Breaking News

Bella J Dark వావ్‌.. ఐదేళ్లకే పుస్తకం రాసేసింది!

Published on Sat, 04/19/2025 - 14:55

ఐదేళ్ల వయసుండే పిల్లలు ఆటపాటల్లో గడుపుతారు. స్కూల్‌కి వెళ్లనని మారాం చేస్తారు. కానీ బెల్లా మాత్రం అవేవీ చేయలేదు. పుస్తకం రాసి ప్రచురించింది. ఇప్పుడు దానికి కొనసాగింపు గా మరో పుస్తకం రాయబోతోంది. అందరూ తన ప్రతిభను చూసి ఆశ్చర్యపోతున్నారు. 

బెల్లా.జె.డార్క్‌ అనే పాప యూకేలోని వేమౌత్‌  ప్రాంతంలో పుట్టింది. చిన్ననాటి నుంచే అమ్మ చెప్పే కథలు వింటూ పెరిగింది. చిన్నారుల కోసం ప్రచురించే పుస్తకాలు చదివి, వాటి మీద ఆసక్తి పెంచుకున్న తను సొంతంగా కథలు రాయాలని ఐదేళ్ల వయసులో నిశ్చయించుకుంది. కానీ ఏ అంశం మీద రాయాలా అని ఆలోచిస్తూ ఉంది. ఆ సమయం లో తను గీసిన ఓ పిల్లి బొమ్మను చూసి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని అక్షరరూపంలో పెట్టేసింది. ఆ కథే The Last Cat (ది లాస్ట్‌ క్యాట్‌).

ఐదు రోజులపాటు ఆ కథ రాసిన బెల్లా దానికి తనే సొంతంగా బొమ్మలు కూడా వేసింది. అర్ధరాత్రి పూట ఇంటి నుంచి బయటకు వెళ్లిన పిల్లి ఎలాంటి ఇబ్బందులు పడింది, తిరిగి ఎలా తన ఇంటికి చేరిందనేది ఇందులోని కథ. ఈ కథే ఎందుకు రాశావని బెల్లాని అడిగితే, ‘పిల్లలు అలా ఎవరికీ చెప్పకుండా ఎక్కడికీ వెళ్లకూడదు. ముఖ్యంగా రాత్రిపూట అస్సలే వెళ్లకూడదు. ఆ విషయం అందరికీ చె΄్పాలనే ఈ కథ రాశాను’ అంటోంది. 2022 జనవరి 31న ఈ కథ పుస్తకంగా ప్రచురితమయ్యేనాటికి బెల్లాకు ఐదేళ్ల 211 రోజులు. ఈ విషయాన్ని గుర్తించిన గిన్నిస్‌ ప్రతినిధులు ‘అతి చిన్న వయసు రచయిత్రి’ అంటూ రికార్డు అందజేశారు. 

‘ది లాస్ట్‌ క్యాట్‌’ పుస్తకం ఇప్పటికి వేల కాపీలు అమ్ముడు΄ోయింది. ఈ పుస్తకం చదివి అనేకమంది బెల్లాకు మెయిల్స్‌ చేస్తున్నారు. తను రాసిన కథను మెచ్చుకుంటున్నారు. ఆ సంతోషంతో ఆ కథకు కొనసాగింపుగా మరో కథ రాసేందుకు సిద్ధమవుతోంది. ఖాళీ సమయాల్లో ఈత కొట్టడం, ఆడుకోవడం తనకు ఇష్టమని అంటోంది బెల్లా.

ఉల్ఫ్‌ కింగ్‌ సూపర్‌ యానిమేటెడ్‌ సిరీస్‌ 
హాయ్‌ కిడ్స్‌... ఈ హాలిడేస్‌లో మూవీస్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారా... అయితే ఎప్పుడూ మూవీసేనా ఒక్కోసారి సిరీస్‌లు కూడా చూడాలి. అందుకే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతున్న ఓ సూపర్‌ యానిమేటెడ్‌ సిరీస్‌ మీ ముందుకు తీసుకువచ్చాం. దాని పేరే ‘ఉల్ఫ్‌ కింగ్‌’. ఇదో సూపర్‌ యాక్షన్‌ స్టోరీ. డ్రూ ఫెర్రాన్‌ అనే కుర్రాడి కథ. ఉల్ఫ్‌ జాతికి చెందిన డ్రూ ఫెర్రాన్‌  ఆ ఫ్యామిలీలో ఆఖరివాడు. అతనికి ఉల్ఫ్‌ నుండి వచ్చే సూపర్‌ ఫాంటసీ పవర్స్‌ ఉంటాయి. కాని ఈ విషయం తనకు తెలియదు. డ్రూ ఫెర్రాన్‌  రాజ్యాన్ని సింహరాజులు అటాక్‌ చేసినపుడు, వాళ్ళతో ఫైట్‌ చేసేటపుడు తనలోని ఉల్ఫ్‌ పవర్‌ తెలుస్తుంది. ఆ పవర్స్‌తో డ్రూ  ఫెర్రాన్‌ ఎలా ఫైట్‌ చేసి తన రాజ్యాన్ని తిరిగి సం΄ాదించుకున్నాడనేది మాత్రం నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతున్న యానిమేటెడ్‌ సిరీస్‌ అయిన ఉల్ఫ్‌ కింగ్‌ చూసేయండి. ఈ సిరీస్‌ మొత్తం 8 ఎపిసోడ్స్‌ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్‌ సూపర్బ్‌గా ఉంటుంది. అంతేకాదు ఓ రాజ్యంలో రాజులకు సంబంధించిన సీక్రెట్స్, ఫైట్స్‌ అలాగే ఛేజింగ్స్‌తో ఈ సిరీస్‌ మొత్తం ఓ అద్భుతమైన రోలర్‌ కోస్టర్‌ రైడ్‌. ఇంకెందుకాలస్యం... గ్రాబ్‌ ది రిమోట్‌ టు క్రూస్‌ ఫర్‌ ది అడ్వెంచరస్‌ జర్నీ ఆఫ్‌ ఉల్ఫ్‌ కింగ్‌. 

– హరికృష్ణ ఇంటూరు  

 

#

Tags : 1

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)