Breaking News

Menopause Awareness: ఇల్లు అండగా ఉండాలి!

Published on Sat, 04/12/2025 - 09:57

ఏడాది వరకు నెలసరి రాకపోతే అప్పుడు దాన్నిమెనోపాజ్‌ గా పరిగణిస్తారు. సాధారణంగా 45 నుంచి 52 ఏళ్ల మధ్య మెనోపాజ్‌  వస్తుంది. తొలి లక్షణంగా నెలసరి క్రమం తప్పుతుంది. అంటే రెండు నెలలకు ఒకసారి లేదా నాలుగు నెలలకు ఒకసారి వస్తూంటుంది. తర్వాత ఒంట్లో వేడి ఆవిర్లు, నిద్రలేమి, గుండె దడ, అలజడి, ఆందోళన, మూడ్‌ స్వింగ్స్, ఏకాగ్రత లోపించడం, జీవనాసక్తి తగ్గడం, బరువు పెరగడం, ఒంటరితనం వంటివీ ఉంటాయి. మూడు, నాలుగేళ్ల వరకు కొనసాగే ఈ దశను ప్రీమెమెనోపాజల్‌ స్టేజ్‌ అంటారు. అయితే ఆ ఫేజ్‌లో ఉన్న అందరికీ ఆ లక్షణాలు ఉండకపోవచ్చు. కొందరు ఏ లక్షణమూ లేక సాఫీగా ఆ దశను దాటేయవచ్చు. లక్షణాలు ఉంటే జీవనశైలిలో మార్పులు, యోగా, ఎక్సర్‌సైజ్‌తో మేనేజ్‌ చేయవచ్చు. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. ముఖ్యమైన విషయం.. మెనోపాజ్‌ అని నిర్ధారణ అయ్యాక స్పాటింగ్‌ కానీ, బ్లీడింగ్‌ కానీ కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే గైనకాలజిస్ట్‌ను కలవాలి.  

మెనోపాజ్‌ తర్వాత.. 
స్త్రీ మేనికి మెరుపు, నిగారింపునిచ్చేవి ఫిమేల్‌ హార్మోన్సే. మెనోపాజ్‌ తర్వాత వాటి ఉత్పత్తి లేక గ్లో కూడా తగ్గిపోతుంది. చర్మం సాగి, ముడతలు పడుతుంటుంది. వెజైనా పొడిబారి పోతుంది. లైంగికాసక్తి తగ్గిపోతుంది. బ్లోటింగ్‌ ఉంటుంది. ఎముకల సాంద్రత తగ్గుతుంది. గుండె సంబంధిత సమస్యలూ మొదలయ్యే చాన్స్‌ ఉంటుంది. అయితే వీటన్నిటికీ భయ పడాల్సిన పనిలేదు. క్రమం తప్పకుండా వాకింగ్, వ్యాయామం చేయాలి. డాక్టర్‌ సూచనల మేరకు కాల్షియం సప్లిమెంట్స్‌ తీసుకోవాలి. వెజైనల్‌ డ్రైనెస్‌ సమస్య కోసం ప్లాంట్‌ బేస్డ్‌ ఈస్ట్రోజన్‌ మెడిసిన్స్‌ తీసుకోవచ్చు లేదా జెల్లీని ఉపయోగించొచ్చు. ఆహారంలోనూ జాగ్రత్తలు పాటించాలి. మసాలా, వేపుళ్లకు దూరంగా ఉండాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారపదార్థాలను తీసుకుంటే మంచిది. హెల్త్‌ చెకప్స్‌ మరచిపోవద్దు. 

మామోగ్రఫీ, పాప్‌స్మియర్‌ పరీక్షలు తప్పనిసరి. ఇంకో విషయం.. సర్వైకల్‌ క్యాన్సర్‌ నివారణకు వ్యాక్సిన్‌ వచ్చింది. కాబట్టి.. పెద్దమనిషి అయిన అమ్మాయిల నుంచి 45 ఏళ్ల మహిళల వరకు ఈ వాక్సిన్‌ను తీసుకోవచ్చు. లైంగిక జీవితం మొదలుకాకముందే ఈ వాక్సిన్‌ తీసుకుంటే  మంచిది. 

మెనోపాజ్‌ మూడు రకాలుగా వస్తుంది. ఒకటి.. సహజంగా వయసుతో వచ్చేది. రెండు.. వయసుతో సంబంధం లేకుండా జీవనశైలిలో మార్పులు, పొల్యుషన్, పెస్టిసైడ్స్‌ ఫుడ్‌ లాంటి వాటితో 40 ఏళ్లలోపే వచ్చే అర్లీ మెనోపాజ్‌. మూడవది.. శస్త్రచికిత్స ద్వారా గర్భసంచి, అండాశయాలను తొలగించడం వల్ల, క్యాన్సర్‌కు వాడే కొన్నిరకాల మందులు, రేడియేషన్‌ వల్ల కృత్రిమంగా వచ్చే మెనోపాజ్‌  

