Breaking News

Menopause: పాజ్‌ కాదు..కొత్త ఫేజ్‌...!

Published on Fri, 04/11/2025 - 00:46

మార్పును అంగీకరిస్తేనే మనోనిబ్బరం, శక్తి తెలుస్తాయి.. స్త్రీలకు మెనోపాజ్‌ అలాంటి మార్పే! దాన్ని అంగీకరిస్తూ జీవితాన్ని రీస్టార్ట్‌ చేసుకోవాలి! అలా అంగీకరించాలంటే ఆ దశ మీద ముందు అవగాహన రావాలి. అవగాహన రావాలంటే మౌనం వీడాలి! ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టడానికి ప్రముఖ గాయని సునీత ముందుకు వచ్చారు.

పాజ్‌ కాదు.. కొత్త ఫేజ్‌!
‘‘మెనోపాజ్‌ మనకు చాలా దూరం అనుకునేవాళ్లలో నేనూ ఒకదాన్ని. కానీ అది మన శరీరంలో ఓ వలయంలా తిరుగుతూ మెల్లగా మన జీవితాన్నే ఎఫెక్ట్‌ చేస్తుంది. ఒకరోజు హఠాత్తుగా మనలో చిత్రమైన ఒత్తిళ్లు మొదలవుతాయి. మూడ్‌ మారిపోవడం, అసహనం, చర్మం ముడతలు పడటం, నిద్రలేమి, ఒంటరితనపు వేదన.. ఇవన్నీ ఓ పెద్ద సవాలుగా మారుతాయి. అదే మెనోపాజ్‌. పైకి ఉచ్చరించలేని మౌనంగా భరించే మార్పు. అదొక భయంకరమైన ప్రయాణం. మన చేయిపట్టుకునే వాళ్లు లేక ఒంటరితనం ఆవహిస్తుంది. దిగులు తోడవుతుంది.

అదృష్టమే..  కాని అరుదు!
మెనోపాజ్‌ దశకు చేరేప్పటికి జీవితం నెమ్మదిస్తుంది. పిల్లలు సెటిలవుతారు. భర్తా బిజీ అయిపోతాడు. మన ఉద్యోగంలో పెద్దగా మార్పు కనపడదు. వీటన్నిటికి తోడు మెనోపాజ్‌  ఇబ్బందులు.. అంతా అయిపోయిందనే భావన. మనల్ని మనమే సహించలేని రోజులు, భర్తకు చెబితే అసహనంగా చూసే క్షణాలుంటాయి. పిల్లలతో షేర్‌ చేసుకోనివ్వని బిడియం. 

స్నేహితులతో మాట్లాడదామంటే వారు ఇంకా ఆ దశకు చేరనివారే! అమ్మ కూడా అర్థంచేసుకోలేదేమో అనిపిస్తుంటుంది.. ‘మా రోజుల్లో..’ అంటూ అసలు విషయాన్ని పట్టించుకోకుండా నాస్టాల్జియాలోకి వెళ్లే ఆమె మాటలను వింటుంటే! మెనోపాజ్‌ స్టేజీని అర్థం చేసుకుని అండగా నిలబడే వాళ్లుంటే అదృష్టమే! కాని అది అరుదు! అందుకే మనల్ని మనమే సముదాయించుకోవాలి.. మోటివేట్‌ చేసుకోవాలి.

 డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన మెడికేషన్‌ తీసుకోవాలి. మెనోపాజ్‌ను కొత్త ఫేజ్‌గా భావించాలి. అప్పటిదాకా నిర్వర్తించిన బాధ్యతల నుంచి వెసులుబాటు దొరికిందని ఆనందపడాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఆ స్వేచ్ఛను ఆస్వాదించాలి. మన శక్తిసామర్థ్యాలకు ఓ అవకాశం అనుకోవాలి. ఫిజికల్‌ ఫిట్‌నెస్, మెడిటేషన్, అభిరుచులు, ఆసక్తులతో జీవితాన్ని రీస్టార్ట్‌ చేయాలి. కొత్త విషయాలను నేర్చుకుంటూ జీవితం పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలి. 

వదిలేయకండి.. 
ఎంత సెల్ఫ్‌మోటివేషన్‌తో ఉన్నా కుటుంబం, ఫ్రెండ్స్‌ నుంచి ఆమెకు సపోర్ట్‌ అవసరమవుతుంది. ముఖ్యంగా ఇంట్లో వాళ్లు తనతో మాట్లాడాలి.. తను అనుభవిస్తున్న స్థితి గురించి అడగాలని కోరుకుంటుంది. తనను వినాలని ఆశపడుతుంది. అందుకే ఆమెతో మాట్లాడాలి.. ఆమెను వినాలి.. ఆత్మీయంగా హత్తుకోవాలి. ఇవన్నీ ఆమెకు దివ్యౌషధాలు. కుటుంబ సభ్యులు ఆమెను వినడం వల్ల వాళ్లకు మెనోపాజ్‌ దశ పట్ల అవగాహన పెరిగి.. వర్క్‌ప్లేస్‌లోని మహిళలను అర్థంచేసుకుని సహానుభూతి చూపించగలుగుతారు.

 దీనివల్ల ఆడవాళ్లలో బిడియం పోయి.. ధైర్యం వస్తుంది. తమ ఇబ్బందుల గురించి చెప్పగలుగుతారు. ఆ స్టేజ్‌ ఎలా ఉంటుందో అమ్మాయిలూ గ్రహించగలుగుతారు. అప్పుడు ఆటోమేటిగ్గా మెనోపాజ్‌ పట్ల ఉన్న సైలెన్స్‌ బ్రేక్‌ అయ్యి అవేర్‌నెస్‌ పెరుగుతుంది. అందుకే ఆ దశను అనుభవిస్తున్న ఆడవాళ్లను ఒంటరితనానికి  వదిలేయకండి. అప్పటిదాకా ఇంటిని.. ఇంట్లో మిమ్మల్ని కంటికి రెప్పలా కాచుకున్న ఆమెకు తోడుగా నిలబడండి. ఈ ప్రయాణం మనది అనే భరోసాని
వ్వండి!’’ అంటూ ముగించారు సునీత.
 

మెనోపాజ్‌ అనేది స్త్రీ జీవితంలో సహజమైన దశ. ఆ సమయంలో ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యల గురించి తరచూ మాట్లాడుతూ.. చర్చిస్తూ ఉంటేనే దానిపట్ల అవగాహన పెరుగుతుంది. మెనోపాజ్‌ను అనుభవిస్తున్న మహిళే కాదు కుటుంబ సభ్యులూ దాన్ని అంగీకరించాలి. ఆమె దైనందిన జీవితం సాఫీగా సాగడానికి తగిన సపోర్ట్‌ అందించాలి. మహిళలు కూడా తమ పట్ల వ్యక్తిగత శ్రద్ధను మరచిపోవద్దు. 
– జూహీ చావ్లా, నటి, పర్యావరణ ప్రేమికురాలు.

మెనోపాజ్‌ అనేది సహజమైన స్థితి. దాన్ని అంగీకరించి.. కొత్త అభిరుచులు, కొత్త అవకాశాలు, కొత్త పనులతో ఆ దశలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవాలి. ఈ ట్రాన్సిషన్‌తో సరికొత్త జీవితాన్ని ఆరంభించాలి తప్ప అంతా అయిపోయిందనే నిరాశకు లోనుకాకూడదు. 
– నటి నీనా గుప్తా ఆటోబయోగ్రఫీ ‘సచ్‌ కహూ తో’లోంచి!

– శిరీష చల్లపల్లి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)