Breaking News

మసాబా మెచ్చిన చ్యవన ప్రాశ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా!

Published on Sat, 12/07/2024 - 11:43

ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబా గుప్తా  ఓ సెలబ్రిటీ. ఆమె శీతాకాలంలో తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చ్యవన్రప్రాశ తీసుకుంటోంది. చరక సంహిత, భావప్రకాశ, రస రత్న సముచ్చయ వంటి ఆయుర్వేద గ్రంథాలు చెప్పిన ఔషధం ఇది. దీనిలోని ఆరోగ్యకారకాలను వివరించాలంటే ఒక్కమాటలో ఆల్‌ఇన్‌వన్‌ అని చెప్పవచ్చు. చ్యవన ముని కనుక్కున్న ఫార్ములా ఇది. ఈ ఔషధం ఎనర్జీ బూస్టర్, ఇమ్యూనిటీని పెంచుతుంది. శక్తినిస్తుంది, జీవనకాలాన్ని పెంచుతుంది. మూలికల సూక్ష్మమైన ΄ోషకాల సమ్మిళితం ఇది. తన కంటిచూపు తగ్గినప్పుడు ఈ ఔషధాన్ని వాడడం ద్వారా తిరిగి మునుపటి చూపును  పొందినట్లు రాశాడు చ్యవనుడు. అయితే చ్యవన ప్రాశను ఇంట్లో సులువుగా తయారు చేసుకునే విధానాన్ని సెలబ్రిటీ షెఫ్‌ అనన్యా బెనర్జీ ఇలా వివరించారు. 

కావలసినవి: ఉసిరి కాయలు– అర కేజీ; బెల్లం లేదా తేనె– 300 గ్రాములు; నెయ్యి– 100 గ్రాములు; నువ్వుల నూనె – టేబుల్‌ స్పూన్‌; దాల్చిన చెక్క  పొడి– టీ స్పూన్‌; యాలకుల  పొడి– టీ స్పూన్‌; లవంగాల పొడి– అర టీ స్పూన్‌; జాజికాయ  పొడి– అర టీ స్పూన్‌; అశ్వగంధ  పొడి– టీ స్పూన్‌; శతావరి  పొడి– టీ స్పూన్‌; డ్రై ఫ్రూట్స్‌ : కిస్‌మిస్, డేట్స్, ఫిగ్స్‌ – 50 గ్రాములు (అన్నీ కలిపి). 

తయారీ:  డ్రైఫ్రూట్స్‌ను సన్నగా తరిగి పెట్టుకోవాలి  ఉసిరికాయలను శుభ్రంగా కడిగి ఆవిరి మీద కానీ నేరుగా నీటిలో కానీ ఉడికించాలి. చల్లారిన తర్వాత కాయలను కొద్దిగా చిదిమి గింజలు తొలగించి గుజ్జు అంతటినీ ఒక పాత్రలో వేసుకోవాలి ∙మందపాటి పాత్రను వేడి చేసి అందులో నెయ్యి, నువ్వుల నూనె వేయాలి. అవి వేడెక్కిన తర్వాత ఉసిరికాయల గుజ్జు వేసి గరిటెతో కలుపుతూ పది నుంచి పదిహేను నిమిషాలపాటు మగ్గనివాలి. మిశ్రమం చిక్కబడి, దగ్గరగా అయిన తర్వాత అందులో బెల్లం  పొడి లేదా తేనె కలిపి చిన్న మంట మీద ఉంచాలి. మిశ్రమం అడుగుపట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ తీపి... ఉసిరితో సమంగా కలిసిన తర్వాత యాలకుల పొడి, లవంగాల  పొడి, దాల్చినచెక్క  పొడి, జాజికాయ  పొడి, అశ్వగంధ, శతావరి, కిస్‌మిస్‌తో పాటు మిగిలిన డ్రైఫ్రూట్స్‌ పలుకులను వేసి సమంగా కలిసేవరకు గరిటెతో కలియబెట్టి దించేయాలి. దించిన తర్వాత కూడా పాత్ర వేడికి అడుగున ఉన్న మిశ్రమం మాడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దించిన తర్వాత చల్లారేలోపు రెండు –మూడు సార్లు గరిటెతో కలపాలి.

చల్లారిన తరవాత తేమ లేని బాటిల్‌లోకి తీసుకుని గాలి దూర కుండా గట్టిగా మూత పెట్టాలి. ఫ్రిజ్‌లో పెట్టుకుని శీతాకాలమంతా వాడుకోవచ్చు  దించిన తర్వాత ఒకసారి రుచి చూసుకుని తీపి సరిపోలేదంటే మరికొంత తేనె కలుపుకోవచ్చు  ఉసిరికాయలు వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి, అశ్వగంధ ఒత్తిడిని తగ్గించడానికి, నెయ్యితోపాటు ఇతర సుగంధద్రవ్యాలు జఠరాగ్నిని పెంచి పోషకాలను దేహం సమర్థంగా శోషించుకోవడానికి దోహదం చేస్తాయి.

రోజుకు పెద్దవాళ్లు రోజూ ఉదయం ఒక టేబుల్‌ స్పూన్‌ తినాలి (15–20 గ్రాములు). పిల్లలకైతే టీ స్పూన్‌ (5–10 గ్రాములు) చాలు. చ్యవన్ర΄ాశ తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత కఫం సమస్యలు కనిపిస్తే మోతాదు తగ్గించాలి లేదా చ్యవన ప్రాశను వేడినీటిలో కలిపి తీసుకోవాలి.
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)