Breaking News

ఔనా ..! ఏకంగా 66 శాతం మగజాతి రాముడిలా ఏకపత్నీవ్రతులా!

Published on Sun, 12/14/2025 - 11:29

ఇప్పుడు చెప్పబోయే విషయం బాగా ఆశ్చర్యపర్చవచ్చు లేదా మీరు అస్సలు నమ్మలేక పోవచ్చు. కాన్సెప్ట్ అలాంటిది. ఈ కథనంలో విషయం విన్న తరువాత ఔరా అని ముక్కున వేలేసుకోకుండా ఉండలేరు. ఆలస్యం చేయకుండా అసలు విషయం చెప్పేస్తాను, చకచక చదివేయండి మరి..!. 

ఈ ఆధునిక సమాజంలో బంధం అనేది పిడికిలిలో ఉన్న మట్టి లాంటిది. ఎంత సేపు ఒడిసి పట్టుకున్నా వేళ్ళ సందుల్లోంచి జారిపోతాయి ఈబంధాలు. అటువంటి బంధాలకు సంబంధించినదే ఈ స్టోరీ. ఇటీవల ఓ సర్వే ప్రకారం మగవాళ్ల  గురించి పెద్ద మార్కులే వేసింది. అది మార్క్ డీబుల్ సర్వే. దీని ప్రకారం  66శాతం మగవాళ్లు ఏకపత్నీవ్రతులుగా తేలారు. ఇది నిజమా అబద్ధమా అన్నది ఓ సారి చూద్దాం. అసలు ముందు మార్క్ డీబుల్ అనేది డాక్టర్ మార్క్ డైబుల్  అనే సైంటిస్టు నుంచి పుట్టిన పేరు. 

ఆయన 2025లో *Proceedings of the Royal Society: Biological Sciences*లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, మగవాళ్ళలో  66 శాతం ఏకపత్నీత్వ రేటు ఉంది. ఇది సాదా సీదా సర్వే కాదు, అంటే ఆయన ప్రపంచంలోని అన్నీ జీవచరాలలో ఉన్న మగజాతిపై చేసిన సర్వే. అసలు ఆయన ఈ సర్వే ఎలా చేశాడంటే.. ఏకంగా 11 జాతుల మామల్స్ తోపాటు 94 మానవ సమాజాల డేటాను వాడి, కంప్యూటేషనల్ మోడల్‌తో విశ్లేషించారు. 

ఈ సర్వే ప్రకారం  ఏకపత్నీతత్వంలో ఏఏ జాతులు, ఏఏ ప్రాంతంలో ఉన్నాయో ఓ సారి చూద్దాం. టాప్‌లో కాలిఫోర్నియా ప్రాంతంలోని  డీర్‌మౌస్ వందశాతంతో , ఆఫ్రికన్ వైల్డ్ డాగ్ లు 85శాతంతో ఉన్నాయి. ఇక చివర్లో మౌంటైన్ గొరిల్లాలు 6శాతం చింపాన్జీలు 4శాతంగా ఉన్నాయి. అంటే వీటికి అచంలత్వం ఎక్కువ. ఇక మనుషులు 4 శాతం మాత్రం ఉన్నారు. భారతదేశంలో ఏకపత్నీత్వం సాంప్రదాయం ఎక్కువగా ఉండేది . కానీ ఓ  బ్రిటిష్ సర్వే ప్రకారం ఆధునిక యువతలో 31శాతం దీన్ని అసాధ్యం అని చెబుతున్నారు.

ఇప్పుడు ఈ అధ్యయనం వల్ల మనకు తెలిసింది ఏమిటంటే ఏకపత్నీత్వం అనేది మన జీన్స్‌లో లేదు, సమాజంలో ఏర్పడింది. ఇది మనల్ని ఓ విధంగా  ఒత్తిడి  కలిగిస్తుంది. ఆధునికంగా, జెన్ Zలో 50శాతం మంది మోనోగమీని అంటే ఏకపత్నీత్వం ఔట్‌డేటెడ్ అని చెబుతున్నారు – ఓపెన్ రిలేషన్‌షిప్స్ పెరుగుతున్నాయి. 

మగవాళ్లు పాలిగినీకి అంటే ఒకరి కన్నా ఎక్కువ సంబంధాలు పెట్టుకోవడం పట్ల 6 రెట్లు ఆసక్తి చూపుతున్నారని మరో అధ్యయనం చెబుతుంది. అయితే మన తెలుగు సంస్కృతిలో "ఒక్కటి మంచిది" అనే సామెత ఉంది, కానీ ఈ డేటా మనల్ని ప్రశ్నించేలా చేస్తుంది: మన సంబంధాలు ఎంత "నేచురల్" అనే  ప్రశ్న పెరుగుతుంది.

ఫ్రెండ్స్..ఒకరితో బంధం అంటే జీవితాంతం అది అనుబంధం అవుతుంది. అదే ఒకరి కన్న ఎక్కవైతే అది బంధాలకు అతీతం అవుతుంది. ఏది ఏమైనప్పటికీ జీవితబంధమా లేక అతీతసంబంధమా అనేది ఎవరికి వారే తెలుసుకోవాలి మరి..!.

 

(చదవండి: 'చాట్ జీపీటీతో లవ్‌'..! ఎందుకో తెలిస్తే షాకవ్వడం ఖాయం..ముఖ్యంగా భారతీయులే..)

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)