు, చివరికి ఆమె నెయిల్‌ పాలిష్‌ కూడా  స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. మరీ ముఖ్యంగా  ఆమె ధరించిన డైమండ్‌ నెక్లెస్‌, దాని ధర విని నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. పదండి మరి ఆ  షాకింగ్‌ సంగతులేంటో తెలుసుకుందాం.

  డిజైనర్ అనామిక ఖన్నా  రూ పొందించిన  ఇషా డైమండ్‌   హారాన్ని చూసి  నెటిజన్లు ఆశ్చర్యపోయారు. దాని ధర ఎంత, దాని మూలాలేంటి అనేది ఇంటర్నెట్ లో ఆసక్తిని రేకెత్తించింది.

భారతదేశంలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా ధరించిన హారం ధర  రూ. 1,267 కోట్లు (150 మిలియన్ డార్లు) అని అంటున్నారు నెటిజన్లు.అంతేకాదు  2018  నాటి సెన్సేషన్‌ మూవీ ‘ఓషన్స్ 8’ లో  దీన్ని ప్రదర్శించారని  అంటున్నారు.  ఈ సినిమాలో దొంగతనం కోసం అన్నే హాత్వే పాత్ర ధరించిన ఈ హారం. ఇది ఒకప్పుడు నవానగర్ మహారాజుకు చెందినది.కార్టియర్ డైమండ్ నెక్లెస్‌ను ఒకప్పుడు నవానగర్ మహారాజు ధరించారంటూ వ్యాఖ్యానించారు.  

ఇషా అంబానీ ఏమన్నారు?
సోషల్ మీడియా వినియోగదారులు అది నిజంగా ఓషన్స్ 8 నెక్లెస్ అవునా కాదా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుండగా, ఇషా అంబానీ  "ఇది మా అమ్మది" అని  సింపుల్‌గా తేల్చి చెప్పేసింది. టిఫనీ ఉంగరాలు తప్ప, ఆ రాత్రి తాను ధరించిన దాదాపు ప్రతి నగ తన తల్లి నీతా అంబానీవేనని  తెలిపింది.  అయితే నవానగర్ మహారాజు ప్రేరణతో ఇషా అంబానీ తల్లి నీతా అంబానీ  ఖరీదైన నెక్లెస్‌ను  స్టేట్‌మెంట్ లేయర్డ్ పెర్ల్ , డైమండ్ నెక్లెస్‌తో మరింత స్టైల్ చేసింది. దీనిబరువు దాదాపు 136.25 క్యారెట్లు.

ఇషా తన దుస్తులను 'సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్' అనే థీమ్ ఆధారంగా స్టైల్ చేసింది. ఇక మేకప్‌, డిఫైన్డ్  ఐబ్రోస్‌, న్యూడ్-టోన్డ్ లిప్ స్టిక్ తో ఇషా తన లుక్ ని  అందంగా తీర్చిదిద్దింది.  దీంతోపాటు ప్రత్యేకమైన నెయిల్ ఆర్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.

బ్లాక్‌ ఫ్రెంచ్ నెయిల్ ఆర్ట్‌
ఫ్యాన్సీ నెయిల్ ఎక్స్ టెన్షన్ ని ఎంచుకోవడానికి బదులుగా, ఇషా ట్విస్ట్ తో కూడిన షీక్ ఫ్రెంచ్ నెయిల్ ఆర్ట్ ని ఎంచుకుంది. తన క్రిస్పీ లుక్‌కు బ్లాక్‌ ఫ్రెంచ్ నెయిల్ ఆర్ట్‌తో జతచేసింది.  ఆమె నెయిల్స్ ని సెలబ్రిటీ మానిక్యూరిస్ట్ జూలియా స్టైల్ చేసింది. అప్రెస్ నెయిల్ రాసిన జెల్ కూలర్ ని ఉపయోగించినట్లు జూలియా వెల్లడించింది. ఆమె రెండు షేడ్స్ ని ఎంచుకుంది: ఒకటి 'ఫర్గాటెన్ ఫిల్మ్' అనే న్యూడ్ షేర్డ్, , మరొకటి 'ఫ్రెంచ్ బ్లాక్'. ప్రతి నెయిల్ లక్కర్ ధర 14.99  అమెరికా డాలర్లు.  అంటే రూ. 1,252  రూపాయలు. రెండు షేడ్స్‌ కలిసి మొత్తం ఇషా అంబానీ నెయిల్ ఆర్ట్ ధర రూ. 2,504 లన్నమాట.
 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు