Breaking News

ఔషధ మొక్క.. ఆరోగ్యానికి రక్ష

Published on Tue, 06/24/2025 - 18:58

మనతోపాటు, మనకన్నా ముందే పుట్టిన అనేక రకాల ఔషధ మొక్కలు మానవ మనుగడలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రకృతి మనకు అందించిన మొక్కలను నిత్యం చూస్తున్నా.. వాటి ప్రయోజనాలు, విలువలను తెలుసుకోలేకపోతున్నాం. ఇంట్లో, పెరట్లో, మిద్దెలపై పెంచుతున్న పూలమొక్కలతోపాటు పలు రకాల ఔషధ మొక్కలను సైతం పెంచితే ఇంటికి అందంతోపాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుందని సూచిస్తున్నారు ఔషధ మొక్కల ప్రేమికులు.

అందాన్ని పెంచే అలోవేరా (కలబంద), తిప్పతీగ, నిమ్మగడ్డి, అశ్వగంధ, తులసి, పుదీనా, ఉసిరి, వేప, పసుపు, బ్రహ్మి, మెంతులు.. ఇలా మానవాళికి దోహదపడే ఔషధ మొక్కలు అనేకం ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా సెంటనరీ కాలనీలో సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఆధ్వర్యంలో ఔషధ మొక్కల కేంద్రం ఏర్పాటు చేశారు. ఇందులో అనేక రకాల ఔషధ మొక్కలను సంరక్షిస్తున్నారు. అంతేకాదు.. వాటి ఉపయోగాలను తెలియజేసేలా ప్రచారం కూడా చేస్తున్నారు. 
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి

ఆకులు మందంగా, తెల్లగా ఉన్న ఈ మొక్క పేరు క్లినియా గ్రాండిఫ్లోరా (కుందేలు చెవిఆకు). ఆస్టరేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. దీని ఆకులు, వేర్లు ఆరోగ్య సమస్యలకు చికిత్సగా వాడతారు. ఆకురసాన్ని దద్దుర్లు, దురదలను తగ్గించేందుకు వాడతారు. మూత్ర సంబంధ వ్యాధులను సైతం నివారిస్తుంది.

ఆయిల్‌ నట్‌ట్రీ (నూనెగింజల చెట్టు). దీని విత్తనాల నుంచి నూనె తీస్తారు. ఔషధాల తయారీతోపాటు వంటల తయారీకి కూడా ఉపయోగిస్తారు. చర్మ సంబంధ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలకు ఈ నూనె వాడతారు. ఇంధనం, సబ్బులు, వార్నిష్‌ల‌ తయారీకి సైతం దీని నూనెను ఉపయోగిస్తారు.

నిమ్మగడ్డి. జీర్ణక్రియను మెరుగుపరిచి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఒత్తిడిని తగ్గించి శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది. వంటకాల్లో సైతం నిమ్మగడ్డి ఒక ప్రత్యేకమైన రుచితోపాటు సువాసనను అందిస్తుంది. వేడినీటిలో మరిగించి టీలా తాగుతారు కొందరు.

నోని మొక్క. రుబియాసియే కుటుంబానికి చెందిన ఈ మొక్కతో ఔషధ ప్రయోజనాలు అనేకం. బ్లడ్‌ప్రెషర్‌ (బీపీ)ని కంట్రోల్‌ చేస్తుంది. కేన్సర్‌ నివారణకు ఈ మొక్క పండ్లు దోహదపడతాయి. నోనిలో యాంటీ యాక్సిడెంట్స్, ఖనిజాలు విటమిన్లు పుష్కలం. నోని పండ్లను నేరుగా లేదా జ్యూస్‌గా తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరిగి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. షుగర్‌ నియంత్రణకు దోహదపడుతుందంటున్నారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్న మొక్క వైల్డ్‌గ్రేప్‌ (నల్లేరు). విటాసియే కుటుంబానికి చెందింది. అనేక ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్క ఎముకల పెరుగుదల, పగుళ్లను నయం చేయడం, దగ్గు, జలుబు, జీర్ణ సమస్యలకు ఔషధంగా, కాల్షియం బూస్టర్‌గా పరిగణిస్తారు.

అలోవేరా (కలబంద) ఈ మొక్క అందరికీ సుపరిచితం. గాయాలను నయం చేయడంలో ముఖ్యపాత్రను పోషిస్తుంది. చర్మం, జుట్టు పెరుగుదల, సంరక్షణ, చుండ్రు నివారణకు దోహదపడుతుంది.

రణపాల (బ్రయోఫిలమ్‌). కిడ్నీలో రాళ్లు, చర్మవ్యాధులు, దగ్గు, జ్వరం, జీర్ణ, ఎముకల సమస్యల నివారణకు ప్రత్యేకంగా ఈ మొక్క ఆకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులు ఎముకలకు బలాన్ని చేకూరుస్తాయని వైద్యులు చెబుతారు.

గణపత్రి. ఇది విస్తృతంగా కనిపించే సుగంధపు మొక్క. ఆకులు, పూలు, విత్తనాలు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. నొప్పి నివారణకు, యాంటీ యాక్సిడెంట్స్‌ పుష్కలంగా లభించే ఈ గణపత్రి మొక్క జీర్ణక్రియ మెరుగుదలకు, రోగనిరోధక శక్తి పెంపునకు ఉపయోగపడుతుంది. దగ్గు, జలుబు నివారణకు, చర్మ సంబంధ వ్యాధుల చికిత్సలో సైతం ఉపయోగిస్తారు.

మల్టీ విటమిన్‌ ప్లాంట్‌. సైంటిఫిక్‌ నేమ్‌ సౌరోపస్‌ ఆండ్రోజినస్‌. ఏ, బీ, సీ, కే విటమిన్లను సమృద్ధిగా అందించే మొక్క. కాల్షియం, పొటాషియం, ఐరన్‌ వంటి ఖనిజాలను కలిగి హిమోగ్లోబిన్‌ ఉత్పత్తికి, రక్తపోటు నియంత్రణకు దోహదపడుతుంది. కొలెస్ట్రాల్, మధుమేహం, చెవినొప్పి నివారణలకు ఔషధంగా వినియోగిస్తారు.

చ‌ద‌వండి: ఐదేళ్ల శ్ర‌మ ఫ‌లించింది.. ఇంగువ పండింది                 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)