Breaking News

ఆస్కార్‌ అవార్డు వేడుకల్లో హైలెట్‌గా మెస్సీ డాగ్‌..! ఏం చేసిందంటే..

Published on Mon, 03/11/2024 - 17:29

బోర్డర్‌ కోలి బ్రీడ్‌కి చెందిన మెస్సీ అనే కుక్క నటించిన 'అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌' అనే సినిమా ఆస్కార్స్‌ 2024కి నామినేట్‌ అయ్యింది. అయితే ఆ మూవీకి అవార్డులు రాకపోయినా ఈ కుక్క మంచి ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా దాని హావభావాలతో అందర్నీ కట్టిపడేసింది. ఆ మూవీతో 2023లో మంచి స్టార్‌డమ్‌ తెచ్చుకున్న ఈ కుక్క ఈ ఏడాది ఆస్కార్‌ అవార్డుల్లో మాత్రం అందరి అటెన్షన్‌ తనవైపుకి తిప్పుకుని మరీ హైలెట్‌గా నిలిచింది.

ఈ వేడుకలకు ఆ మెస్సీ డాగ్‌ బో టై ధరించి హుందాగా వచ్చింది. ఈ కార్యక్రమంలో 'ఓపెన్‌ హైమర్‌' మూవీ పలు అవార్డులు దక్కించుకుంది. ఈ చిత్రంలో రాబర్డ్‌ డౌనీ జూనియర్‌ పాత్రలో అలరించిన ఐరన్‌ మ్యాన్‌ నటుడుకి ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు వచ్చింది. అయితే ఈ ఆస్కార్‌ వేడుకకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న జిమ్మీ కిమ్మెల్‌ ఆ అవార్డుని ప్రకటించగానే.. మెస్సీ తన ముందరి కాళ్లతో తప్పట్లుకొడతూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో హెస్ట్‌ జిమ్మీ ఆ కుక్క ఆటిట్యూడ్‌ని హైలెట్‌ చేస్తూ మెచ్చుకున్నాడు.

అంతేగాదు 2006లో వచ్చిన " ది షాగీ డాగ్‌" మూవీ గురించి ప్రస్తావిస్తూ దానికి సీక్వెల్‌గా సినిమా తీయాలనుకుంటే ఈ మెస్సీని పెట్టుకుంటే సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతుందని మెచ్చుకోలుగా అన్నాడు. ఇక ఈ మెస్సీ డాగ్‌ నటించిన 'అనాటమీ ఆఫ్ ఎ ఫాల్' మూవీలో బాగా గుర్తుండిపోయే సన్నివేశాన్ని గుర్తు చేస్తూ.. ఈ కుక్క ప్రేక్షకుల మనుసులో చెరగని ముద్ర వేయించుకుందని ప్రశంసించాడు. ఈ వేడుకల్లో మెస్సీ డాగ్‌ హైలైట్‌గా నిలిచి అందర్నీ అలరించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కెర్లు కొడుతోంది. 

(చదవండి: ఆస్కార్ 2024: రెడ్‌ కార్పెట్‌పై తడబడినా..భలే గమ్మత్తుగా కవర్‌ చేసిన నటి!)

#

Tags : 1

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)