Breaking News

మ్యాథ్స్‌ చెప్పే ముచ్చట్లు...!

Published on Wed, 05/27/2026 - 12:31

త్రికోణం... ఈ షేప్‌లో లైన్స్‌ నిటారుగా మూడు మూలలు (కోణాల) సమానంగా కలిసి ఉంటాయి. ఈ కోణాలను చూపుతూ – కుటుంబం, స్నేహితులు, టీచర్లు.. అనే మూడింటి ద్వారా జీవితాలు ఎలా నిలబడతాయో చెప్పవచ్చు. అలాగే లక్ష్యం, కష్టం, సహనం.. ఉంటే విజయానికి ఎలా చేరుతామో నేర్పచ్చు.

త్రిభుజాల షేప్స్‌లలో భిన్నమైనవి కూడా ఉంటాయి. రెండు లైన్స్‌ చిన్నగా, మూడవ లైన్‌ పొడవుగా కూడా ఉండవచ్చు. పొడవుగా ఉండే లైన్‌ మీరే’ అని చెప్పవచ్చు. ఆ పొడవైన లైన్‌ ద్వారా అందరికన్నా ఎంత క్రియేటివ్‌గా, ఎంత గొప్పగా, ‘నేను నా ఇండివిడ్యువాలిటీని చూపించాలి’ అనే ఆలోచన చూపవచ్చు.. అని వివరించవచ్చు.

దీర్ఘచతురస్రం...
ఈ షేప్‌లో నాలుగు స్ట్రెయిట్‌ లైన్స్‌ ఉంటాయి. అవి.. పుస్తకాలు, క్లాస్‌రూమ్‌ బోర్డు, టైమ్‌ మేనేజ్‌మెంట్, డిసిప్లిన్‌.. అవసరమని చెప్పవచ్చు.

చతురస్రం: సమానత్వం...
నాలుగు సైడ్లు సమానం కాబట్టి అందరినీ సమానంగా చూడాలి. ప్రశ్నించే స్వభావం, విలువలు నేర్పచ్చు.

సర్కిల్‌...
ఐక్యంగా కలిసిమెలిసి ఉండటం ఎలాగో చెప్పవచ్చు. సర్కిల్‌ అంటే మొదలు చివర లేకుండా కలిసి ఉండే షేప్‌. ఇందులో కుటుంబం, స్నేహం, టీమ్‌వర్క్‌ ఎప్పటికీ కొనసాగాలని చెప్పవచ్చు.

లైన్‌...
పొడవుగా ఉన్నా, చిన్నగా ఉన్న ఒక గీతను పేపర్‌పైన గీయండి. ఆ గీతను చూపుతూ ఒక గమ్యానికి నేరుగా వెళ్లే మార్గంలా, జీవితంలో లక్ష్యంపై దృష్టి పెట్టేలా నేర్పవచ్చు.

నిలువు గీతలు...
దగ్గర దగ్గరగా ఉండేలా కొన్ని నిలువు లైన్స్‌ని స్కేల్‌ సాయంతో గీయమని చె΄్పాలి. ఇవి ఒకదానిని ఒకటి అంటుకోవు. అంటే ఇతరుల స్పేస్‌కి గౌరవం ఇవ్వాలి అని వివరించవచ్చు.

సెమీసర్కిల్‌...
అర్ధచంద్రాకృతి. అర సగం షేప్‌ను చూపుతూ అసంపూర్ణత కూడా సహజమే అనే విషయాన్ని చె΄్పాలి. ప్రతి పని మొదట్లోనే పూర్తి కావాలని ఏమీ లేదు. క్రమంగా పూర్తి అవుతుందనే నిజాన్ని వివరిస్తూనే ధైర్యంగా ఉండటం ఎలాగో చెప్పవచ్చు.

ఈ షేప్స్‌ వల్ల పిల్లల్లో పరిశీలనాసక్తి, సమస్యను పరిష్కరించడం, టీమ్‌ వర్క్, సహనం, ఆత్మవిశ్వాసం వంటి జీవన నైపుణ్యాలు పెరుగుతాయి. వేసవి యాక్టివిటీలో భాగంగా జామెట్రీ షేప్స్‌ను తెల్లని పేపర్‌ మీద గీయమని చెబుతూ ఎన్నో విషయాలను చెప్పవచ్చు. వారినీ చెప్పమనవచ్చు. దీని వల్ల ఆలోచనాశక్తి, సృజనాత్మకత అలవడతాయి. - నిర్వహణ: నిర్మలారెడ్డి 

Videos

హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ DK శివకుమార్ అనే నేను

ఆకాశం నుంచి నిప్పుల వాన

నువ్వు, నీ దిక్కుమాలిన ఆలోచనలు... పనికొచ్చే పని చేయవా..?

బాబు లోకేష్ ని ఇమిటేట్ చేసిన కొడాలి నాని ఓ రేంజ్ లో మాస్ వార్నింగ్

సిగ్గులేకుండా మహానాడుకు, స్త్రీ శక్తి అని పెట్టుకున్నారు

పినరయి విజయన్ నివాసం వద్ద ED టీం పై CPM దాడి

రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం జోసెఫ్ విజయ్

పోలీస్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన సాక్షి రిపోర్టర్

భారత కంపెనీల లాభాలకు రిస్క్ ఆందోళనలో పారిశ్రామికవేత్తలు

ప్రతి ఇంట్లో బాబు వెన్నుపోటు పాలనపె చర్చ జరగాలి

Photos

+5

వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ (ఫొటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

ఈ బుక్‌లెట్‌ ప్రతి ఇంటికీ చేరాలి: వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

మోహినీ రూపంలో అవతారంలో శ్రీగోవిందరాజస్వామి (ఫొటోలు)

+5

హీరో ఉపేంద్ర ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

చిట్టి గౌనులో నజ్రియా క్యూట్‌ లుక్స్‌(ఫోటోలు)

+5

మెరిసిపోతోన్న కాజల్... అదిరిపోయిన అందాల చందమామ లేటెస్ట్ ఫోటో షూట్

+5

విశాఖపట్నంలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

సొంత ఊరు జాతరలో స్టెప్పులు వేసిన దేవిశ్రీ ప్రసాద్ (ఫొటోలు)

+5

ఎలిమినేట‌ర్ పోరు.. నితీశ్ రెడ్డి బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌ (ఫొటోలు)