Breaking News

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు.. ఇంకా తెల్లవెంట్రుక కూడా రాలేదట

Published on Mon, 07/03/2023 - 12:09

ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు. ఈమె పేరు అమంతినా దోస్‌ శాంటోస్‌ డువిర్జెమ్‌. ప్రస్తుతం ఈమె వయసు 123 ఏళ్లు. ఈమె 1900 జూన్‌ 22న జన్మించింది. ఇటీవలే తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకొంది. ప్రస్తుతం ప్రపంచంలో జీవించి ఉన్న అత్యంత వృద్ధురాలు ఈమేనని బ్రెజిల్‌ అధికారులు కూడా ధ్రువీకరించారు.

బ్రెజిల్‌లోని పరానా రాష్ట్రానికి చెందిన సెర్రాగాయాస్‌ పట్టణంలో ఈమె ఒంటరిగా తన కోసమే ప్రత్యేకంగా నిర్మించిన ఇంట్లో నివాసం ఉంటోంది. పెండలం దుంపల పిండితో తయారు చేసిన కేకు, ఉడికించిన గుడ్లు ఈమెకు ఇష్టమైన ఆహారం. శతాధిక వృద్ధురాలైనా ఇప్పటికీ ఈమెకు డయాబెటిస్, హై బీపీ వంటి ఆరోగ్య సమస్యలేవీ లేవు. ఇప్పటివరకు మందులు వాడాల్సిన అవసరం తనకు రాలేదని, కనీసం తలనొప్పి కూడా ఎరుగనని చెబుతోందీమె.

ఇంత వయసు వచ్చినా ఇప్పటికీ ఈమె తల నెరవకపోవడం మరో విశేషం. ఈమె నివాసం ఉంటున్న ప్రాంతానికి చెందిన స్థానిక అధికారులు వారం రోజుల ముందుగానే ఈమె పుట్టినరోజు పార్టీని ఘనంగా నిర్వహించారు. తొలిసారిగా పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు అధికారులు ఈమెకు జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీచేశారు. అందువల్ల గిన్నిస్‌బుక్‌ ఈమెను గుర్తించలేదు.

గిన్నిస్‌బుక్‌ రికార్డుల ప్రకారం ప్రస్తుతం అత్యంత వృద్ధమహిళ వయసు ఈ ఏడాది మార్చి 4 నాటికి 116 ఏళ్లు. అమెరికాలో స్థిరపడిన ఆ స్పానిష్‌ మహిళ పేరు బ్రాన్యాస్‌ మోరేరా. అయితే, గిన్నిస్‌ అధికారులు గుర్తించినా, లేకున్నా అమంతినానే ప్రపంచంలోని అత్యంత వృద్ధ మహిళ అని బ్రెజిల్‌ అధికారులు చెబుతున్నారు.

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)