Breaking News

Menstruation మౌనాన్ని బద్దలుకొట్టింది, ప్రతిష్టాత్మక అవార్డు పట్టింది

Published on Wed, 06/04/2025 - 15:44

గుర్గావ్‌కు చెందిన ప్రియాంషి బగ్గా చిన్న వయసులోనే చాలా పెద్దమనసుతో ఆలోచించింది. ఎవ్వరూ చేయని సాహసానికి పూనుకుంది. మాట్లాడానికి అందరూ ఇబ్బందిపడే  పీరియడ్స్‌ గురించి  17 ఏళ్ల వయసులో  ధైర్యంగా మాట్లాడింది. అంతేకాదు  దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సదుపాయం, రుతుక్రమ పరిశుభ్రత ను మార్చే లక్ష్యంతో బ్రేక్ ది సైలెన్స్ (మౌనం వీడండి..చుప్పీ తోడో, ) అనే కార్యక్రమాన్ని స్థాపించింది.ఈ ప్రాజెక్ట్ ద్వారా, ఆమె  వేలాదిమంది బాలికలకు అవసరమైన శానిటరీ ప్యాడ్‌లను అందించింది. అలాగే  శానిటరీ  ప్యాడ్స్‌ అవసరమైన బాలికలకు అందేలా పాఠశాలల్లో ప్యాడ్ వెండింగ్ మెషీన్‌లను కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ ఉద్యమం కోసం రూ. 5 లక్షలకు పైగా సేకరించింది, పాఠశాలల్లో సరైన మౌలిక సదుపాయాలతో బాలికలకు సాధికారత కల్పించడం దీని లక్ష్యం,  అమ్మాయిల డ్రాప్-అవుట్ రేటును కూడా  తగ్గిస్తుంది


2024లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఋతు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ఆచరించేలా ప్రోత్సహిస్తోంది.  పీరియడ్‌ సమస్య కారణంగా ఆడపిల్లలు చదువును ఆపకుండా, అంతరాయం లేకుండా క్లాసులకు హాజరయ్యేలా, వారి కలలను కొనసాగించడానికి సాధికారత కల్పిస్తోంది. వారి విద్య, ఆరోగ్యం, సాధికారతను ప్రోత్సహిస్తోంది. యువత తలచుకుంటే  సామాజిక ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో అనేదానికి ఉదాహరణగా నిలుస్తోంది ప్రియాంషి.

ఇదీ చదవండి: Plastic Water bottles : అవసరమా.. ఆకర్షణీయమా!

చుప్పీ తోడో ఐడియా ఎలా వచ్చింది
ప్రియాంషికి చిన్నప్పటినుంచీ చదువు అంటే ప్రాణం.  అదృష్టవశాత్తూ బాల్యంనుంచి చదువు విషయంలో తనకుఎలాంటి ఆటంకం రాలేదు.  కానీ ఆమె   గ్రామీణ పాఠశాలల్లో స్వచ్ఛందంగా పనిచేసినప్పుడు, ప్రాథమిక పరిశుభ్రత సౌకర్యాలు లేకపోవడం వల్ల బాలికలు ఉన్నత తరగతుల్లో చదువు మానేస్తున్నారని గమనించింది.. ఋతుస్రావం వంటి సహజమైన శారీరక ప్రక్రియ వారి విద్యకు అడ్డుగా నిలబడటం చాలా అన్యాయమని భావించింది. "విద్య అనేది అవకాశానికి ద్వారం"  అని  విశ్వసించే  ప్రియాంషి  దీన్ని అడ్డుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇది గోప్యంగా ఉంచాల్సిన విషయం కాదని, మౌనం వీడి గొంతెత్తాల్సిన  సమస్యని అని తెలుసుకుంది.  అంతే.  .బ్రేక్ ది సైలెన్స్ తో ముందుకు వచ్చింది. గృహ హింస, యాసిడ్ దాడులు, ఇతర సామాజిక దురాచారాల లాగ్గానే దీనికి గురించికూడా పాడ్‌కాస్ట్‌లోఎ  విస్తృతంగా చర్చించడం మొదలు పెట్టింది. దీనికి మంచి ఆదరణ లభించింది.  ఆమె వినిపించే కథలు పలువుర్ని కదిలించేవి. కంట తడిపెట్టించేవి.

చదవండి: Obesity పోషకలోపం.. ఊబకాయం!

ఈ ప్రాజెక్ట్ క్రమం తప్పకుండా ఋతు పరిశుభ్రత వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తుంది .శానిటరీ ఉత్పత్తుల ద్వారా మహిళల ఆర్థిక స్వాతంత్యానికి మద్దతు ఇవ్వడానికి స్వయం సహాయక బృందాలను ప్రోత్సహిస్తుంది.  ఆ బృందాలు మహిళలు తమ కమ్యూనిటీలలో ఈ ఉత్పత్తులకు నిధులు సమకూర్చడానికి , పంపిణీకి వీలు  కల్పించింది. "శానిటరీ ప్యాడ్ వాడకాన్ని మరింత పర్యావరణ అనుకూలంగా , సరసమైనదిగా చేయడమే తమ లక్ష్యమని ఆమె తెలిపింది.  ప్రియాంషి  కృషిని గుర్తించింది ఐక్యరాజ్యసమితి, ఈ ప్రాజెక్ట్ గర్ల్‌అప్ ప్రాజెక్ట్ అవార్డుతో సత్కరించింది. అశోక విశ్వవిద్యాలయం సహ-హోస్ట్ చేసిన టాకో బెల్ యాంబిషన్ యాక్సిలరేటర్‌కు ఫైనలిస్ట్‌గా నిలవడం విశేషం. 
 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు