బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...
Breaking News
ఫీజు అడగని వైద్యుడు గురించి తెలుసా?
Published on Sat, 06/28/2025 - 18:26
తెలుగునేలపై జన్మించి స్వాతంత్య్ర సంగ్రామంలో పాలుపంచుకున్నవారు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరు చెలికాని వెంకట రామారావు (Chelikani Venkata Rama Rao)మానవత, నిజాయతీ, వినమ్రత, నిబద్ధత వంటి విశిష్ట లక్షణాలతో ఆయన అన్ని తరాలకూ స్ఫూర్తిగా నిలిచారు. రామారావు జులై 15, 1901లో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం సమీపంలోని కొందెవరంలో జన్మించారు.
తూర్పుగోదావరి జిల్లా మొదటి నుంచీ సంఘసంస్కరణోద్యమాలు, విప్లవోద్యమాలకు నెలవు. దీంతో చిన్ననాటి నుంచే ఆ వాతావరణంలో పెరిగారు రామారావు పాఠశాల జీవితంలోనే స్వదేశీ ఉద్యమం వైపు మొగ్గు చూపారు. దేశం పరాయిపాలనలో మగ్గిపోతుంటే తాను చదువుకోవడం ద్రోహమని భావించి చదువుకు స్వస్తి పలికారు. జాతీయ ఉద్యమంలో చేరి 1922లో మొదటిసారి జైలు శిక్ష అనుభవించారు. ఉప్పు సత్యాగ్రహంలోపాల్గొన్నారు. కందుకూరి వీరేశలింగం పంతులు ఆయనను ఎంతగానో ప్రభావితం చేశారు. కందుకూరి దగ్గర పెరిగిన డాక్టర్ కమలమ్మను 1934లో కులాంతర వివాహం చేసుకున్నారు. అనంతరం వైద్యుడిగా ప్రాక్టీసలు ప్రారంభించి పేదలకు సేవలందించారు. వారి నుంచి డబ్బులు తీసుకోకుండా, ఖర్చుల కోసం వారికే కొంత డబ్బు ఇచ్చి పంపేవారు. 1952లో కమ్యూనిస్టు పార్టీ సభ్యునిగా కాకినాడ పార్లమెంటు సభ్యునిగా పోటీ చేశారు. అనారోగ్యం కారణంగా ప్రచారంలో పాల్గొనకపోయినా జనం ఆయన్నే గెలిపించి తొలి లోక్సభకు పంపించారు. 84 సంవత్సరాలు జీవించిన రామారావు సెప్టెంబరు 25, 1985న మరణించారు.
ఇదీ చదవండి: Today Tip : షుగర్ పేషెంట్లు ఎగ్స్ తినవచ్చా? ఎన్ని తినవచ్చు?
Tags : 1