మెనోపాజ్‌  లక్షణాల్లో ఒకటైన హాట్‌ ఫ్లషస్‌ను యూరప్, ఉత్తర అమెరికా దేశాలలో 60–90 శాతం మంది స్త్రీలు ఎదుర్కొంటున్నారని, వారితో పోలిస్తే ఆసియా ఖండంలో 10–20 శాతం మంది మహిళలు మాత్రమే ఈ సమస్యతో సతమతమవుతున్నారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అందుకు ఆసియా ఖండంలోని ఆహారపు అలవాట్లు అంటే వారు తీసుకునే ఆహారంలోని ప్లాంట్‌ బేస్డ్‌ ఈస్ట్రోజన్స్‌ కారణం కావచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఆ దేశాల్లో మెనోపాజ్‌ సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నవారు కౌన్సెలింగ్, జీవనశైలిలో మార్పులతో ఆ దశను సమర్థంగా ఎదుర్కొంటున్నారట. ధూమపానం, ΄ పొగాకు, ఊబకాయం, స్పైసీ ఫుడ్,  పొగలుగక్కే ఆహారం తినడం, కాఫీ, టీలు ఎక్కువగా తాగడం, మద్యం, థైరాయిడ్‌ గ్రంథి లోపాలు, డయాబెటిస్, మానసిక ఒత్తిడి వంటివన్నీ హాట్‌ఫ్లషస్‌కి ప్రేరకాలు (ట్రిగర్‌) గా పనిచేస్తాయి. అయితే జీవన శైలిలో మార్పులు, వైద్య సలహా సూచనలతో ఆ సమస్యను అధిగమించవచ్చు. అంతేకాదు నువ్వులు, గడ్డి నువ్వులు, అవిసె గింజలు, సోయా బీన్స్, ముల్లంగి, నట్స్, క్యాబేజీ, కాలిఫ్లవర్‌ వంటి వాటితోనూ మెనోపాజ్‌ సమస్యలను తగ్గించుకోవచ్చు.

మెనోపాజ్‌ అనేది సవాళ్లతో కూడిన మార్పు!
‘శాస్త్రీయ అవగాహన ఉంటే సమర్థవంతంగా ఆ సవాళ్లను ఎదుర్కోవచ్చు.. ఆ మార్పును ఆస్వాదించొచ్చు’ అని చెబుతున్నారు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్‌లు డాక్టర్‌ కామేశ్వరి, డాక్టర్‌ ఆలియా రెడ్డి!

శిల్పా శెట్టి మొదలు ట్వింకిల్‌ ఖన్నా, శ్వేతా బచ్చన్‌ (జయ బాధురి, అమితాబ్‌ బచ్చన్‌ల కూతురు), టెలివిజన్‌ హోస్ట్‌ మినీ మాథూర్‌ లాంటి వాళ్లందరూ హాట్‌ ఫ్లషస్, మూడ్‌ స్వింగ్స్, బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొన్నవారే. ఆ లక్షణాల గురించి అవగాహనలేక చాలా ఇబ్బందులు పడ్డారట. వాళ్ల మూడ్‌ స్వింగ్స్‌ని చూసి కుటుంబ సభ్యులు నివ్వెర΄ోయేవారని, తామెందుకలా ప్రవర్తిస్తున్నామో అర్థంకాక .. ఆ పరిస్థితిని ఎలా మేనేజ్‌ చేయాలో తెలియక ఆందోళన చెందారని చెప్పారు. ఆ బాలీవుడ్‌ సెలెబ్స్‌ అందరూ ఇప్పుడు మెనోపాజ్‌ అవేర్‌నెస్‌ ప్రచారకర్తలుగా మారారు. మెనోపాజ్‌ దశ, లక్షణాల మీద విస్తృతంగా చర్చిస్తూ మహిళల్లో అవగాహన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

శాస్త్రీయ అవగాహన పెంచుకుంటూ.. 
ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక్కటే.. మెనోపాజ్‌  అన్నది స్త్రీ జీవితంలో ఒక సహజమైన ప్రక్రియ. దాన్నో జబ్బుగా పరిగణించకుండా శాస్త్రీయ అవగాహనను పెంచుకుంటూ కుటుంబం ఆమెకు అండగా నిలబడాలి. జీవిత భాగస్వామి ఆమెకు ఓ ఫ్రెండ్‌గా మారాలి. పిల్లలు అమ్మ మానసిక పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఆమెకు అనుకూలంగా మెలగాలి. ఇలాంటి వాతావరణం ఉంటే.. అది ఆమెకు హార్మోన్స్‌ కన్నా ప్రభావంతంగా పనిచేస్తుంది. మెనోపాజ్‌  మీద సమాజంలోనూ అవగాహన పెరగాలంటే ఆరోగ్యశిబిరాల్లో దాని మీద చర్చించాలి. మీడియా కథనాల ద్వారా ప్రచారం జరగాలి. అంతేకాదు మహిళ ఆరోగ్యాన్ని పాఠ్యాంశాల్లోనూ భాగం చేయాలి.  
– శిరీష చల్లపల్లి 

ఉమనోపాజ్‌ అర్థం చేసుకుందాం: నిర్వహణ సరస్వతి రమ

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)